మహా పతివ్రత మండోదరి. ~ దైవదర్శనం

మహా పతివ్రత మండోదరి.


* రామాయణంలో రాయని రహస్యాలు!!
* మండోదరి జీవితం గురించి భయంకర వాస్తవాలు..!
* మండోదరి కుమార్తె సీతామాతేనా..!!
* రావణుడికి సీత కూతురా..?
* భారతీయ జీవన సంస్కృతిలో విడదీయరానంతగా మమేకమైన రామాయణగాథ..
* రావణుడి భార్య మండోదరి రహస్య జీవితం ..!
* రావణుడు చనిపోయాక మండోదరి జీవితం ఏమైందో తెలుసా..
.
.
రాముడు నిజంగానే ఈ గడ్డమీద పుట్టి పాలించిన మహనీయుడనీ, విష్ణుమూర్తి అవతారమనీ వేల సంవత్సరాలుగా విశ్వసించి ఆరాధిస్తున్నవాళ్లూ ఉన్నారు… కాని అదో పుక్కిటి పురాణమని కొట్టిపారేసేవాళ్లూ ఉన్నారు… కానీ రామాయణగాథ వేల ఏళ్లపాటు భారతీయ జీవన సంస్కృతితో విడదీయరానంతగా మమేకమైన మాట నిజం… అందులోనూ బహుళ ప్రచారంలోకి రాని ఉపకథలు ఎన్నెన్నో ఉన్నాయి… తెలుసుకోవాల్సిన నీతులూ ఎన్నెన్నో… ఈ కథలను చాలామంది నమ్మరు కానీ అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి… మూలకథతో పోలిస్తే వీటికి అసలు పోలికే ఉండకపోవచ్చు… కానీ వాల్మీకి రాశాక అనేకానేక కథలు రామాయణంలో విలీనమై, అసలు రామాయణమేదో తెలియని స్థితి ఏర్పడింది… ఇదీ రామాయణమంత పెద్దగానే ఉన్నా, అంతే ఆసక్తిదాయకం…
.
రామాయణంలో మండోదరి లంకాపతి రావణుడి రాణి అని, భోగభాగ్యాలు అనుభవించిందని భావిస్తారు. కానీ కొంతమందికి మాత్రమే ఆమె జీవితం ఒక పోరాటంలా సాగిందని తెలుసు. పుట్టినప్పటి నుంచి.. చనిపోయేవరకు తన జీవితమంతా త్యాగాలకే సరిపోయింది. ఆమె మండోదరిగా ఎలా మారిందనేది.. చాలా ఆశ్చర్యపరిచే కథ. లంకాధిపతి రావణుడి భార్యగా మాత్రమే మండోదరి మనందరికీ తెలుసు. సీతను అపసంహరించుకుని వచ్చినప్పుడు ఆమె తప్పని భర్తను వారించిందట. నీతిగా పరిపాలించాలని నిరంతరం పట్టుబట్టేదట. ఇక రావణుడు యుద్ధంలో చనిపోయాక మండోదరి ఎవరిని వివాహం చేసుకుంది? విభీషణుడు లంకకు రాజుగా సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత ఏం జరిగింది? మండోదరి జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు..
.
రావణాసురుని భార్య. ఈమె మహా పతివ్రత. మండోదరి మాయాసురుడి కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి అపహరించి పెళ్ళాడాడు. ఇంద్రజిత్తు ఈమెకు పుట్టిన కుమారుడు. ఈమె దేవకన్యయైన హేమకు మయునికి గలిగిన స్త్రీమూర్తి . దైవాంశయైన మండోదరి మయుని పుత్రిక. తల్లి హేమ అనబడే దేవకన్య. ఈమె తన తండ్రితో కలిసి వనంలో సంచరించే వేళ వేటకై రావణుడు వెళ్లినప్పుడు ఈమెను చూస్తాడు. తాను అవివాహితుణ్ణి కాబట్టి తనకు మండోదరిని ఇచ్చి వివాహం జరిపించమని రావణుడు కోరుకుంటాడు. కాబట్టి తండ్రియైన మయుడు మండోదరిని రావణునికిచ్చి వివాహం జరిపించాడు. అందుచే ఈమె రావణాసురుని పట్టమహిషి. మిక్కిలి సౌందర్యం గలది. కేవలం బాహ్య సౌందర్యరాశి మాత్రమే గాదు మండోదరి అంతస్సౌందర్యం మిక్కిలి కొనియాడదగినది. రావణునిచే వరింపబడింది. నీతిని, ధర్మాన్ని కర్తవ్యాన్ని ప్రభోధం చేయగల మనస్తత్వం గలది. ఆమె వ్యక్తిత్వం మిక్కిలి ప్రశంసాపాత్రం. శ్రీమద్రామయణంలో కొన్ని పాత్రలు మానవత్వాన్ని మరచిపోయి ప్రవర్తిస్తే మరికొన్ని పాత్రలు దానవకులానికి చెందినప్పటికి మనవత్వానికి ప్రతీకలైనాయి. లంకాధినేత రావణుని పట్టమహిషి అయిన ఈ మహారజ్ఞి అలాంటి తత్వంగల స్త్రీమూర్తి.
.
రావణుడిని మంచి మార్గంలో నడిపించేందుకు ఆమె ఎంతగానో తాపత్రయపడింది. సీతను అపహరించుకుని వచ్చినప్పుడు కూడా తప్పని చెప్పింది మండోదరి. సీతను రాముని వద్దకు పంపించాలని అభ్యర్థించింది. రాముడితో తన భర్త చేసేది అధర్మ యుద్దం అని తెలిసినా.. తన భర్త గెలవాలని శుభాకాంక్షలు చెప్పి పంపింది మండోదరి. రావణుణ్ణి చంపాక రాముడు లంకా నగరానికి విభీషణుణ్ణి రాజుగా చేసి న్యాయంగా పాలించమని చెప్పాడు. అంతేకాదు మండోదరిని వివాహం చేసుకుని లంకకు రాణిగా చేయాలని విభీషణుడికి సూచించాడు. విభీషణుడి భార్యగా మండోదరి నీతి మార్గం వైపు లంకా రాజ్యానికి మార్గనిర్దేశం చేసింది.
.
సీత, మండోదరి మధ్య సంబందానికీ ఒక కథ ఉంది. గ్రిత్సమడ మహర్షి దర్భ గడ్డి నుండి పాలను తీసి కుండలో నిల్వ చేసి మంత్రాలతో శుద్ది చేశాడు. కఠినమైన తపస్సు తో లక్ష్మీ దేవిని కుమార్తెగా పొందాలనేది ఆ మహర్షి కోరిక. అయితే రావణుడు గ్రిత్సమడ మహర్షిని చంపి అతడి రక్తాన్ని పవిత్రమైన పాల కుండలో కలిపాడు. ఋషులను చంపి వారి రక్తాన్ని కుండలో నిల్వ చేసుకుని తాగితే అన్ని యోగ అద్వితీయ అధికారాలు వస్తాయని రావణుడి నమ్మకం. తన భర్త ఇలా చేయడం మనస్కరించని మండోదరి ఆత్మహత్య చేసుకొవాలనుకుంది. ఈ క్రమంలో విషయం తెలియక కుండలో ఉన్న రక్తాన్ని విషం అనుకుని తాగింది. అయితే ఆమె చనిపోకపోగా.. గ్రిత్సమడ మహర్షి పాలు, ఋషుల అద్వితీయ శక్తులు అన్నీ కలిపి లక్ష్మీ అవతారంతో ఉన్న ఓ బిడ్డను కన్నది. ఆమె కంగారుగా ఆ బిడ్డను బంజరు భూమిలో పాతిపెట్టింది. ఆ తర్వాత ఆ బిడ్డ మిథిలా రాజు జనక మహారాజుకు దొరికింది. ఇది హిందూ మత పురాణాల్లో అత్యంత వివాదాస్పద కథల్లో ఒకటి. ఆమెయే సీతాదేవి అట.
.
సీత, మండోదరి మధ్య సంబందానికీ మరో ఒక కథ:...
మండోదరి గురించి అనేక పురాణ కథలు వ్యాప్తిలో ఉన్నాయి. మండోదరికి జన్మించిన సంతానం వల్ల తన భర్తకు ప్రాణ హాని ఉందని జోస్యం చెప్పింది. ఒక రోజు ఆమె ఒక కుండలో నీరనుకుని రక్తం తాగుతుంది. ఆ రక్తం రావణుడు వధించిన రుషులది. ఆ కారణంగా ఆమె గర్భం ధరించి, ఒక కుమార్తెకు జన్మనిస్తుంది. జోస్యం తెలిసిన భర్త తన బిడ్డని బతకనివ్వడని, ఆమెను ఒక పెట్టెలో పెట్టి, సముద్రంలో విదిచిపెడుతుంది. సముద్రుడు ఆ పెట్టెను భూదేవికి ఇస్తాడు. భూదేవి దానిని జనకుడికి ఇస్తుంది. ఆ పాపే సీత. రావణుడు సీతను అపహరించి లంకకు తెచ్చినపుడు మండోదరి తన కుమార్తెను గుర్తుపట్టి, రావణుడికి కాలం చెల్లిందని తెలుసుకుంటుంది.
.
ఎంతగా యత్నించినా రావణుడిని రాముడు చంపలేకపోతున్నాడు. దీంతో విభీషణుడు రావణుడిని ఎక్కడ కొడితే చంపొచ్చో రహస్యం చెబుతాడు. రావణుడి ఆత్మ నాభిలో ఉంటుంది. అప్పుడు రాముడు మాయ బాణంతో రావణుడి నాబిని కొట్టి చంపాడు. అయితే ఆ మాయ బాణాన్ని హనుమంతుడు ముని వేషంలో రావణుడి కోటలోకి ప్రవేశించి రహస్యంగా దాచిన మాయా విల్లును ఎత్తుకొస్తాడు. ఆ బాణంతోనే రాముడు రావణుణ్ణి వధించాడు.
.
మండోదరిని పెళ్లాడిన విభీషణుడు:...
రావణుడు మరణించాక మండోదరి ఏమైంది అనేది మరో ఆసక్తికరమైన ఉపకథ… రాముడు మండోదరిని పెళ్లాడాలని విభీషణుడికి సూచిస్తాడు… రాజు మరణించాక, వారసులు కూడా లేనట్టయితే రాణిదే రాజ్యాధికారం, రావణుడితోపాటు కొడుకులు కూడా హతమారిపోయారు కాబట్టి అప్పటి లంక నియమాల ప్రకారం మండోదరిదే రాజ్యాధికారం. ఆమెను చేపట్టడం ద్వారా అధికారాన్ని పొందాలనేది రాముడు సూచించిన తరుణోపాయం… రావణుడిని ప్రాణంకన్నా ఎక్కువ ప్రేమించే మండోదరి తొలుత దీనికి తిరస్కరిస్తుంది… కానీ కేవలం ఒక అధికారిక ప్రక్రియ కోసమే జరిగే లాంఛనప్రాయమైన పెళ్లి కాబట్టి అంగీకరించాలని రాముడు చెప్పడంతో అంగీకరిస్తుంది… తరువాత కొంతకాలానికి పర్వతాల్లోకి వెళ్లి తపస్సు చేస్తూ తనువు చాలిస్తుంది…
.
reddemb@gmail.com
https://www.facebook.com/rb.venkatareddy
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List