త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. ~ దైవదర్శనం

త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం.



శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఒకటి. ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాశిక్‌కు 35 కిలో మీటర్ల దూరంలోని ‘త్రయంబక్’ అనే ఓ కుగ్రామంలో వెలసి ఉంది. ఈ గ్రామంలో అడుగుపెట్టగానే మీరు ఆధ్యాత్మిక భావనకు లోనవుతారు. మహామృత్యుంజయ మంత్ర జపంతో అక్కడి వాతావరణం మొత్తం మారుమోగుతూ పూర్తి ఆధ్యాత్మికతతో నిండిపోయి ఉంటుంది. ఆ గ్రామంలో ప్రవేశించి అలా కొద్ది దూరం నడిస్తే, మీకు ఆలయ ప్రధాన ద్వారం కనబడుతుంది.
ఆ ఆలయం యొక్క ప్రధాన భవనం ఇండో-ఆర్యన్ నాటి నిర్మాణ శైలికి అద్దం పడుతుంది. గర్భగుడిలోకి ప్రవేశించిగానే, అక్కడ శివలింగానికి ఒకే ఆధారం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే శివలింగానికి మరింత చేరువై దగ్గరగా చూస్తే... ఆ ఆధారంలో అంగుళం సైజున్న మూడు చిన్నచిన్న శివలింగాలు గోచరిస్తాయి. ఆ మూడు శివలింగాలును బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులుగా భావిస్తారు. ఉదయకాలపు ప్రార్థన అవగానే, ఐదు ముఖాలతో కలిగి ఉన్న పంచముఖ వెండి కిరీటాన్ని పరమేశ్వరుడు ధరిస్తాడు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List