దేవతలంటే గ్రహాంతర వాసులని అనుకుంటున్నాం.. అలాంటి గ్రహాంతరవాసులు మొదట్నుంచీ భూమితో చెలిమి చేస్తూ వచ్చారా? వాళ్ల జీవిత కాలానికీ, మన జీవిత కాలానికీ ఏదైనా తేడా ఉందా? వారికి ఉన్న అపురూపమైన శక్తి సామర్థా్యలను, టెక్నాలజీని మనుషులతో పంచుకున్నారా? అవుననే అనిపిస్తుంది.. ఎందుకంటే రామాయణ, భారత, క్రీస్తు కాలాలలో మన సమాజంలో కనిపించే అపూర్వ టెక్నాలజీకి, ఏలియన్‌స టెక్నాలజీకి దగ్గరి సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. ఆనాటి విమానాలు కానీ, ఆయుధాలు కానీ, మన కాలానికి ఎన్నో రెట్లు అడ్వాన్‌సడ్ స్టేజిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఏమిటీ ఆయుధాలు.. ఎక్కడ ఆ విమానాలు.
మన పురాణాల్లో ఖగోళంలో ఏ గ్రహం ఎంతకాలానికి ఎంత దూరం ఏ విధంగా ప్రయాణం చేస్తుందో లెక్కించారు.. సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడు వస్తాయో ఖచ్చితంగా చెప్పగలిగారు..అంతే కాదు.. దేవతలకూ, మనుషుల జీవిత కాలాలకు సంబంధించిన లెక్కలు కట్టారు..ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? ఏ ప్రాతిపదికన మన వాళు్ల ఈ లెక్కలు వేయగలిగారు? ఇదో అంతుపట్టని మిస్టరీ..
భాగవత పురాణంలో బ్రహ్మ జీవిత కాలాన్ని మనుషుల జీవిత కాలంతో పోలుస్తూ వ్యాసుడు కట్టిన లెక్కలు మనకు కనిపిస్తాయి. దీని ప్రకారం
360 మనిషి సంవత్సరాలు దేవతలకు ఒక సంవత్సరం
12 వేల దేవతల సంవత్సరాలు ఒక చతుర్యుగం.
అంటే కృత, త్రేత, ద్వాపర కలియుగాలన్నమాట.
మన మనుషుల లెక్క ప్రకారం ఒక చతుర్యుగం అంటే 4లక్షల 32 వేల సంవత్సరాలన్నమాట.
ఇలాంటి చతుర్యుగాలు 2000 పూర్తయితే బ్రహ్మకు ఒక రాత్రి,పగలు అన్నమాట.. అంటే ఒక రోజు గడిచినట్లు.
బ్రహ్మకు ఇలాంటి రోజులు 360 గడిస్తే ఒక సంవత్సరం అయినట్లు.
ఇలాంటి సంవత్సరాలు వంద పూర్తయితే బ్రహ్మ జీవిత కాలం ముగిసినట్లు..
అంటే మన మనుష్యుల కాలమానం ప్రకారం బ్రహ్మ జీవించే కాలం అక్షరాలా 3,11,040,000,000 రోజులన్నమాట.
దీని తరువాత ప్రళయం వస్తుందని, ఆ తరువాత మళ్లీ సృష్టి మొదలవుతుందని భాగవతం చెప్తోంది..
ఈ లెక్కల ప్రకారం దేవతలు అమరులనటంలో ఆశ్చర్యం లేదు.. ఎందుకంటే మనతో పోలిస్తే 36వేల సంవత్సరాలు గడిస్తే తప్ప వాళ్లకు వందేళు్ల పూర్తి కావు.. అయితే
ఈ కాలమానాన్ని మన వాళు్ల ఎలా లెక్క కట్టగలిగారు అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లభించకపోవచ్చు. కానీ ఖగోళ శాసా్తన్న్రి, నక్షత్రాల కదలికలను అంచనా వేయటంలో ఆరితేరిన వారు కాబట్టి ఇతర గ్రహాలలో ఉండే జీవరాశుల జీవిత కాలాన్ని ఈ విధంగా లెక్కించి ఉండవచ్చు..
పురాణాల్లో చెప్పినట్లు భూమికి ఎగువన ఉన్న లోకాల్లో సత్యలోకం అన్నింటి కంటే పైన ఉన్నది.. బ్రహ్మ ఉండేది కూడా సత్యలోకంలోనే. అంటే భూమి నుంచి ఎగువన ఉన్న గ్రహాల వైపు వెళు్తన్న కొద్దీ కాల గమనంలో మార్పు వస్తుందన్న మాట..
------
రోదసి.. అనంతమైన విశ్వం.. మొదలెక్కడో తెలియదు.. తుది ఏమిటో అంతకంటే తెలియదు.. ఈ విశ్వాంతరాలంలో భూమి పరిమాణం చాలా చాలా చాలా చిన్నది.. దీనికి ఎన్నో రెట్లు పెద్ద వైన గ్రహాలు రోదసిలో కోట్ల సంఖ్యలో ఉన్నాయి.. వీటిలో ఎక్కడో భూమి లాంటి గ్రహం ఉండి ఉండవచ్చు. అక్కడా మనలాగే జీవరాశి ఉండనూ వచ్చు.. స్పేస్‌లో పాలపుంతలు ఒకటి కాదు..వేల సంఖ్యలో ఉన్నాయి. సౌరమండలాలకు లెక్కలేదు.. దూరాలకు అంతే లేదు.

మన సౌర మండలమే దాదాపు 14 వందల కోట్ల మైళ్ల మేర ఉంది. దాని తరువాత మిల్కీ వే ల గురించి చెప్పేదేముంది.. భూమి కంటే ఎంతో పెద్ద వైన గ్రహాలు మన సూర్యుడి కంటే ఎన్నో రెట్లు పెద్దవైన సూర్యుల చుట్టూ తిరుగుతూ ఉండవచ్చు.. అందుకే దేవతల కాలమానానికి, మన కాలమానానికి తేడా ఉంది. ఒక దేశానికి, ఇంకో దేశానికీ మధ్యనే టైమ్‌లో చాలా తేడా కనిపిస్తుంది మనకు. ఇక రోదసిలో గ్రహాల మధ్య కాలంలో డిఫరెన్‌స ఉండటంలో ఆశ్చర్యమేముంది.?
2
2
గ్రహాల మధ్య దూరం, గ్రహాల మధ్య భ్రమణాన్ని బట్టి ఆయా గ్రహాలలో ఉండే జీవరాశుల జీవిత కాలాన్ని మన వాళు్ల అంచనా వేశారు.. ఈ విధంగానే వారి శక్తి సామర్థా్యలనూ ఏ స్థాయిలో ఉంటాయో రుచి చూశారు.. ఇదిగో ఇవాళ ఏలియన్ తిరుగుతున్నదంటున్న యుఎఫ్‌ఓలు, నాడు దేవతలు తిరిగారంటున్న పుష్పక విమానం ఒకటే కావచ్చని పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తల్లో కొందరి అభిప్రాయం.
ఈజిప్‌ట... ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికత ఉన్న దేశం.. ఇక్కడ బయటపడ్డ పిరమిడ్‌లు అనేక చారిత్రక రహస్యాలను విప్పి చెప్తాయి. ఇక్కడి కింగ్ జోసెఫ్ పిరమిడ్ నాలుగు వేల సంవత్సరాల నాటిది.. ఇక్కడ తవ్వకాలు జరుపుతున్నప్పుడు చిన్న చెక్కతో తయారు చేసిన పక్షి బొమ్మ దొరికింది. అక్కడ కనిపించిన రాతల్లో ఐ వాంట్ టు ఫై్ల అన్న మాటలూ ఉన్నాయి. అక్కడ తవ్వకాల్లో దొరికిన ఓ పక్షి బొమ్మను నిశితంగా గమనిస్తే, దానికి పక్షిలాగా కళు్ల రెక్కలు ఉన్నాయి. కానీ, రెక్కలు సాధారణ పక్షికి ఉన్నట్లు కాకుండా విమానపు రెక్కలను తలపిస్తున్నాయి. ఆధునిక ఎయిర్‌క్రాఫ్‌టకు ఇది నమూనాలాగా ఉంది.
అటు కొలంబియాలో దొరికిన ప్రాచీన ఆనవాళ్లలో సైతం చేప ఆకారంలో ఉన్న అనేక వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ మోడ్రన్ ఎయిర్ షిప్‌కు సంకేతంగా భావిస్తున్నారు..
మన దేశంలో సంస్కృత గ్రంథాల్లో, శాసనాల్లో విమాన శాస్త్రం ఉంది.. క్రీస్తుకు పూర్వం దాదాపు 6వేల సంవత్సరాల క్రితమే భారతీయులు విమానాన్ని తయారు చేసే ప్రక్రియను కనుక్కున్నారు. ఈ విమానాల్లో కొన్ని ఒక విధమైన జెట్ ఇంజన్‌తో నడిచేవని శాస్త్రవేత్తలు చెప్తారు.. ఈ విమానాలు గాల్లోకి ఎగిరే సమయంలో తీవ్ర వేగంతో, భారీ ఇంధన వినియోగంతో, పేలుళు్ల జరిగేవని అంటారు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక యుగంలో అంతరిక్షంలోకి ప్రయోగించే ఉపగ్రహ వాహక నౌకల్లాంటివే ఇవి.
ఈ విమానాల్లో ఎలక్ట్రిసిటీ పవర్ ఉండేదిట.. ఇందుకోసం మెర్కు్యరీని ఇంధనంగా వాడేవారు.. ఇందులో ప్రయాణికులకు చోటు ఉన్నట్లే.. వార్‌హెడ్ కూడా ఉండేది. ఈ విమానం ద్వారా ఆయుధాన్ని కూడా ప్రయోగించే వీలుంది.. ఆధునిక మిలటరీ విమానానికి భారతీయ విమాన శాస్త్రంలో చెప్పిన విమానాలు ఎంతమాత్రం తీసిపోవని శాస్త్రవేత్తలే అంటున్నారు..
పుష్పక విమానం కూడా ఇలాంటిదే.. రెండు అంతస్థుల్లో ప్రయాణికులను తీసుకుని వెళ్లగలిగే సామర్థ్యం ఉన్న అతి పెద్ద విమానం ఇది.. రావణ వధ తరువాత రాముడు ఇదే విమానంలో అయోధ్యకు లంక నుంచి వెళ్లాడట.
ఇంత టెక్నాలజీ మన వారికి అంత ప్రాచీన కాలంలో ఎలా లభించింది..అన్న ప్రశ్నకు జవాబే ఫై్లయింగ్ సాసర్.. ఎలియాస్ యుఎఫ్‌ఓ.. గత అర్థ శతాబ్దంలో ప్రపంచంలో చాలా చోట్ల లిప్తపాటులో కనిపించి వెళ్లిపోతున్న ఫై్లయింగ్ సాసర్‌లోని టెక్నాలజీ, మన విమానాల్లో వినియోగించిన పరిజ్ఞానమూ దాదాపు ఒకటేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.. ఇది పూర్తిగా నిర్థారణ కాకపోయినప్పటికీ ఈ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి రెండు ఒకటే అయితే, గ్రహాంతర వాసులతో మన ప్రాచీనులకు ఉన్న అనుబంధం స్పష్టమవుతుంది..
3
దేవతలు అనగానే మనకు గుర్తొచ్చేది వారి చేతుల్లో ఉండే వివిధ ఆయుధాలు.. కత్తులు, గదలు, బాణాలు, ఇంకా రకరకాలు.. ఈ అసా్తల్ర తోనే దేవతలు బీభత్సాన్ని సృష్టించారా? అవును.. ఇవి సాధారణ ఆయుధాలు కావు.. సామూహిక జనహననాన్ని సృష్టించే భయానక అసా్తల్రు..
1945 జూలై 16 మెక్సికో సరిహద్దుల్లో అమెరికా అణ్వస్త్ర ప్రయోగాన్ని సక్సెస్‌ఫుల్‌గా జరిపింది. దాదాపు వంద మైళ్ల ఎత్తున అణు రేడియో ధార్మికత ఎగిసిపడింది.
అమెరికా అణ్వసా్తన్న్రి 1945లో ప్రయోగించింది. కానీ, దానికంటే ఎన్నో ఏళ్ల క్రితం అంటే ప్రాచీన కాలంలోనే, ముఖ్యంగా భారత దేశంలో అణ్వసా్తల్రు ఉన్నాయనటానికి ఆధారాలు ఉన్నాయి. కృత యుగంలో జరిగిన రామాయణంలో రావణుడితో యుద్ధం చేసిన రాముడు అతనిపై రామ బాణాన్ని ప్రయోగించి వధించాడు.. అది న్యూక్లియర్ పవర్ ఉన్న బాంబుగా భావిస్తున్నారు.. ఎందుకంటే లంకలో రామ రావణ యుద్ధం ఎక్కడైతే జరిగిందని భావిస్తున్నారో, అక్కడ ఇవాళ్టికీ గడ్డి పరక కూడా మొలవదు.. అంతే కాదు.. దాదాపు నాలుగు వేల ఏళ్ల క్రితం జరిగిన మహాభారత యుద్ధంలో మన వారి చేతుల్లో బ్రహ్మాస్త్రం ఉండేది.. అదే అణ్వస్త్రమని ఇప్పటి శాస్త్రవేత్తల అభిప్రాయం..
కురుక్షేత్రంలో కూడా కొంతమేర రేడియేషన్ ఆనవాళు్ల ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో మహా భారత కాలంలో అణ్వస్త్రం ఉన్నదన్న అభిప్రాయాన్ని అంతా ఒప్పుకోకపోవచ్చు. కానీ మహాభారత యుద్ధంలో భారీ ఎత్తున పేలుళు్ల జరిగాయని మాత్రం అంతా అంగీకరిస్తున్నారు.. భారీ విధ్వంసాన్ని సృష్టించిన పేలుళ్ళే ఇవి..
మెసపటోమియా, మొహంజదారో ఆనవాళు్ల లభించిన ప్రదేశాల్లో కూడా రేడియేషన్ ప్రభావం కనిపిస్తోంది. భారత ఇతిహాసాల్లో ఎగిరే రథాలు కనిపిస్తాయి. వాటిపై యుద్ధం చేస్తున్నవారి చేతుల్లో అపూర్వమైన ఆయుధాలు కనిపిస్తాయి. అటు క్రిస్టియానిటీ ప్రాచీన గ్రంథాల్లోనూ, బైబిల్లోనూ ఈ న్యూక్లియర్ పవర్ గురించిన ప్రస్తావన కనిపిస్తుంది..
మహాభారత యుద్ధాన్ని నడిపించింది శ్రీకృష్ణుడు.. అర్జునుడికి గీతోపదేశం చేసి సంహారకాండను అంతా తానే అయి నడిపించింది కృష్ణుడు.. ఈయన దేవుడు.. దివి నుంచి భువికి దిగి వచ్చిన వాడు.. ఆయన అందించిన టెక్నాలజీతోనే, విజ్ఞానంతోనే మహాభారత పర్వం కొనసాగింది.. పైలోకాల్లో ఉన్న పరమాత్ములతో మనకున్న చెలిమికి ఇవి తార్కాణాలు.. ఈ పరమాత్ములు ఎవరు? దేవతలా? ఏలియన్సా? పరిశోధనలు తేల్చాలి.

No comments:
Post a Comment