సలేశ్వరం ~ దైవదర్శనం

సలేశ్వరం

శ్రీశైలం అన్ని సార్లు వెళ్ళారు . కానీ 
ప్రక్కన ఉన్న అత్బుతమైన సలేశ్యరం చూసారా.
సలేశ్వరం (Saleshwaram) ఇది శ్రీశైలం లొని ఒక యత్రా స్థలము.ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవులలొని ఒక ఆదిమవాసి యత్రస్థలమ. ఇక్కడ ప్రతి రెండు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ జాతరజరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత తోలిపౌర్ణమికి మొదలగుతుంది. శ్రీశైలానికి 40 కిలొమిటర్ల దూరం లో వుంటుంది. అడవిలో నుండి 25 కిలొమిటర్ల ప్రయాణం వుంటుంది. ఇందులో 20 కిలొమిటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది అక్కడి నుండి 5 కిలొమిటర్ల కాలినడక తప్పదు.. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలోవున్నా గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవచ్చరం లో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి వుంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్షకు లు అందరు ముగ్డులు అవుతారు.
ఉనికి: -
ఇది మన రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా లోని అమ్రాబాద్ మండలం లోని మన్నానూర్ నల్లమల అడవులలో వుంది. హైదరాబాద్-- శ్రీశైలం --- హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే రహదారిలొ 150 కిలోమీటర్ రాయి నుండి 32 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో వుంది. ఆటవీ శాఖ వారి అనుమతితో ఆ దారెంబడి పది కిలోమీటర్ల దూరం వెళ్ల గానె రోడ్డు ప్రక్కన నిజాం కాలం నాటి ఒక పురాతన కట్టడం కనబడుతుంది.
చరిత్ర: -
అక్కడి పకృతి అందాలకు ముగ్దుడైన నిజాం వంద సంవత్సరాలకు ముందే అక్కడ ఒక వేసవి విడిదిని నిర్మించాడు. అదిప్పుడు శిధిలావస్తలో వుంది. ఆ ప్రదేశానికి ఫరాహబాద్ అనిపేరు. అనగా అందమైన ప్రదేశం అని ఆర్థం. అంతకు ముందు దాని పేరు' పుల్ల చెలమల'. 1973 లో 'ప్రాజెక్ట్ టైగర్' పేరిట పులుల సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. అది మన దేశంలోనె అతి పెద్ద పలుల సరక్షణా కేంద్రం. నిజాంవిడిది నుండి ఎడమ వైపున 22 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంపు వస్తుంది. అక్కడే వాహనాలను ఆపుకోవచ్చు. అక్కడినుండి సలేశ్వరం అనే జలపాతం చేరుకోడానికి రెండు కిలొమీటర్ల దూరం నడవాలి. అక్కడ రెండు పొడవైన ఎత్తైన రెండు గుట్టలు ఒకదాని కొకటి సమాంతరంగా వుంటాయి. మధ్యలో ఒక లోతైన లోయ లోనికి ఆ జలదార పడుతుంది. తూర్పు గుట్టకు సమాంతరంగా అర కిలోమీటరు దిగి తరువాత దక్షిణం వైపుకి తిరిగి పశ్చిమ వైపున వున్న గుట్టపైన కిలో మీటరు దూరమ్ నడవాలి. ఆ గుట్ట కొనను చేరుకొన్నాక మళ్ళీ ఉత్తరవైపునకు తిరిగి గుట్టాల మధ్య లోయ లోనికి దిగాల ఆ దారిలొ ఎన్నే గుహలు, సన్నని జలధారలు కనిపిస్తాయి. గుండం కొంత దూరంలో ఉందనగా లోయ అడుగు బాగానికి చేరు కుంటాం. గుండం నుండి పారె నీటి ప్రవాహం వెంబడి రెండు గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒక్కోచోట బెత్తెడు దారిలో నడవాల్సి వుంటుంది. ఏమరు పాటుగా కాలు జారితె ఇక కైలాసానికే. గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాల అందంగా కనిపిస్తుంది. తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టు ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలోనుండి ఆకాశం కుండ మూతి లోపలి నుండి ఆకాశం కనబడినట్లు కనబడుతుంది. గుండంలోని నీరు అతి చల్లగా, స్వచ్చంగా వుంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆనీరు ఆరోగ్యానికి చాల మంచిది. గుండం ఒడ్డు పైన తూర్పు ముఖంగా రెండు గుహలు ఒకదానిపై ఒకటి వున్నాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనె ప్రధాన దైవ మైనలింగమయ్య స్వామి లింగం వున్నది. స్థానిక చెంచులేఇక్కడ పూజారులు. క్రింద గుహలో కూడ లింగమే వున్నది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, -గంగమ్మవిగ్రహాలున్నాయి.
జాతర: -
సలేశ్వరం జాతర సంవత్సరాని కొక సారి చైత్ర పౌర్ణ్మికి రెండు రోజులు ముందు, రెండు రోజులు వెనుక మొత్తం ఐదు రోజులు జరుగుతుంది. ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుతున్నది గాన కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి కలిగిస్తున్నారు. భక్తులు వచ్చేటప్పుడు "వత్తన్నం వత్తన్నం లింగమయ్యో" అంటు వస్తారు. వెళ్లేటప్పుడు "పోతున్నం పోతున్నం లింగమయ్యొ" అని అరుస్తూ నడుస్తుంటారు.
చారిత్రల ఆదారాలు: -
నాగార్జున కొండలో బయట పడిన ఇక్ష్యాకుల నాటి అనగా క్రీ.శ. 260 నాటి శాసనాలలోమూస:చుళధమ్మగిరి గురించిన ప్రస్తావన ఉన్నది. ఆ గిరిపై అనాడు [[ శ్రీ లంక నుండి వచ్చిన బౌద్ద బిక్షవులుకొరకు అరామాలు, విహారాలు కట్టించారట. ఆ చుళ దమ్మగిరి ఈ సలేశ్వరమే నని నమ్మకం. కారణం అక్కడ ఇక్ష్యాకుల కాలపు కట్టడాలు వున్నాయి. లింగమయ్య గుడి గోడల ఇటుకల పరిమాణం 16"/10"/3" గా వున్నాయి. అలాంటి ఇటుకల వాడకం ఇక్ష్వాకుల కాలంలోనె ఉండేది. . "సుళ" తెలుగులో "సుల" అవుతుంది కాబట్టి బౌద్ద క్షేత్రం శైవ క్షేత్ర్తంగా మార్పు చెందాక సులేస్వరం గా ......చివరగా సులేశ్వరంగా మారి వుంటుంది. ఇక్ష్యాకుల నిర్మాణాలకు అధనంగా విష్ణు కుండినుల క్రీ.శ.. 360 ---370 కాలపు నిర్మాణాలు కూడ వున్నాయి. వీరి ఇటుకల పరిమాణసం 10'"/ 10"/3" . దిగువ గుహలోని గర్బగుడి ముఖ ద్వారం పైన విష్ణు కుండినుల చిహ్నమగు పూలకుండి శిలాఫలకం వున్నది. ద్వార బందంపై గడప మధ్యన గంగమ్మ విగ్రహం వున్నది. ద్వారం ముందర కుడి పక్కన సుమారు రెండున్నర అడుగుల ఎత్తున నల్లసరపు మీసాల వీరభద్రుని విగ్రహం నాలుగు చేతులలలో నాలుగు ఆయుదాలు వున్నాయి. కుడి చేతిలో గొడ్డలి, కత్తి, ఒక ఎడమ చేతిలో ఢమరుకం ఎడమ చేయి కిందికి వాలి ఒక ఆయుదాన్ని పట్టుకుని వున్నది. బీరభద్రుని కింద కుడి వైపున పబ్బతి పట్టు కున్న కిరీటం లేని వినాయాకుని ప్రతిమ ఉండగా ఎడమ వైపున స్త్రీమూర్తి వున్నది. ద్వారానికి ఎడమ వైపున విడిగా రెండు గంగమ్మ విగ్రహాలున్నాయి. ఇవే పాతవిగా కనబడుతున్నాయి. ఈ విగ్రహాల ముందు ఒకనాటి స్థిర నివాసాన్ని సూచించె విసురు రాయి వున్నది. గుడికి ఎడమ వై పున గల అరాతి గోడకి బ్రంహీ లిపిలో ఒక శాసనం చెక్కబడి వుంది. కుడివైపున గల గోడమీద ఒక ప్రాచీన తెలుగు శాసనం కూడ వున్నది. ఈ రెండూ విష్ణు కుండినుల శాసనాలుగా తోస్తున్నాయి. వీటిని చరిత్ర కారులు చదివి వివరిస్తే విక్ష్ణుకుండినుల జన్మస్థానాన్ని ఖచ్చితంగా నిర్ణయించ వచ్చు. స్థల మహాత్యం అనే ఒక ప్రాచీన తెలుగు క్షేత్ర మహాత్యం కావ్యాలలో సలేశ్వరాన్ని రుద్ర కుండంగా, దీనికి ఈశాన్యాన గల మల్లెల తీర్థం అనే జలపాతాన్ని విష్ణు కుండంగా, పశ్చిమాన గల లొద్దిఅనగా గుండాన్ని బ్రంహ కుండంగా పేరొన్నారు. పిష్ణు కుండిన రాజులు ఈ ప్రాంతం నుంచి ఎదిగినారు కనుకనే ఈ ప్రాంతపు పేరు పెట్టుకొన్నారు. ఈ విషయాన్ని ప్రముఖ చరిత్ర కారుడు బ్.ఎన్ శాస్త్రి నిరూపించారు. క్రీ.శ. పదమూడవ శతాబ్దాంత కాలం నాటి మల్లికార్హ్జున పండితారాద్య చరిత్ర లో శ్రీపర్వత క్షేత్ర మహాత్యంలోకూడ ఈ సలేశ్వర విశేషాలను పాల్కురి సోమనాధుడు విశేషంగా వర్ణించాడు. 17 వ శతాబ్దాంతంలో మహారాష్ట్రకు చెందిన చత్రపతి శివాజి కూడ ఇక్కడ అశ్రయం పొందినట్లు స్థానిక చరిత్ర వలన తెలుస్తున్నది.
ప్రకృతి: -
సలేశ్వరం లోయ సుమారు రెండు కిలో మీటర్ల పొడవుండి మనకు అమెరికా లోని గ్రాండ్ క్యానన్ను గుర్తు చేస్తుంది. గ్రాండ్ కానన్ అందాలను చాలమందిమెకన్నాస్ గోల్డ్ సినిమాలో చూసి వుంటారు. సలేశ్వరంలోని తూర్పు గుట్ట పొడువునా స్పష్టమైన దారులు వున్నాయి. అవి జంతువులు నీటి కోశం వెళ్లే మార్గాలని స్థానిక గిరిజనులు చెప్తారు. పడమటి గుట్టలో ఎన్నో గుహలున్నాయి. అవన్నీ కాలానుగుణంగా ఒకప్పుడు ఆది మానవులకు, ఆ తరువాత అబౌద్ద బిక్షవులకు, ఆపైన మునులకు, ఋషులకు స్థావరాలుగా వుండేవని అక్కడి ఆదారాలను బట్టి తెలుస్తుంది. ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు, చరిత్ర పరిశొధకులకు చాల బాగ నచ్చే ప్రదేశం ఇది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List