భారతీయుల కాలజ్ఞానము.. ~ దైవదర్శనం

భారతీయుల కాలజ్ఞానము..


భారత దేశము వేధభూమి. మన వేదాలలో సాంకేతిక, సామాజిక, ఆర్థిక, న్యాయ, పరిపాలన, వ్వసాయ, జ్యోతిష, ఖగోళ, అంతరిక్ష, ఆరోగ్య, గణితం, మొదలగు సర్వ శాస్త్రాలకు సంబందించిన విషయాలు చాల వివరంగా నిక్షిప్తం అయి వున్నాయి. అయితే అనేక కారణాల వల్ల ఆ శాస్త్రాలన్నీ మరుగున పడి పోయి వుండి పోయాయి. ఆ కారణాలేమిటనే పరిశీలిస్తే.... వేదాలు గ్రంథ రూపంలో లేక పోవడము, ఆ రోజుల్లో వేదాలను అందరు పఠించ కూడదనే నియమం వుండడము, వేదాలు ప్రజలలో ఒక వర్గం చేతిలోనే వుండి పోవడము, ఇలా అనేక కారణాల వల్ల ఆ వేద విజ్ఞానము బహుళ వ్వాప్తి కాకుండా మరుగున వుండి పోయింది. మేదావులైన కొందరు పరదేశీయులు ఆ విజ్ఞానానంలోని గొప్ప తనాన్ని గుర్తించి, అంది పుచ్చుకొని, అవకాశం వుంటే తస్కరించి కొందరు తమ దేశాలకు తీసుకెళ్ళి పరిశోదించి, పరిశీలించి, నిరూపణ చేసుకొని అందులోని విశేషాలను బయట పెట్టి ఆ యా విషయాలను తామే కనిపెట్టినట్టు ప్రచారం చేసుకొనుటలో సఫలీకృతులయ్యారు. అటువంటి కొన్ని శాస్త్రీయ సిద్దాంతాలు తామె వాటిని కనిపెట్టినట్లు చెప్పుకుంటున్నారు. ...... కానీ అలాంటి వారు పుట్టి బుద్దెరగ ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆ యా సిద్ధాంతాలు భారత దేశంలో ప్రచారంలో వుండేవి, అనుభవంలో వుండేవి, వాడుకలో వుండేవి. ఈ విషయాన్ని వేదాలు పరిశీలిస్తే అవగతం అవుతుంది. ఇది దాచేస్తే దాగని సత్యం. కాని అప్పటికే సమయం మించి పోయింది. ఆ యా సిద్ధాంతాల రూప కర్తలుగా పర దేశీయులే ప్రపంచ వ్యాప్తంగా (భారత దేశంతో సహా) చలా మణి అవుతున్నారు.

https://www.facebook.com/rb.venkatareddy
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive