పాపులవీడు శివలింగము. ~ దైవదర్శనం

పాపులవీడు శివలింగము.


నల్లమల అడవిలో..ఉయ్యాలవాడ నరసింహారెడ్డి త్రవ్వించిన కోనేరు.... ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం బురుజుపల్లె గ్రామానికి కొద్ది దూరంలో అడవిప్రాంతం వుంది. అక్కడ చరిత్రకు అందని కాలంలో నల్లమల అడవిలో ఉలింద చెట్టు క్రింద శివలింగం వుండేది. దానిని ఆటవికులు, సాధువులు వెళ్ళి పూజించేవారు.

కాశీ పట్టణాన్ని బ్రుగువ రాజు పాలించేవాడు. ఆయనకు సంతానం లేక కాశీ విశ్వేశ్వరుని గురించి ధ్యానించి పూజించడంతో పురుష సంతానం కలిగింది. అతని ముఖముకు వికృతమైన మాంసపు కండలు వేలాడుతూ జన్మించాడు. ఆ కుమారున్ని చూసి రాజు మిక్కిలి చింతించి దిగులులో పరుండి నిద్రించు చుండగా ఒకనాటి రాత్రి కలలలో కాల భైరవుడు కనిపించి మీకుమారున్ని దక్షిణా పదమున పుణ్య తీర్ధములులలో స్నానమాడించిన ఆ మాంసపు కండలు ఊడి పోవునని తెలిపెను. దానితో రాజు శ్రీశైల క్షేత్రములు దర్శించి చివరకు పాపులవీడుకు వచ్చి ఆ శివలింగమును పూజించి ప్రక్కనే ఉన్న నీటి పడియలో కుమారున్ని స్నానం చేయించాడు. వెంటనే ఆ పిల్లవాని ముఖానికి వున్న మాంసపు ఖండలు వూడిపోయాయి. అందుచేత పలుపు ఆకారం నున్న మాంసపు ఖండములు ఊడిపోయిన చోటు కావున దానికి పలుపులవీడు అని నామకరణం చేసి ఆ శివలింగమునకు గుడి కట్టించి బ్రుగువ రాజు వెళ్ళెను. అప్పటి నుండి ఆ దేవాలయమునకు పలుపులవీడు బీరవీశ్వరుడు అని పిలిచెడివారు. 1214 సంవత్సరమున సరెయ్న ఆనంద నామ సంవతరమున మనుమ సిద్ధి మహారాజు సామంతుడైన రాయదేవ మహారాజు ఈ ఆలయాన్ని పునరుద్ధరింఛి ఆలయానికి కొద్దిపాటి భూవసతి కల్పించినారు. ఈ విషయం తెలుపు శాసనం అచట కలదు. సమీపంలోని కొత్తకోట గ్రామమును పాలించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇచ్చట కోనేటిని త్రవ్వించారని జనులు అనుకుంటారు.

https://www.facebook.com/rb.venkatareddy
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List