రంగారెడ్డి జిల్లా, కుత్బుల్లాపూర్ మండలంలోని జగద్గిరిగుట్ట కొండ మీద ప్రసిద్ధిచెందిన ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉన్నది. ఈ దేవాలయ స్థల పురాణం ప్రకారం యోగానందస్వామి అనే మహార్షికి శ్రీవారు కలలో కనిపించి ఇక్కడ ఆలయం నిర్మించమని కోరారట. స్వామి చెప్పిన ప్రకారం 1975లో జారుడు బండ"గా వ్యవహరించే చిత్రమైన రాతి ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ నిర్వహించే జగత్ కళ్యాణానికి నిదర్శనంగా అప్పట్లో ఈ ప్రాంతానికి 'జగత్ గిరి గుట్ట' గా నామకరణం చేశారు. కాలక్రమంలో అది జగద్గిరిగుట్టగా మారింది. శ్రీవారికి ప్రతి సంవత్సరం [మాఘశుద్ధ వసంత పంచమి] నుంచి 3 రోజుల పాట కల్యానోత్సవం, జాతర" నిర్వహిస్తారు.
జగద్గిరిగుట్టపైన ప్రకృతి సౌందర్యాన్ని తిలకించేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. శ్రీవారి దేవాలయం గర్భగుడిలో ప్రతిష్టించబడిన స్వామి నల్లని శిలా విగ్రహం నాలుగున్నర అడుగుల ఎత్తులో మంత్రముగ్ధుల్ని చేస్తుంది. స్వామివారికి ఎడమవైపున పద్మావతి కుడివైపున ఆల్వార్ అమ్మవార్లు ఉన్నారు.
No comments:
Post a Comment