సృష్టి రహస్యం ఛేదిస్తారా? ~ దైవదర్శనం

సృష్టి రహస్యం ఛేదిస్తారా?




శాస్త్ర, సాంకేతిక ప్రయోగాల్లో కొత్త శకం మొదలయ్యింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయోగం తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. విశ్వమూలాలను కనిపెట్టడానికి మొదలైన ఎల్‌హెచ్‌సీ ప్రయోగంలో తొలిమెట్టును విజయవంతంగా అధిగమించారు సైంటిస్టులు. బ్లాక్ హోల్ అంతు తేల్చడానికి నడుం బిగించిన శాస్త్రవేత్తలకు తొలి విజయం దక్కింది. ప్రపంచ మంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన బిగ్‌బ్యాంగ్ ప్రయోగం సక్సెస్ అయ్యింది. విశ్వసృష్టి రహస్యాన్ని ఛేధించడంలో తొలి అడుగు పడింది
భూమి ఎలా పుట్టింది... భూమి గమనానికి కారణమైన సౌరమండలం ఎలా ఏర్పడింది... సూర్యుని చుట్టూ గ్రహాలు తిరగడానికి కారణం ఏమిటి? అసలీ విశ్వంలో గ్రహాలు, నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయి... ఇలా అంతులేని ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్న శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగమే... LHC.
అనంత విశ్వం ఎలా ఏర్పడిందన్నది ఎంతోమంది శాస్త్రవేత్తల మదిని తొలుస్తున్న ప్రశ్న. దీనికి కారణాలను చెప్పడానికి ఎంతోమంది ప్రయత్నించినప్పటికీ.. శాస్త్రీయంగా మాత్రం ఏ సిద్ధాతమూ ఇప్పటివరకూ నిరూపణ కాలేదు. చివరకు బిగ్‌బ్యాంగ్ థియరీ ఆధారంగానే ఈ విశ్వం ఏర్పడిందని ఎక్కువమంది నమ్ముతూ వచ్చారు. బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం.. దాదాపు 14 వందల కోట్ల సంవత్సరాల క్రితం విశ్వంలో అతిపెద్ద విస్పోటనం సంభవించింది. ఈ విస్పోటనం తర్వాతే.. 
గ్రహాలు, నక్షత్రాలు ఏర్పడ్డాయి. సూర్యమండలూ ఇలానే అవతరించింది. భూమి పుట్టుకకూ కారణం ఈ పేలుడే. అయితే.. ఈ వాదనలో నిజమెంత అన్నది తేలడానికి ఓ మహాప్రయోగానికే శ్రీకారం చుట్టారు.. ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్తలు.
విశ్వం అనంతం.. విశ్వంలో మన భూమి కనీసం ఒక్కవంతు కూడా ఉండదు. అలాంటింది.. విశ్వం ఎలా ఏర్పడిందో తెలుసుకునే ప్రయోగాన్ని భూమిపై చేయడం సాధ్యమేనా.. అసలు శాస్త్రవేత్తలు దీనికోసం ఏం చేస్తున్నారు.. ఇది తెలుసుకోవాలంటే.. మనం జెనీవా వెళ్లాలి..
ప్రపంచ భౌతిక శాస్త్రవేత్తలు.. సృష్టి రహస్యంతో తలపడుతున్నారు. తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. బ్లాక్ హోల్ అంతు చూడడానికి సమాయత్తమయ్యారు. అందుకే.. చరిత్రలో ఎప్పుడూ లేనంత మహా ప్రయోగం. ఫిజిక్స్ ఎక్స్‌పరిమెంట్స్‌ను సాధారణంగా.. ఒకటో రెండో దేశాలు కలిసి చేయడం సర్వసాధారణం. కానీ.. ఈ ప్రయోగంలో మాత్రం... దాదాపు 40 దేశాలు పాలుపంచుకొంటున్నాయి. సృష్టి ఎలా ఏర్పడిందన్నది తేలితే.. విశ్వంలో రహస్యాలుగానే మిగిలిపోయిన ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అందుకే.. ఇంత భారీ ప్రయోగం..
స్విట్జర్లాండ్, ఫ్రాన్ సరిహద్దుల్లో ఈ ప్రయోగం జరుగుతుంది. దీనికోసం భూగర్భంలో ప్రత్యేకంగా ప్రయోగశాలను నిర్మించారు. ఈ ప్రయోగం పేరు.. లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్. భూమికి వంద మీటర్ల లోతులో.. ప్రత్యేకంగా ఈ ల్యాబ్‌ను నిర్మించారు. భూగర్భంలో దాదాపు 27 కిలోమీటర్ల పొడవైన సొరంగాన్ని ఈ ప్రయోగం కోసం ప్రత్యేకంగా నిర్మించారు. రెండు ప్రోటాన్ కాంతి పుంజాలను పరస్పరం వ్యతిరేక దిశలలో ప్రయాణింప జేసి.. ఒకదానితో ఒకటి ఢీకొట్టిస్తారు. దీనిద్వారా.. విశ్వసృష్టికి మూలమైన మహావిస్పోటనాన్ని కృత్రిమంగా సృష్టించాలన్నది సైంటిస్టుల ప్రణాళిక.
ఈ ప్రయోగం ఒక్కసారితో పూర్తైపోదు. ఇందులో అనేక దశలున్నాయి. ప్రోటాన్ కిరణాలను పదేపదే ఢీకొట్టిస్తారు. అయితే.. ప్రతీ దశలోనూ ఈ కిరణాల వేగాన్ని పెంచుతూ వెళతారు. తాజాగా జరిగే ప్రయోగంలో.. 7 టెరా ఎలక్ట్రాన్ వోల్స్ వేగం వద్ద ఈ కిరణాలను ఢీకొట్టిస్తున్నారు. పూర్తిగా అణుపరిజ్ఞానంతో ఈ ప్రయోగం జరుగుతోంది. 2011 చివరి వరకూ ఈ ప్రయోగం జరుగుతుంది. మధ్య మధ్యలో విరామం ఇస్తూ.. ఈ ప్రయోగాన్ని కొనసాగిస్తారు. తుదిదశలో 14 టెరా ఎలక్ట్రాన్ వోల్డ్స్ వేగం వద్ద కాంతి కిరణాలను ఢీకొట్టిస్తారు. దీంతో.. విశ్వం ఆవిర్భావం నాటి పరిస్థితులు ఈ ప్రయోగశాలలో ఏర్పడతాయన్నది శాస్త్రవేత్తల అంచనా. లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్‌లో కాంతికిరణాల కారణంగా ఏర్పడే పరిస్థితులను ఎప్పటికప్పుడు రికార్డు చేయడానికి, విశ్లేషించడానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు నిత్యం సిద్ధంగా ఉంటారు. ఈ పరిశోధన ఆధారంగానే.. విశ్వసృష్టికి మూలాన్ని కనిపెడతారు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List