అగస్త్య మహర్షి ఆంధ్రదేశంలో అడుగడుగునా శివలింగాలు ప్రతిష్ఠిస్తూ తాను కాశీ విశ్వేశ్వరుని వదలివచ్చిన దు:ఖం పోగొ ట్టుకున్నాడని చెప్తారు. అలా ఆయన ప్రతిష్ఠించిన క్షేత్రాలలో ఒకటి తెనాలి దగ్గరి నందివెలుగు. విజయవాడ-చెన్నై రైలు మార్గంలో ఉన్న తెనాలికి రైలు ద్వారా కానీ, బస్సులో కాని చేరుకుని తర్వాత ఆటోలో పదిహేను నిమిషాలు ప్రయాణం చేస్తే నందివెలుగు చేరుకుంటాం. ఈ గ్రామం తెనాలిలోని
భాగ మం అని కూడా భావించవచ్చు. ఈ నందివెలుగు గ్రామం అత్యంత పురాతన, చారిత్రక ప్రాముఖ్యం గల శైవ క్షేత్రం. ఏనాడో అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన ఈ లింగం, దేవాలయం కాలగతిలో దట్టమైన అడవులు పెరగడంతో మానవ సంచా రం లేనిదై మరుగున పడిపోయాయి. చాళుక్యులు ఈ ప్రాం తాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో శివభక్తుడైన విష్ణువర్థన మహా రాజు ఒకసారి ఈ అరణ్య ప్రాంతానికి రాగా ఈశ్వరుడు ప్రకట మనాడు. మహాశివభక్తుడైన విష్ణువర్థనుడు ఈ అగస్తేశ్వర స్వా మికి తేజ:పుంజాలతో నిత్యార్చన జరగాలని సంకల్పించి, అమూల్యమైన రత్నాలను వినాయకుని బొజ్జలోనూ, నందీ శ్వరుని శృంగంలోనూ నిక్షిప్తం చేయించాడు. వినాయకుడి బొ జ్జలోని రత్నాల నుంచీ వెలువడే తేజ:పుంజాలు నంది కొ మ్ములలోని రత్నాలపైన పడి పరావర్తనం చెంది మూల వి రాట్టు పాదాలపై పడి నిత్యార్చన చేసేలా అతి గొప్పగా నిర్మా ణం చేశారు ఆనాటి శిల్పులు. నంది కొమ్ములలోంచి వెలుగు రేఖలు రావటం వలన ఆ గ్రామం పేరే నంది వెలుగుగా మా రిపోయింది. ఒక మంత్ర వేత్త ఇక్కడికి వచ్చి, నంది వెలుగు చేరుకుని నంది శృంగాలు, వినాయకుని గర్భమూ ఛేదించి ర త్నాలు అపహరించాడట. మూలవిరాట్టు అగస్త్యే శ్వర స్వామి వారికి ఒకవైపు పార్వతీ అమ్మవారు, ఎదురుగా జ్యోతిర్నంది, ఓ పక్క జ్యోతిర్గణపతి, మరోవైపు శ్రీ ఆంజ నయస్వామి ఉన్నారు. వీరేకాక ఇంకా తల్లి శ్రీకనకదుర్గ రమా సహిత సత్య నారాయణ స్వామివారు నటరాజు, చండీశ్వరుడ, కాల భైరవు లు, నవగ్రహాధిపతులు, జగద్గురు శ్రీ ఆదిశంకరా చార్య, శ్రీ కంఠ శివాచార్యుల వారు కూడా ఇక్కడ ప్రతిష్ఠితులై నిలచి ఉన్నారు.
No comments:
Post a Comment