సంతానాన్నిచ్చే చల్లని తల్లి "కామాక్షమ్మ". ~ దైవదర్శనం

సంతానాన్నిచ్చే చల్లని తల్లి "కామాక్షమ్మ".



దేవేంద్రుడు వృషవర్యుడనే రాక్షసుడి కిరాతకాలను భరించలేక, తన దేవతా బృందాలతో హిమాలయా పర్వతాలలో కొంతకాలం గడిపారట. ఆ సమయంలో దేవేంద్రుడు కామాక్షి అమ్మవారి మహిమలను తెలుసుకుని జొన్నవాడ క్షేత్రానికి వచ్చి ఆమెను పూజించి, ఆమె అనుగ్రహం పొంది ఆ రాక్షసుడిని అంతం చేశాడట.
అశ్వత్థాముడు కూడా తన కుష్టురోగ నివారణ కోసం కామాక్షి అమ్మవారిని పూజించి, పినాకినీ నదిలో స్నానం చేసి తన వ్యాధిని నిర్మూలించుకున్నాడట. అలాగే కవి తిక్కన 13వ శతాబ్దంలో మహా భాగవత రచన ప్రారంభించేందుకు ముందు ఈ ప్రదేశంలో యజ్ఞంచేసి తన రచనను కొనసాగించాడని చెబుతుంటారు.
అదలా ఉంటే... ప్రతిరోజూ వివిధ అలంకరణలతో భక్తులకు దర్శనం ఇచ్చే ఈ అమ్మవారి ఆలయంలో అనునిత్యం వివిధ రకాల పూజలు నిర్వహిస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో వెలసిన అతి పురాతనమైన తులసికోటకు ఎంతోమంది భక్తులు ప్రదక్షిణలు చేస్తుంటారు. అలాగే చాలామంది భక్తులు ఈ ఆలయంలో నిద్ర చేసి వెళ్తుంటారు. వీరికి ఆలయ నిర్వాహకులు అనేక సౌకర్యాలను కల్పిస్తారు కూడా..!
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో పది రోజులపాటు ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో అమ్మవారిని, స్వామివారిని వివిధ ఆభరణాలతో అలంకరించి ఊరేగిస్తారు. ఆఖరి రోజున పినాకినీ నదిలో తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులను అలరించేందుకు ఆంధ్రప్రదేశ్ టూరిజంశాఖ పినాకినీ నదిలో బోట్ షికారుతోపాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List