సుమతి అనే మహారాజుకి ఇచ్చిన మాట ప్రకారం వేంకటేశ్వర స్వామి పార్థసారధిగా ఇక్కడ వెలసినాడని అంటారు. ఈ పార్థసారధి విగ్రహాన్ని ఆత్రేయ మహర్షి ప్రతిష్టించాడని చెబుతారు. ఇంకో కథ ప్రకారం శ్రీ రామానుజాచార్యుల తల్లిదండ్రులు ఇక్కడకు వచ్చి సంతానం కొఱకు స్వామిని వేడుకొనగా రామానుజాచార్యుడు జన్మిస్తాడు. మఱియొక కథ ప్రకారం పార్థసారథి స్వామి ధర్మ సంస్థాపనకు విశిష్టాద్వైతాన్ని ఆవిష్కరించడానికి రామానుజాచార్యులగా జన్మించాడని చెబుతారు. బ్రహ్మాండ పురాణం ప్రకారము ఈ క్షేత్రానికి తిరువల్లిక్కేణి అని పేరు. ఆంగ్లేయులు తిరువల్లిక్కేణి ని ట్రిప్లికేన్ అని వ్యవహరించిరి .
చెన్నైలోని పార్థ సారథి దేవాలయం ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం చెన్నై నగరం ట్రిప్లికేను(తిరువల్లిక్కేణి)లో కలదు. ఈ ఆలయాన్ని 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటిగా చెబుతారు. ఈ దేవాలయం ఎనిమిదవ శతాబ్దానికి చెందినది.
మహాభారత ఇతిహాస ప్రకారం శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని రథసారధిగా ఉంటాడు. కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఇరువైపుల ఉన్న బంధువు యుద్ధ సంగ్రామంలో మరణిస్తారని తలచి అస్త్రాలను విడిచి పేడుతుంటె కృష్ణుడు భగవద్గీతను భోధించి అర్జునుణ్ణి యుద్ధానికి సమాయత్తం చేస్తాడు. కురుక్షేత్రంలో పాల్గొన్న ఆనవాళ్ళను తెలియజేస్తూ ఇక్కడి మూల విరాట్టుకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. భీష్ముడు విడిచిన అస్త్రాలు, బాణాలు శ్రీకృష్ణుడికి కూడ తగలడం వళ్ల స్వామి ముఖంపై కొన్ని మచ్చలు ఉంటాయి. సాధారణానికి భిన్నంగా స్వామికి మీసాలు ఉంటాయి. కురుక్షేత్ర సంగ్రామంలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేయడం వల్ల ఈ విగ్రహానికి మహావిష్ణువు ఆయుధమైన సుదర్శన చక్రం ఉండదు. చేతిలో కేవలం శంఖం మాత్రమే ఉంటుంది. పార్థసారధి యాదవుల వంశంలో జన్మించడం వల్ల ఉత్సవ మూర్తిగా ఒక దారుశిల్పం (చెక్క బొమ్మ) మాత్రమే ఉంటుంది. సాధారణంగా ఉత్సవ మూర్తుల విగ్రహాలను పంచలోహాలతో గాని రాతితో గాని తయారు చేస్తారు.
No comments:
Post a Comment