శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ~ దైవదర్శనం

శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం.

16 వ శతాబ్దం లో ఈ ఆలయాల నిర్మాణమునకు శంకుస్థాపన చేసియుండిరి.వారి తదనంతరం వారి మనుమడు అయిన వెంకట నర్సయ్య చౌదరి గారు నిర్మాణ పనులని పూర్తి గావించిరి.
16 వ శతాబ్దం ఆదిలోనే హైదరాబాద్ నగరంలో చార్మినార్ కట్టడం నిర్మాణం జరిగినది.ఈ నిర్మాణం స్వచ్చమైన డంగు సున్నం తో నిర్మించబడినది.ఇదే రీతి గా సున్నం ఉపయోగించి ఈ దేవస్తానకట్టడం జరిగినది.ఈ నిర్మాణము యొక్క సున్నపు కట్టడము ఆలయ గోపుర మందు ఈ నాటికి చెక్కు చెదరకుండా కనిపించుచున్నది.కావున ఈ ఆలయ నిర్మాణం 16 వ శతాబ్దం లో ఉపయోగించబడిన నిర్మాణ సామాగ్రి తో నిర్మితమైనది అని నిరూపణ జరిగినది.
ఆగమ వాస్తు శాస్త్రం ననుసరించి ఇంజాపురం గ్రామానికి (ఈశాన్యం) నందు ఆలయ నిర్మాణము జరిగినది.
ఈ గ్రామం యొక్క పేరు పూర్వం ఇనుజాపురం అని పిలువబడేది.కాలక్రమేనా ఇది ఇంజపురులుగా వ్యవహరించబదుచున్నధి.ఇనుజులు అనగా దేవతకు వర్తింతురు.పూర్వికులలో వంశవృక్ష పురుషుడైన బాలగొని రామస్వామి (ఇతని కుమారులు పాపయ్య,వెంకయ్యలు) కి దైవచింతన ఆధ్యాత్మిక అనుకరణ సహజ సిద్ధముగా అవడినవని ప్రతీతి.ఇతని పొలాలొ ఆవాసం ఉండుట చే ఒకనాటి రాత్రి అతనికి ధవళ వస్త్రదారులైన ఇనుజులు కనిపించి ఇది ఇనుజ ఆవాసము -మనుజుల ఆవాసము కాదు ఇక్కడ నీవు ఆలయ నిర్మాణము సకల దేవతానుగ్రహ ప్రాప్తికి అనువుగా నిర్మించవలసింధిగా స్వప్నము లో కోరినట్లుగా వారి కుమారులైన వెంకయ్య చౌదరి గారు మరియు పాపయ్య చౌదరి గార్లు తమ తండ్రి ఈ విషయాన్నీ తెలుసుకున్నా ఇక్కడ మత సామరస్యాన్ని కాపాడుటకు అనువుగా (16వ శతాబ్దము లో వైష్ణవ,శైవ మత విబేధము ప్రజ్వరిల్లి ఉండేది).వైష్ణవ మరియు శైవ సంప్రదాయాలు అనుగుణంగా బాజి ఆలయము మరియు శివాలయ నిర్మాణమునకు శంకుస్థాపన గావించిరి.ఇక్కడ దేవతల అనుగ్రహ ప్రాప్తి కి యజ్ఞ యాగాది క్రతువులు ఆయా మాసములలో నిర్వహించబడేవి.వీటికి ఆధారం ఈ స్థలాన్ని పరిశీలించినప్పుడు ఈ ఆలయానికి ఉత్తర ఈశాన్య భాగములలో చతురస్రాకారము లో గల శిధిలావస్థ లో ఉన్న వేదికలు వాటి చుట్టూ కట్టబడిన ఇటుక ప్రహారీలు సాక్షమిచ్చుచున్నది.ఇటుక వైశాల్యం ఒక్కొక్కటి 2 అడుగుల పొడవు 8 అంగుళాల వెడల్పు తో అక్కడక్కడ ఇప్పటికి దృగ్గోచర…మరొక ఉత్పత్యర్ధము ననుసరించి ఈ ఊరు పేరు అయిన ఇనుజ అనగా సుర్యిని యొక్క కుమార్తె అనగా స్వాతి దేవతకు వర్తించును.అందువలన ఈ గ్రామానికి ఉత్తర భాగములలో ఉన్న ఆలయాల ప్రశస్థనము గురించి మరియు ఉత్పత్యర్ధం దృష్ట్యా ఇనుజాపురం అని స్థిరనామదేయము ఏర్పడినది.కావున ఆ ఆలయాల పరిధి లో మనుజ ఆవాసము(కుటుంభ పూర్వీకుల శిధిలమైన ఇండ్లు తప్ప) లు లేవు.ఇనుజుల ఆవాసముగా పేరుపొంది కాలానుగుణంగా నిర్వహింపబడిన ప్రశస్తము వలన ఈ గ్రామానికి ఇనుజపురం అనునామము సార్ధకమైనధి.కాల గర్బం లో అనుక్రమణ నానుడి లో ఇనుజపురం ఇంజపురము గా మారినది.
ఏక శిలా నిర్మాణము కలిగి ఉండి పైన గల గరుడ విగ్రహపు చెక్కడము చెప్పి చెప్పకనే తిరుమల తిరుపతి దేవస్థానము లోని గరుడ స్థంభ నిర్మాణము తలపింపజేయుచున్నది.ఆలయం లోని ప్రాకార కుడ్యము మెట్లు,గర్భగుడి ఆనతి శిల్ప ప్రాశిస్త్యాన్ని ప్రస్పుటము చేయుచున్నది.ఆలయ గోపుర నిర్మాణము పూర్తిగా రాతి స్థంబాలతో సున్నపు పూత చే నిర్మింపబడి నాలుగు వందల సంవత్సరాల పూర్వము చార్మినార్ కట్టడానికి ఉపయోగించిన సున్నాన్ని తలపింపజేయుచున్నది.ఇందుకు కారణం ఈ నాటి వరకు గోపురం యొక్క కట్టడంలోని ఏ బాగము కూడా మచ్చుకైనాను నాచు,నీరు ఇతర మలినాలు కనిపించకుండా యదా విధిగా గోచరించు చున్నది.త్రిగునాత్మకతకు ప్రతిగగా అన్నట్లు ఈ ఆలయం లో వేరుగా అమ్మవారి అంతర ఆలయము లేకుండా మూలవరులు ఒకే అంతర ఆలయము లో శ్రీ దేవి,భూ దేవి,వెంకటేశ్వరులు మాత్రమే ఉన్నవి.వీరికి సాదృశ్యము గా ఈ ఆలయానికి 3 ద్వారములు మాత్రమే నిర్మింపబడినవి.ముఖ ద్వారము దాదాపు 16 అడుగులు ఒక్కక్క తలుపు 4 అడుగుల వెడల్పు తో చెక్కపై ఇనుప తొడుగులతో నిర్మింప బడినది.ఇవి ఆ నాటి మానవ నిర్మానత్మకతకు నిదర్శనము.వెంకటేశ్వర స్వామి మరియు అమ్మవార్లు ఇక్కడ తూర్పు దిశగా దర్శనమిస్తారు.స్వామి వారి గర్బగుడి ద్వారం ముందు జయ విజయ లు తూర్పు దిశగా మరియు ఎదురుగా పశ్చిమ దిశగా గరుత్మంతుడు,హనుమంతుడు దర్శనమిస్తారు.వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పశ్చిమ దిశగా ద్వారపాలకుడి గా ఆంజనేయ స్వామి చూడ వచ్చు(సాదరంగా హనుమంతుడు దక్షిణము దిశ గానే దర్శనమిస్తారు).ఇక్కడ ఆంజనేయుడి పాదాల కింద శనిమః దేవుడు దర్శనమిస్తారు.దేశం లోనే ఇదొక అరుదైన విగ్రహం గా చెప్పుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి దేవాలయం లోని సున్నం కొట్టు లో వందల సంవత్సరాల పాము (నాగరాజు) ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు.కానీ నాగరాజు యొక్క దర్శనం చేసుకున్న వాళ్ళు చాల అరుదు.వెంకటేశ్వర స్వామి దేవాలయమునకు ఈశాన్య భాగము లో ఒక పెద్ద రధం ఉండేది.ఈ రధం దాదాపు వెంకటేశ్వర స్వామి గర్బగుడి ఎత్తు ఉండేది.కానీ ఇప్పుడు అది కాలగార్బం లో కలిసి పోయింది.
ఇక్కడ శివాలయము లో గల పాన పట్టము మరియు శివ లింగము కాశి విశ్వేశ్వరుని పోలికలు కలిగి యున్నవి.గర్బగుడి లో వినాయకుడు,శివ లింగము,పార్వతి,సూర్యుడు,చంద్రుడు మరియు నంది దర్శనమిస్తారు.శివాలయం లో ద్వారపాలకుడి గా బాలాంజనేయుడు దక్షిణ దిశగా దర్శనమిస్తారు.ఆలయం ప్రహరి లోపట (శివాలయం వెనుక)పాము పుట్ట దర్శనమిస్తుంది.ఈ మధ్య కాలం లో ఇక్కడ భక్తులు సుబ్రమణ్య స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List