ఘటిక సిద్ధేశ్వరకోన. ~ దైవదర్శనం

ఘటిక సిద్ధేశ్వరకోన.


 శివోహం.. భజేహం! శివనామస్మరణతో హోరెత్తిన శైవక్షేత్రం...
* అత్యంత మహిమాన్వితమైన ఘటిక సిద్ధేశ్వరకోన...
* కోరిన కోర్కెలు తీర్చే ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారు...
* సిద్ధేశ్వర క్షేత్రంలోని ఉమామహేశ్వరుల కల్యాణం జరిపిన అగస్త్య మహర్షి ...
* శ్రీ అవధూత కాశిరెడ్డి నాయన స్వామి పునరుద్ధరించిన పురాతన శివాలయం...
* నల్లమల కొండపైన గుహల్లో తపస్సు చేస్తున్నా సాధువులు, సిద్ధులు ...
* కష్టాలు దూరంచేసే ఆకాశ కోనేరు...
అంతులేని ఆహ్లాదం.. మైమరిపించే ప్రకృతి సోయగం.. కనువిందు చేసే అటవీ అందాలు.. వింత గొలిపే విభిన్న జాతి పక్షులు.. ఆరోగ్యాన్నిచ్చే ఔషధ మొక్కలు.. ఆధ్యాత్మికానికి మారుపేరు నల్లమల అడవులు. ఇక్కడి శివాలయా ప్రదేశాన్ని వీక్షించేందుకు రెండు కళ్లు చాలవు. ఆహ్లాదానికి మారు పేరు నల్లమల కొండలు. ఇక్కడి ప్రకృతి రమణీయత సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటోంది. పక్షుల కిలకిల రావాలు సంగీతాన్ని తలపిస్తాయి. వేలరకాల ఔషధ మొక్కలు నల్లమల పర్యాటక ప్రాంతంలో ఉంటాయి. ఈ ఔషధ మొక్కల నుంచి వీచే గాలిఎన్నో రకాల జబ్బులకు ఔషధంగా పని చేస్తుంది. ఒక్కసారి ఇక్కడికొస్తే మళ్లీమళ్లీ రావాలనిపించేలా ఉంటుంది. ఈ అటవీ ప్రాంతంలో పర్యాటకులు ట్రెక్కింగ్ చేస్తే ఆహ్లాదంతోపాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఇక్కడి గాలిని పీల్చుకోవడంతోనే సర్వరోగాలు నయమవుతాయని ఇక్కడి భక్తులు చెబుతుంటారు.
.
.
శ్రీ ఘటిక సిద్ధేశ్వరస్వామి వారి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరుజిల్లా సీతారామపురం మండలంలోని శ్రీసిద్ధేశ్వరకోనలో ఉన్నది. ఘటిక సిద్ధేశ్వరం నెల్లూరునకు 110 కిమీ దూరంలో కలదు. ఈ పుణ్యక్షేత్రం చుట్టూ పెద్ద కొండలు, పచ్చని చెట్లు, ఎతైన కొండలు, పక్షుల కిలకిలరావాల నడుమ మనసును మైమరపించే ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ఘటిక సిద్దేశ్వరం చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల జిల్లాన నుండి పెద్ద ఎత్తును భక్తులు వస్తూ ఉంటారు. ఈ ‘ఘుటిక సిద్దేశ్వరం’ స్వామి ఆలయానికి కార్తీక మాసం, శివరాత్రికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు.
.
.
నెల్లూరు జిల్లాలోని పురాతన పుణ్యక్షేత్రం ఘటిక సిద్ధేశ్వరం చాలా పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయం కొంతకాలంపాటు ఆదరణ లేక శిధిలావస్తకు చేరుకునే దశలో కాశీనాయన స్వామి పునరుద్ధరించారు. అంతేకాకుండా శ్రీ కాశీనాయన ఆశ్రమం వారు ఈ క్షేత్రానికి వచ్చే భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాశీనాయన భక్తులు ఎంతో ఆప్యాయతతో భక్తులను పలకరిస్తారు. మరి ముఖ్యంగా మేము నల్లమల కొండపైన గుహల్లో తపస్సు చేస్తున్నా సాధువులు, సిద్ధులను చూడడానికి మేము మూడు కోండలు ఎక్కిన గాని ఓంకార ధ్వని మాత్రమై వినపడుతున్నాది కాని సిద్ధులు మాత్రం కనిపిచలేదు. ఇంకా కొంచేం ముదుకు కదిలి చూడగ గుహలు కనిపించినాయి. ఒక గుహలో కాళికా మాతకు సిద్ధులు పూజలు చేసి వేళ్ళినట్ల కపించింది. కొంత దూరం పోయిన తరువాత సీత రామ లక్ష్మణ సమేత అభయ ఆంజనేయ స్వామి విగ్రహలకు, శివునికి పుజాలు చేసిన అనవాళ్ల కనిపించినాయి. ఇక్కడి గుహలో నిత్యం శివలింగంపై నీరు పడుతుంది ఈ గుహ యొక్క ప్రత్యేకత...
.
.
శ్రీ ఘటిక సిద్దేశ్వర స్వామి సన్నిధానంలో సందర్శించవలసిన ఇతర స్థలాలు:...
శ్రీ సిద్ధివినాయక స్వామి, శ్రీ ఘటిక సిద్దేశ్వర స్వామి, శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారు, శ్రీ సద్గురు కాశీనాయన స్వామి, శ్రీ వృద్ధ సిద్దేశ్వర స్వామి, నవగ్రహ మండపం, ఏకశిలా ధ్వజ స్తంభం, మహా బిల్వ వృక్షం, అగస్త్య పీఠం, వీరభోగ వసంతరాయలు, కైలాస కోన (తపోవనం), అయ్యప్ప స్వామి గుడి, ధ్యాన మందిరం, సప్త కోనేరులు, పాలకోనేరు, నంది ధార.. కొండపైన గుహల్లో... కాళికా మాత, సీత రామ లక్ష్మణ సమేత అభయ ఆంజనేయ స్వామి, శివలింగం...
.
.
ఘటిక సిద్ధేశ్వరకోనలో ఉన్న ఆకాశ కోనేరు....
కోనేరులోని విశేషమేమంటే కోనేరు ఎండిపోయి కన్పిస్తుంది...కానీ అదే కోనేరు నంది ఉన్న ప్రదేశమునకు, అన్నదాన ప్రదేశమునకి, స్వామి వారి అన్ని సేవలకు, కోనేరుకి, పూజారి ఇంటికి ఎల్లప్పుడు నీరు ప్రవహిస్తూ ఉంటుంది.
.
.
ఇక ఇక్కడ కోనేరు ఆవిర్భవించిన తీరులోకి వెళితే, పరమశివుడు తన త్రిశూలాన్ని భూమిపై గుచ్చడం వలన ఇక్కడ జలధార పుట్టిందని చెబుతారు. పూర్వం ఇక్కడి సిద్దేశ్వరుని అభిషేకించడానికి పూజారి చాలాదూరం వెళ్లి అభిషేక జలాన్ని తీసుకుని వచ్చేవాడట. మహాభక్తుడైన ఆ పూజారి వయసైపోయిన కారణంగా, ఒకరోజున అభిషేకజలం కోసం అంతదూరం వెళ్లలేక సొమ్మసిల్లి పడిపోయాడు. కరుణా సముద్రుడైన శివుడు వెంటనే అక్కడ ప్రత్యక్ష్యమయ్యాడు. పూజారిని మామూలు స్థితికి తీసుకువచ్చి, ఇక పై అభిషేక జలం కోసం ఎక్కడికీ వెళ్లనవసరం లేదని చెబుతూ, తన త్రిశూలాన్ని నేలపై పొడవగానే అక్కడి నుంచి జలధార పొంగుకొచ్చి కోనేరు ఏర్పడింది. అలా పరమశివుడి త్రిశూలం నుంచి పుట్టిన ఈ కోనేరు, పూజారి కష్టాలనే కాదు భక్తులందరి కష్టాలను కడిగేస్తుంది. ఈ కోనేరులోని నీటిని తలపై చల్లుకున్నవారిని కష్టాలు సమీపించలేవని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. స్వామి వారి కోనేరు నీటిని త్రాగడం వలన అనారోగ్యాలు తొలగిపోతాయనీ ... అంతేగాక స్నానం చేయడం వలన మోక్షం లభిస్తుందని స్థలపురాణం చెబుతుంటుంది. ఈ కోనేరులోని నీరు సర్వరోగ నివాణిగా భావిస్తారు..
.
.
ఆలయ చరిత్ర :...
ఈ నల్లమల కోండల్లో సిద్ధులు తపస్సు చేసిన ప్రాంతం కాబట్టి దీనికి సిద్దేశ్వరం అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇప్పటికీ కొండపైన గుహల్లో కొంతమంది సాధువులు తపస్సు చేస్తుంటారని చెబుతారు. అత్యంత ప్రాచీన శైవక్షేత్రాల్లో ఘటిక సిద్దేశ్వరం ఒకటి. ఈ ఆలయంలో ఇక్కడి స్వామి శివుడు సిద్దేశ్వరునిగా, అమ్మవారు ఇష్టకామేశ్వరిగా కొలువై వున్నారు.
.
.
క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి పూర్వం వెలసినట్లు స్థల పురాణం చెబుతోంది. సప్త రుషులలో ఒకరైన అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో తపస్సు చేసి ఉమామహేశ్వరుల కల్యాణం జరిపినట్లు నిత్యనాథసిదద్ధాచార్యులు రసరత్నాకర గ్రంథంలో పేర్కొన్నారు. అగస్ట్య మహర్షి తపస్సు చేసినట్లుగా ఇక్కడ మహర్షి కూర్చున్న ప్రదేశాన్ని శ్రీ అగస్త్య పీఠముగా పిలుస్తారు. క్రీ.శ: 1406లో విజయనగరం సామ్రాజ్యాన్ని పాలించిన రెండో హరిహరరాయులు, ఆయన తనయుడు మొదటి దేవరాయులు ఈ ఆలయానికి ప్రాకార మండపం నిర్మించినట్లు చరిత్ర చెపుతోంది. 1974లో అవధూత కాశినాయన ఈ క్షేత్రాన్ని జీర్ణోద్ధరణ చేశారు.
.
.
ఉత్సవాలు:...
ప్రతి సంవత్సరం శివరాత్రి మరియు కార్తీక మాసం నాడు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇచట కొలువుదీరిన ఇష్టకామేశ్వరీదేవి అమ్మవారు దశరా శరన్నవ రాత్రి ఉత్సవాల సమయంలో వివిధ రూపాల్లో
భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలందుకుంటారు.
.
.
దారి మార్గం:...
ఉదయగిరి - సీతారామపురం మార్గం మధ్యలో పోలంగారిపల్లి గ్రామం నుంచి 12.6 కిలోమీటర్లు మెటల్ రోడ్డుపై ప్రయాణం చేస్తే ఘటిక సిద్ధేశ్వరం వస్తుంది. శివరాత్రికి వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. నెల్లూరు నుండి ఆత్మకూరు, ఉదయగిరి మీదుగ రోడ్డు మార్గంలో ప్రయాణం చేయవచ్చును.
.
.
వసతి సాకర్యాలు:...
ఇక్కడకు వచ్చే భక్తులు సొంత వాహనాలపై ఆధారపడవలసి ఉంటుంది. ఇక్కడ కొండపై నుంచి ఎల్లప్పుడు నీరు ప్రవహిస్తున్నందు వలన మంచినీటికి ఇబ్బంది లేదు. ఇక్కడకు వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడకు వచ్చిన భక్తులు ఉత్సవాల సమయంలో తప్పక మామూలు రోజుల్లో సాయంత్రానికి తిరుగు ప్రయాణం అవుతారు. ఒకవేళ రాత్రికి ఇక్కడే ఉండవలసి వస్తే వసతి సౌకర్యాలకు కొదవలేదు.
.
రచన..
మీ..
ఆర్.బి. వెంకటరెడ్డి .
Don't Copy-Paste This Story
All Copyright Reserved 2017
RB. VENKATA REDDY
reddemb@gmail.com
https://www.facebook.com/rb.venkatareddy
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List