* శ్వేతవర్ణ స్కందమాతను పూజిస్తే...!!
* స్కందమాత మనసు ఎలా గెలుచుకోవాలి..??
* కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా స్కందమాత...

.
దక్షిణభారతదేశంలో కుమారస్వామి ఆరాధనకి ప్రాముఖ్యత ఎక్కువ. ఇటు శక్తినీ, అటు ముక్తినీ ప్రసాదించగల ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడంటే మనకి భక్తి మెండు. మరి అలాంటి కుమారస్వామిని తల్లితో సహా ఆరాధించే సందర్భం వస్తే... ఇంకెంత ఫలదాయకమో కదా! అలాంటి అవకాశాన్ని అందించే తల్లి- స్కందమాత!

ఒకప్పుడు పరమశివుని తేజస్సు స్ఖలనమైతే, ఆ తేజస్సుని ఎవ్వరూ పట్టుకోలేకపోతే, భూమి ఆ తేజస్సును స్వీకరించినందుకు పార్వతీదేవి శపిస్తే, భూమి స్వీకరించిన ఆ పరమశివుని తేజస్సును అగ్నిహోత్రుడు తలలో ఉంచుకొనగా, తారకాసుర సంహారం కోసం దేవతలందరూ అగ్నిహోత్రుని దగ్గిరకు వెళ్లి తారకాసుర సంహారం కోసం నీవు నీలో నిక్షిప్తం చేసుకున్నటువంటి శివ తేజస్సును హిమవంతుని పెద్ద కూతురు అయిన గంగయందు ప్రవేశపెట్టమని కోరగా, ఆవిడ పార్వతీదేవికి అక్క అవుతుంది కాబట్టి, శివుని యొక్క తేజస్సు గంగయందు ప్రవేశపెట్టమనగానే, అగ్నిహోత్రుడు ఇలాంటి విషయాన్ని ఒక పరస్త్రీతో మాట్లాడేటప్పుడు నలుగురి ఎదుట మాట్లాడకూడదు కాబట్టి, ఒంటరిగా గంగమ్మ దగ్గిరకి వెళ్లి అసలు విషయాన్ని అంతా కూడా చెప్పి, నీవు చాలా ఆనందంగా నిర్మలమైన మనస్సుతో ఈ శివ తేజస్సును స్వీకరించు అనగానే గంగమ్మతల్లి ఆ శివ వీర్యాన్ని స్వీకరించింది. ఆమె గర్భం పెరిగి కొడుకు పుట్టాలి. కాని, శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే ఆమె క్షుభితం అయిపోయి తట్టుకోలేక పోయింది. ఉడికిపోయి ఈ వేడి నేను భరించలేను, పిండం విడిచి పెట్టేస్తాను అన్నది. ఇంకా పూర్తిగా ఏర్పడని ఈ పిండాన్ని వదిలి పెడతాను అంటున్న గంగమ్మతో దేవతలు నిండుగా ప్రసవ సమయం ఆసన్నమవకుండా నీ కడుపులో నుంచి జారిపోతున్న, గర్భస్రావం అవుతున్న వాడిని తీసుకొని వెళ్లి హిమాలయ ప్రాంతంలో చిన్న కొండ మీద రెల్లుదుబ్బులలో విడిచిపెట్టమని చెప్పారు. తీసుకుని వెళ్లి గంగమ్మ వదిలివేసింది. అక్కడ గంగకు గర్భస్రావము అయితే పుట్టాడు కనుక స్కందుడు అని పేరు వచ్చింది. అలా పుట్టిన వాడి తల్లికి నవదుర్గలలో ఒకడైన స్కందమాత అనే పేరు వచ్చింది. గంగకి గర్భస్రావమైతే పార్వతీదేవి ఎలా తల్లి అయింది అనే సందేహం కలుగుతుంది.
.
.
ఒకప్పుడు సనత్కుమారుల వారికి ఒక కల వచ్చింది. ఆయన దేవతా పక్షాన నాయకత్వం వహించి రాక్షసుల మీద యుద్ధం చేసి వారిని చంపినట్లుగా కల వచ్చింది. నాకు ఇటువంటి కల ఎందుకు వచ్చిందా అని ఆయన బ్రహ్మగారిని అడిగాడు. ఆయన ఈ కలకు నీవు క్రిందటి జన్మలో బ్రహ్మచారిగా ఉండగా వేదంలో రాక్షసుల యుద్ధం గురించి చదివి ఎప్పటికైనా దేవతల పక్షానికి నాయకత్వం వహించి రాక్షస సంహారం చేయాలన్న కోరిక నీ మనసులో ప్రవేశించింది. అదే వాసనా బలం ఉండిపోవడం వల్ల ఈ కల వచ్చింది. ఇప్పుడు ఆ వాసనా బలం ఏమవ్వాలంటే ఆ కోరిక తీరిపోవాలి. ఇంతటి మహానుభావుడు ఈయన కోరిక తీర్చాలని పరమశివుడు సనత్కుమారుల చెంత ప్రత్యక్షమయ్యాడు.
.
.
సనత్కుమారుల వారు తనలో తాను రామిస్తూంటే పార్వతీ పరమేశ్వరులు ఆ సనత్కుమారులకు అర్ఘ్యపాద్యాదులను ఇచ్చి మమ్మల్ని సత్కరించవా అని అడుగగా, నాకు తెలిసింది ఒక్కటే, అంతా బ్రహ్మమే. ఆయన జ్ఞానానికి పొంగిపోయిన పరమశివుడు నీకు ఏదైనా వరం ఇస్తాను కోరుకో అన్నాడు. నాకు ఏ కోర్కెలు లేవు అని సనత్కుమారులవారు పలుకగా, అయితే నేను నిన్ను శపిస్తాను అని పరమశివుడు పలుకగా, నాకేమి బెంగలేదు, ఆత్మకు చావులేదు, నాకేమి బెంగలేదు కాబట్టి నాకు శాపం తగలదు అనగానే, వెంటనే పరమశివుడు 'ఏమి మహాజ్ఞాని' అనుకున్నాడట. అమ్మవారు కూడా ఆహా! ఎంతటి జ్ఞాని. ఇంతటి జ్ఞానికి నేను తల్లి కావాలని కోరున్నది. వెంటనే సనత్కుమారుల వారు మీకేమైనా వరం కావాలంటే కోరుకోండి అని సనత్కుమారుల వారు అడిగారు. వెంటనే, నాకు కొడుకుగా రమ్మనమని శివుడు అడుగగా, నేను నీకే కుమారిడిగా వస్తాను అని సనత్కుమారుల వారు వరం ఇచ్చారు. వెంటనే అమ్మవారు నీకే కొడుకుగా అంటే, నాకు కొడుకుగా రావా. అంటే ఎంత జగన్మాతవైనా లోకరక్షణ కర్తవ్యం ఉన్నదానివి. అయినా స్త్రీ కడుపున అధోముఖంగా ఉండి యోని సంభవుని కాలేనమ్మా! శివునికి కొడుకుగా వస్తానన్నాడు. ఇంతటి మహాజ్ఞాని నాకు కొడుకు కాకపోతే ఎలా అని ఆవిడ ఒక కోరిక కోరింది.
.
.
భస్మాసురుని అనుగ్రహించిన పరమశివుడు వెనుతిరిగి వెళుతూండగా, భస్మాసురుడు తన హస్తాన్ని ఆ పరమశివుని మీదే ఉంచడానికి ప్రయత్నించగా, ఆయన అదృశ్యమయ్యాడు. అమ్మవారు తాను కనపడకుండా తన శరీరాన్ని నీటి కుండలు ఒక తటాకంగా మార్చింది. శరవణతటాకం అంటారు. కైలాసగిరి పర్వత పాదాల దగ్గిర ఉంది. నా శరీరం నుంచి రాను అంటున్నావు కదా! నువ్వు పుట్టేటప్పుడు ఆ తటాకం నుండి బయటకురా. నీకు శరవణభవ అని పేరు మాత్రం కూడా అదే. అందుకే శరవణభవ అయి ముమ్మూర్తులా తల్లి పోలికలను పుణికిపుచ్చుకుని ముద్దులు మూటకట్టే మోముతో ఉంటాడు మన శరవణభవ. గంగా గర్భం నుండి స్ఖలనమయి స్కందుడైతే, స్కందునికి తల్లి అయింది కాబట్టి స్కంధము అయింది.
.
.
భక్తులను అనుగ్రహించడంలో తండ్రి వేగం ... తల్లి మనసు స్కందుడిలో కనిపిస్తాయి. అనేక దోషాలను నివారించి భక్తుల కోరికలను నెరవేర్చడంలో స్కందుడు ముందుంటాడు. ఈ కారణంగానే ఆయనని ఆరాధించే భక్తులంతా అమ్మవారిని స్కందమాతగా కొలుస్తుంటారు. తల్లీ కొడుకులుగా తమ అనురాగాన్ని ఆవిష్కరిస్తూ ఒడిలో షణ్ముఖుడితో అమ్మవారు దర్శనమిస్తూ వుంటుంది. తన భక్తులను కాపాడే నిమిత్తం అమ్మవారు సింహ వాహనాన్ని అధిష్ఠించి తిరుగుతూ ఉంటుంది.
.
.
అమ్మవారికి 'పారిజాత పూలు' అత్యంత ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి. అందువలన నవరాత్రులలో అమ్మవారిని సాధ్యమైనంత వరకూ పారిజాతపూలతో అర్చిస్తుంటారు. ఇక ఆమెకి 'పెరుగు అన్నం' అంటే ఎంతో ఇష్టం కనుక దానినే నైవేద్యంగా సమర్పిస్తూ వుంటారు. 'స్కందమాత' గా అమ్మవారి అలంకరణ చూడటానికి ఈ రోజున భక్తులంతా పెద్ద సంఖ్యలో ఆలయాలకి వెళుతూ వుంటారు. బిడ్డతో పాటు దర్శనమిచ్చే ఆ తల్లిని దర్శించుకుని ధన్యులు అవుతుంటారు.
.
.
మూలరూపమైన ఆదిపరాశక్తి దుర్గతులను నశింపజేస్తూ విజయాలను ప్రసాదిస్తుంది. ఇక స్కందమాతగా అమ్మవారు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆమె ఒడిలోని స్కందుడు సంతాన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. అందువలన ఈ రోజున అమ్మవారి దర్శన భాగ్యం వలన మనోభీష్టాలు నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఆ తల్లికి ఇష్టమైన పూలను ... నైవేద్యాలను సమర్పిస్తూ అమ్మవారి మనసు గెలుచుకుంటూ వుంటారు.

No comments:
Post a Comment