మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేశంలోని వాణిజ్య ప్రాంతాల్లో ఒకటిగా వున్న నాభివూర్‌కు ప్రాంతానికి సమీపంలోని నేమవర్ అనే పట్టణనికి దగ్గర నర్మదా తీరంలో వెలసివున్న సిద్ధనాథ్ మహాదేవ్ ఆలయ ప్రాశస్త్యాం తెలుసుకుందాం. ఈ ఆలయం నర్మదా తీరంలోని అతిపురాతనమైన ఈ శివాలయం సిద్ధనాథ్ పేరుతో భక్తులకు సుపరిచితం. . ఈ ఆలయంలోని శివలింగాన్ని సనంద్, సనక్, సనాతన్, సనాత్ కుమార్ అనే నలుగురు సిద్ధ ఋషులు ప్రతిష్టించడం వల్ల ఈ ఆలయాన్ని సిద్ధనాథ్ ఆలయం అనే పేరు వచ్చినట్టు భక్తులు అభిప్రాయపడుతారు.
ఈ శివాలయాన్ని క్రీ.పూ.3094 సంవత్సరంలో నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెపుతున్నాయి. ఆరంభంలో ఆలయ ముఖద్వారం తూర్పు దిశగా ఉండేదని, పంచపాండవుల్లో ఒకరైన భీముడు పశ్చిమవైపుకు తిప్పినట్టు చెప్పుకుంటారు.
ప్రతి రోజు ఉదయం.. నదీతీరంలోని ఇసుక మేటలపై అతిపెద్ద పాదముద్రికలు కనిపిస్తుంటాయి. ఇవి నలుగురు సిద్ధ ఋషుల పాద ముద్రలుగా ఇక్కడికి వచ్చే భక్తులు భావిస్తుంటారు. అంతేకాకుండా.. చర్మ వ్యాధులు ఉన్న వారు ఈ ఇసుకలో అంగప్రదక్షిణం చేస్తే వ్యాధి పూర్తిగా నయమవుతుందని భక్తులు భావిస్తుంటారు.
No comments:
Post a Comment