జ్ఞానామృతాన్ని కురిపించిన ‘శ్రీ పిచ్చమాంబ’. ~ దైవదర్శనం

జ్ఞానామృతాన్ని కురిపించిన ‘శ్రీ పిచ్చమాంబ’.

* మహిమాన్వితరాలు ‘శ్రీ పిచ్చమాంబ’ 
* శ్రీశ్రీశ్రీ ఛత్రపతి శివాజీ వంశ జ్ఞాన ప్రభోదకురాలు ‘శ్రీ పిచ్చమాంబ’
* కడప జిల్లా చరిత్రలో విశిష్టమైన ‘శ్రీ పిచ్చమాంబ మఠం’
* మైదుకూరులో వెలసిన శ్రీ సదానంద ఆశ్రమానికి ఆధ్యాత్మిక చరిత్రలో విశిష్టమైన స్థానం.
.
Sri Pichamamba Matam, Mydukur Mandal, Kadapa District, AP

ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని, భగవంతునితో తనకు గల అనుబంధాన్ని తెలుసుకోవాలనే శ్రద్ధగల వారికే ‘గురువు’ అత్యంతావశ్యకం. అందుచేత ప్రామాణికులైన గురువును శరణువేడితే, భగవంతుని శరణు వేడినట్లే. శిష్యుడు గురువుకు చేసిన శరణాగతిని భగవంతుడు తనకు చేసిన శరణాగతిగా స్వీకరిస్తాడు.
.
గురువు, దేవుడు వేర్వేరు కాదు ఒక్కడే. వేదవ్యాసుడు సాక్షాత్‌ విష్ణుస్వరూపుడు. భగవంతుని అవతారాల్లో ప్రతిద్వాపరంలోనూ విష్ణువు వ్యాసుడై ఆవతరించి కర్మ, భక్తి, జ్ఞానాలను ప్రబోధం చేసి సమాజాన్ని ధార్మిక నిష్ఠతో నడిపిస్తాడని విష్ణుపురాణాది గ్రంథాలు పేర్కొన్నాయి. ద్వాపరయుగంలో విష్ణువు వ్యాసరూప జ్ఞానావతారుడై సమాజసేవ చేశాడు. వేదవ్యాసులవారు మన భారతీయ సంస్కృతి మహాపురాణాలను, మహాభారత ఇతిహాసాన్ని రచించి, మహాభాగవతాన్ని, బ్రహ్మసూత్రాలను అందించి మనలో కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలను పటిష్టం చేసాడు. భారతీయులందరూ జ్ఞానవిజ్ఞాన సంపన్నతకై వ్యాసభగవానుని స్మరించుకుని, తమ జీవిత రూపురేఖలు ధార్మిక, ఆధ్యాత్మిక మార్గంలో పయనించేటట్లుగా చేసుకుంటున్నారు. బ్రహ్మ, వశిష్ఠ, శక్తి పరాశర, వ్యాస, శుక, గౌడపాద, గోవింద భగవత్పాద, శంకరాచార్యులను స్మరించుకుని, గురుపరంపరని పూజించాలి. వ్యాసమహర్షి గురుపరంపరకు ఆద్యుడు. మన భారతీయ సంస్కృతిలో గురువుకు ముందు ప్రథమ గురువులైన తల్లిదండ్రులను సైతం పూజించడం ఓ సంప్రదాయంగా వస్తోంది.
.
శ్రీశ్రీశ్రీ ఛత్రపతి శివాజీ వంశం నందు శ్రీ సిందే పెద్ద వేంకట రాంజీ శ్రీమతి వెంకమాంబ లకు కొత్తబ్బి అనే పెద్ద మారుడు జన్నించినాడు. శ్రీ పిచ్చమాంబ ప్రేమతో నాన్నను పెద్దయార్యులు (పెద్దయ్య) అని పిలిచేది. పెద్దయ్య గారు 12 సంవత్సరాల ప్రాయం నుండే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మనువరాలు శ్రీ ఈశ్వరమ్మ గారి ప్రియ శిష్యప్రశిష్యులలో బజ్బిగారి వెంకటమ్మకు ప్రియ శిష్యుడుగా పెద్దయార్యులు సేవ చేసేవారు. శ్రీ ఈశ్వరమ్మ గారి ప్రియ శిష్యప్రశిష్యులలో ఒక్కరైన జడల రామయ్య. వీరి ప్రియ శిష్యుడు సద్విద్వాంసుడైన మోరె జోగయ్య భోధనలు చేస్తుండేవాడు. శ్రీ జోగయ్య - లక్ష్మాంబ పుణ్యదంపతుల ఏకైక కూమార్తె ఈశ్వరాంబ ను పెద్దయార్యులకు ఇచ్చి వీరి స్వగ్రాం నరసాపురం నందు వివాహం జరిపించినారు. ఈశ్వరాంబ కు పెద్దయార్యులకు పెద్ద కూమార్తెగా పిచ్చమాంబ జన్మించింది. పెద్దయార్యుల సోదరి కుమారునికి 5 సంవత్సరాలు నిండకముందే పిచ్చమాంబకు వివాహం జరిపించినారు.
.
పిచ్చమాంబ తండ్రిగారైన పెద్దయార్యులు నరసాపురం వదలి మైదుకూరు మండలంలోని వనిపెంట గ్రామం చేరి అక్కడి పిల్లలకు ఉపాధ్యాయుడై విద్యను భోదించేవాడు. చుండుపల్లె వెంకయ్య సహసేవకుడిగా పని చేసినాడు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారి మఠంకు పోయి అక్కడ పూర్ణబ్రహ్మవిచారులైన సాధుపుంగవులకు మరియు భక్తులకు అన్న ప్రాసాదులను తమ శక్తి కొలది సమర్పించుచు, వారి సువిచారమువల్ల సత్యమును గ్రహించుచు పెద్దలయందు నిరహంకార బుద్ధితో మెలంగుచు నిజమేరింగి ప్రభుసత్తముడు.
.
పిచ్చిమాంబ యుక్త వయస్సు రాగానే తల్లి తండ్రులు అత్తరింటికి పంపించడం జరిగింది. కొద్ది సంవత్సరాల తరువాత పూర్వజన్మపుణ్య ఫలంగా పిచ్చమాంబకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మనువరాలు శ్రీ ఈశ్వరమ్మ దర్శనంతో దైవాంతసంభూతరాలైంది. అత్తరిల్లు వదిలి తండ్రిగారి వద్దకు వచ్చింది. పెద్దయార్యులు పిచ్చమాంబ పరిస్థతిని గమనించి దైవమార్గమును పరిపూర్ణతో భోధించి, అమ్మా నీవింక జ్ఞానోపదేశము చేయమని తండ్రిగారు ఆజ్ఞాపించినారు. తండ్రిగారి అజ్ఞానుసారం పిచ్చమాంబ భక్త జనులకు జ్ఞాన అమృతాన్ని పంచిపెట్టుతుండేది. కొంత కాలానికి అచలబోధయందు కొంత సందేహము రావడంతో పోకల వేంకట నరసింహా రావు గారిని దర్శంచి అప్పుడు పరిపూర్ణ వాత్సత్యంతో అమ్మా నీవుఇప్పుడు చెప్పిన మీ తండ్రిడారి భావము సత్యమైనది. అంత కంటే మరేమిలేదని ద్వాదశి, షోడశి, పంచదశి మహా మంత్రములను వివరించి, భోధించి ఇదియే నీకు శ్రీ శివరామదీక్షితుల పరంపర యగుటవలన పిచ్చమాంబ శ్రీవారిని రెండవదైవముగా పూజించి జ్ఞానఅమృతాన్ని భోధిస్తుఉండేది.
.
శ్రీ పిచ్చిమాంబ ఉపదేశం...
”గురుచరణాంబుజ నిర్భర భక్త: సంసారా దచిరాద్భవముక్త:
సేంద్రియ మానస నియమాదవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవమ్‌”
అన్నారు శ్రీపిచ్చిమాంబ గారు.. గురుపాద పద్మముల యందు తొణకని బెణకని నిండైన భక్తి కలవాడై సంసారము నుండి విముక్తుడివికా, ఇంద్రియములతో కూడిన మనస్సును నియమించినందువల్లనే హృదయంలో ఉన్న ఆత్మతేజాన్ని చూడగలుగుతావు. పారమార్థిక విషయాల్లో గురుభక్తి లేనివాడు ఎంత కృషి చేసినా నిష్ప్రయోజనమే. దైవం పట్ల గురువు పట్ల నిరతిశయ దృఢభక్తి గలవానికే పరమార్థసిద్ధి కలుగుతుంది. గురువు అనుగ్రహ పాత్రుడైనవాడు సంసార సాగరం నుండి విముక్తి పొందగలడు. పరమార్థ సాధనకు ఇంతకంటే స్పష్టమైన ఉపదేశం ఏముంటుంది.
.
కడప జిల్లా, మైదుకూరులో వెలసిన శ్రీ సదానంద ఆశ్రమానికి ఆధ్యాత్మిక చరిత్రలో విశిష్టమైన స్థానం కలదు. శ్రీశ్రీ పిచ్చిమాంబ ప్రియ శిష్యుల అభ్యర్థన మేరకు మైదుకూరు మండలం పోరుమామిళ్ళ పోవు రహదారి ప్రక్కన శ్రీ సదానంద ఆశ్రమాన్ని స్థాపించి ప్రజల్లో దాత్వక చింత, ఆధ్యత్మిక భావాలను పెంపొందించి ఈ ఆశ్రమంను మరింతగా అభివృద్ధి చెందడానికి విశేష కృషి చేసింది. మద్రాసులోని శ్రీ పోకల శేషాచార్యుల మార్గదర్శకత్వంలో శ్రీ పిచ్చమాంబ తారక యోగిగా మారి బృహద్వాశిష్ట సిద్ధాంతాన్ని ప్రతిపదికగా చేసుకొని ఆ సిద్ధాంత భావనలను విస్తృత ప్రచారం కల్పించేందుకు 1931 జూన్ నెలలో సదానంద ఆశ్రమ ట్రస్టును శ్రీ పిచ్చమాంబ ఏర్పాటు చేశారు. సదానంద ఆశ్రమంలో పూజా మందిరం, భజన మందిరాలను ఏర్పాటుచేసి ఆశ్రమంలో అహర్నిశలూ ఆధ్యాత్మిక, తాత్విక కార్యక్రమాలనూ, ధ్యాన పూజూ కార్యక్రమాలనూ నిర్వహించేవారు.
.
కడప జిల్లాలోని పులివెందుల, చవ్వారి పల్లె, పెద్ద అక్కులవారి పల్లె, సున్నపూరాళ్ళ పల్లె, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, యాడికి మరియు మైదుకూరు ప్రాంతంలోని భూమాయ పల్లె, పెద్దపసువుల, స్వరాయ పల్లె కొత్తపల్లె, శేట్టవారి పల్లె నుండి గురుశిష్య పరంపర శ్రీ సదానంద అశ్రమానికి తరలివచ్చి ఇక్కడ కార్యక్రమాలలో రోజుల తరబడి పాల్గోనేవారు. రాష్ట్రం నలుమూలలనుండి గురు భోధకులు తరలివచ్చి ఆశ్రమంలో శిష్యులకు భోధనలు చేసేవారు. శ్రీ పిచ్చమాంబ స్వయంగా తమ శిష్యులకు, జిజ్ఞాసులకూ భోధనలు చేస్తూ, వారి తాత్విక సందేహాలను తీరుస్తూ ఉండేవారు.
.
శ్రీ పిచ్చమాంబ జ్ఞానామృత భోధన కేవలం ఉపన్యాసాలకు పరిమితం కాలేదు. శ్రీ పిచ్చమాంబ రచించిన శ్రీ ప్రబోధచంద్రోదయం, శ్రీ వీరగురురాజ శతకం, తత్వరామాయణం, తత్వ ప్రబోధిని, అచల శతకం గ్రంధాలనే కాకుండా తాత్విక, శతక, పురాణాలను శ్రీ పిచ్చమాంబ రిచించినారు. శ్రీ వీరగురురాజ శతకం ఆధ్యాత్మిక, విద్యా పరమార్ధాలను గొప్ప వివరణాత్మక గ్రంథంగా పేరుగాంచింది తత్వ రామాయణం అనే గ్రంధాన్ని పోరుమామిళ్ళ మండలంలోని చల్లగిరి గ్రామం లో వెలసిన శ్రీరామచంద్రుని దేవాలయంలో శ్రీ రామ చంద్రుని సన్నిధిలో శ్రీ పిచ్చమాంబ రచించినారు. శ్రీ ప్రబోధ చంద్రోదయం గ్రంథం, శ్రీ కృష్ణుశ్రీయం అనే హిందీ గ్రంధాలన్ని అనువాద గ్రంథంగా శ్రీ పిచ్చమాంబ వెలువరించారు. అలాగే తత్వ ప్రబోధిన లో కందార్థ తత్వాలను శ్రీ పిచ్చమాంబ హలిద్యమైన రీతిలో రూపోందించారు. మానవ దేహ తత్వానికి రామాయణం గాథను అనవయించి రచించిన తత్వరామాయణం తాత్విక సాహిత్యంలో ఒక గొప్ప ప్రయోగంగా శిష్యపరంపరలో శిశేష ప్రాచుర్యాన్ని సంతరించుకున్నది. అంతే కాకుండా శ్రీ పిచ్చమాంబ రచించిన చాల గ్రంధాలు వెలుగోనిరాలేదు. చాల బాధకరానికి గురిచేస్తుంది.
.
శ్రీ పిచ్చమాంబ ఆశ్రమంలో మరో ప్రత్యేకమైన చెక్రాంతి చెట్టు (కొండగోయ్యి) చెట్టు కలదు ఎన్నో ఒౌషద గుణాలు ఉన్నట్టు విజ్ఞాన పూర్వకంగా నిరూపించ బడింది. అంతేకాకుండ దీర్ఘ కాలిక రోగాలు నయమవడంతో పాటు, మరేన్నో వ్యాధులను నయం చేయగల శక్తి ఈ చెట్టుకు కలదు. ఇక్కడ తప్ప మరెక్కడ ఈ చెట్టు కనపడదు.
.
సదానందాశ్రమ నిర్వహణలో శ్రీ పిచ్చమాంబ ఆమే శిష్యులు విశేష సహాకరాన్ని, సేవలను అందించినారు. సదానందశ్రామంలో శ్రీ పిచ్చమాంబ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు జరగడం వలన కాలక్రమంలో సదానంద ఆశ్రమానికి బదులుగా శ్రీ పిచ్చమాంబ మఠంగా పేరువచ్చింది. తన ప్రబోధ చంద్రోదయ గ్రంధానికి తాను రాసున్న భరతవాక్యంలోని మన దేశంపట్ల, దేశంలోని ప్రజల సుఖ శాంతులపట్ల అపారమైన ఆకాంక్షను శ్రీ పిచ్చమాంబ వ్యక్తంచేశారు. శ్రీ పిచ్చమాంబ మఠంలో అందమైన పూలతోట, పండ్లతోట, మంచినీటి బావి ఉండేవి. 1957 హేవిళంబి నామ సంవత్సరం చైత్రమాసం బహుళ ద్వాదశి శుక్రవారం నాడు శ్రీ పిచ్చమాంబ బ్రహ్మాండయిక్యం అయినారు.
.
భారతవని పరమపారకమైనది. మహామహులైన మహాతత్వవేత్తలు నడయాడిన పుణ్యభూమి. మూర్తిభవించిన మాతృతత్వం మన్నుగా రూపుదాల్చి కొంగుపరిచి తనబిడ్డలకు నివాస క్షేత్రంగా ఏర్పరచిన ఆధారం. జీవితానికీ జీవనానికీ, జాతిమనుగడకూ మూలాధారమైన ఏకైక ఆలంబనం. అదే పుడమితల్లి భారతమాత! భారతభూమి! పరమపావనమైన భారతీయ సంసృతికీ, దైవీభావనలనూ అణువణువునా జీర్ణింపచేసిన మహర్షులు నడచిననేల!భారతదేశం పుణ్యభూమిగా, పేదభూమిగా, ప్రపంచ దేశాలలో తనకంటూ విశిష్టస్థానాన్నీ, విలక్షణ వారసత్వాన్నీ సంతరించుకున్న భారతదేశంలో ఎందరో సాధుపుంగవులు, సాధ్వీమాతాలు, సిద్దులు, అవధూతలు, అవతరించి, భారతదేశంలో ఆధ్యాత్మిక జ్ఞానామృతానికి తమ భోధనలనూ, రచనలనూ అందించినారు శ్రీ పిచ్చమాంబ అలాంటి మహానీయుల కోవకు చెందిన అమృత మూర్తిగా చరిత్రకు ఎక్కినారు. తెలియని వారికి జ్ఞాని, తెలిసిన వారికి అవ ధూత, భక్తుకు క్పవల్లి, ఆర్తుకు వరదాయిని, జిజ్ఞాసువుకు మహిమ పుట్ట, మహాయోగి శ్రీ పిచ్చమాంబ గారు.
.
గురు సాంప్రదాయంలో ఉన్నవారంతా తమతమ గురువుల్ని దర్శించి సేవించేరోజున గురువు యొక్క గత కీర్తిని చాటినట్లు అవుతుంది.
అపార కారుణ్య సుధాతరంగై:
అపాంగ పాతైరవలోకయంతమ్‌
కఠోర సంసార నిధాఘతప్తాన్‌
మునీనహం నేమి గురుం గురూణామ్‌..
తస్మై: శ్రీ గురవే నమ:
.........
సేకరణ…
రచన...
మీ..
ఆర్.బి. వెంకటరెడ్డి
భారతీయ సనాతన హిందూ ధర్మ సంరక్షణ సమితి
reddemb@gmail.com
https://www.facebook.com/rb.venkatareddy
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List