కృష్ణ జిల్లా , మచిలీపట్నం నుండి 35 కి.మీ దూరంలో చరిత్రాత్మకమైన ఘంటశాల గ్రామము కలదు . ఈ గ్రామము నందు బాల పార్వతీ సమేత శ్రీ జలధీశ్వర స్వామి వారి ఆలయము ఉన్నది . ఈ శివ లింగ మును అగస్త్యమహా ముని ప్రతిష్టించారు అని చెపుతారు .
తూర్పు ముఖము గా ఉన్న ఈ ఆలయము లో భారత దేశములోనే కాకుండా ఎక్కాడా లేని విధము గా ఒకే పానమట్టము పై శ్రీ జలధిశ్వరుడు , బాల పార్వతి దేవి మూర్తుల విగ్రహాలు ప్రతిష్టితులై భక్తులకు దర్శనము ఇస్తున్నారు ఈ పానమట్టము ఏకరాతీ శిల. దీనికి నాలుగు మూలాల కింద నాలుగు వైపులా నాలుగు కాళ్ళు ఉండి దాని పైన మట్టం నిలిచి ఉంటుంది . పానమట్టం భూమిని తాకదు.
ఈ ఆలయ గోపురము గజపృష్టాకార గోపురము గా పిలవబడుతుంది . అంటే సాదరణము గా ఆలయ గోపురము వలె కాకుండ ఈ గోపురము మూడు శిఖరాలను కలిగి వుంటుంది . తంజావూరు బృహదీశ్వరాలయము గోపురము మాత్రమే ఈ విధము గా వుంటుంది .
బాల పార్వతి దేవి మూర్తి ముంది మేరు శ్రీ చక్రము కలదు . . ఇచ్చట నవగ్రహములు సతీ సమేతులై నవగ్రహ మండపములో కొలువై వున్నారు .
ఈ ఆలయము లో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము వుంది . వినాయకుడు విగ్రహము కోడ వుంది . ఆలయమునకు ప్రక్కనే ఒక పెద్ద నాగుపాము పుట్ట వున్నది .
ఇక్కాడ క్షేత్రానికి ద్వారపాలకులు గా ఎడమ వైపు కాలభైరవుడు , కుడి వైపు నరసింహ స్వామి వారు కనిపిస్తారు .
No comments:
Post a Comment