అనంతపురం జిల్లాలో తమ పిల్లలకు వచ్చిన కోరింత దగ్గు నయం కావడానికి సైతం శునక విగ్రహానికి పూజలు చేస్తున్నారంటే వారు మూఢ నమ్మకాలను ఎంత బలంగా విశ్వసిస్తున్నారో ఇట్టె అర్థమవుతుంది. హిందూపురంలోని ఎస్.సడ్లపల్లిలో బెంగళూరు రోడ్డు పక్కనవున్న శునక విగ్రహానికి దశాబ్దాల చరిత్ర ఉంది. గతంలో ఈ గ్రామంలో ఉన్న ఓ సాధువు చిన్న చితక వైద్యం చేసేవాడు. ఆయన పెంపుడు కుక్క చనిపోతే దానిని సమాధి చేశాడు. ఆ శునకంతో ఆయనకున్న అనుబంధానికి గుర్తుగా శునక విగ్రహాన్ని ప్రతిష్టింపజేశాడు. ఈ విగ్రహానికి పూజలు చేస్తే చిన్నపిల్లలకు వచ్చే కోరింత దగ్గు నయమవుతుందని ఇక్కడి ప్రజల గట్టి విశ్వాసం. ఇక్కడ పూజలు నిర్వహించడానికి చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాక కర్ణాటక నుంచి భక్తులు రావడం విశేషం.
https://www.facebook.com/rb.venkatareddy
No comments:
Post a Comment