మహిమాన్వితమైన నంజున్‌దేశ్వర శివాల‌యం. ~ దైవదర్శనం

మహిమాన్వితమైన నంజున్‌దేశ్వర శివాల‌యం.

* దీర్ఘకాలిక వ్యాధులే కాక మొండి రోగాలు కూడా మాయంచేసే శ్రీకంఠడు....
* ఇక్కడి మట్టి దివ్య ఔషధంతో సమానం....
ఈ ఆలయంలోని శివునికి పూజలు చేస్తే దీర్ఘకాలిక వ్యాధులే కాదు మొండి రోగాలు కూడా మాయమవుతాయట. ఈ పుణ్య క్షేత్రాన్ని దక్షిణ కాశి అని కూడా అంటారు. ఇది కర్ణాటక రాష్ట్రo లోని మైసూరు కి దగ్గ్గరలో ఉన్న నంజున్ గడ్ జిల్లాలో ఉంది. ఇక్కడి శివుడిని శ్రీ కంఠ ఈశ్వరుడు అని పిలుస్తారు. ఇక్కడి శివలింగాన్ని గౌతమ మహర్షి ప్రతిష్ఠ చేసారని ఆలయ శిలాఫలకాలు చెప్తున్నాయి.
.
.
ద్రావిడ శైలిలో నిర్మించిన ఆలయం ఇది అందమైన గోపురం ముందున్న మండపా రాతి స్తంభాలపై ఏనుగుల శిల్పాలు ,గర్భ గుడి లో మైసూర్ మహా రాజ మూడవ కృష్ణ రాయ ఒడయార్ స్తాపించిన లింగాలు ప్రాకారం చుట్టూ 63నయనారుల దివ్య విగ్రహాలు ,25శివ లీలా విగ్రహాలు పార్వతి నారాయణ ,సుబ్రహ్మణ్య విగ్రహాలు దర్శనీయాలు నెమలి వాహనం పై కూర్చున్న శరవణ భవుని తలపై నాగు పాము పడగా విప్పి ఉండటం విశేషం ఇక్కడి పరశురామ దేవాలయాన్ని దర్శిస్తేనే తీర్ధ యాత్ర పూర్తీ అయి నట్లు .ఇది కౌండిన్య నది ఒడ్డున గట్టు పై ఉంది మాత్రు హత్యా దోష పరిహారానికి పరశురాముడు ఇక్కడే తపస్సు చేశాడు .ఆయన్ను దర్శిస్తే సకల పాపాలు దోషాలు పోతాయని నమ్మిక .ఇక్కడి మట్టి ఔషధం తో సమానం గా భావిస్తారు .
.
.
నంజ అంటే విషం,నంజుంద అంటే విషం తాగి లోకాన్ని రక్షించివాడు అని అర్ధం వస్తుంది. సముద్రమథన సమయంలో వచ్చిన విషాన్ని సేవించిన శివుడు లోకాన్ని మొత్తం రక్షించి నీలకంటుడిగా పూజలందుకున్నాడు. ఆ అవతారమే ఇక్కడ ప్రతిష్ఠ గావించబడింది. ఆలయం దగ్గరలో ఉన్న కపిల నదిలో స్నానం చేసి వచ్చి ఉరుల్ అనే సేవ చేసుకుంటే ఎలాంటి వ్యాధి అయినా క్రమంగా తగ్గుముఖం పడుతుందిట. టిప్పు సుల్తాన్ ఇక్కడి మృత్తికా విశేషాన్ని తెలుసుకొని తన గుడ్డి ఏనుగు కు ఆ మట్టిని పట్టీ గా వేయించి నేత్ర దృష్టిని కలిగేట్లు చేసుకొన్నాడు .అందుకే టిప్పు ఈ దేవుడిని ‘’హక్కిం నం జుం డా ‘’అని భక్తీ తో పిలిచే వాడట. కనుక నేత్ర రోగులకు ఇది దివ్య క్షేత్రం టిప్పు తండ్రి హైదరాలీ నంజున్దేశ్వర స్వామికి ‘’పచ్చల నెక్లెస్ ‘’ను బహూకరించి తన స్వామి భక్తిని వేల్లడించుకొన్నాడు ఇక్కడి మట్టి చర్మ రోగ నివారిణి అని కూడా అంటారు.
.
.
ఈ శ్రీకంటేశ్వర ఆలయంలో ప్రతి ఏడాది రెండు సార్లు రథోత్సవం నిర్వహిస్తారట. ఒకటి దొడ్డ రథోత్సవం రెండవది చిక్క రథోత్సవం . ఈ రథోత్సవం మూడు రోజులు జరుగుతుంది. అయిదు రథాలతొ జరిగే ఈ ఉత్సవం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ఈ రథాలలో శివుడిని,.పార్వతి దేవిని,గణపతిని,కుమారస్వామిని,చండికేశ్వరుడిని తిరువీధులలో ఊరేగిస్తారు. మూడు రోజులు జరిగే ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథాలని లాగి తమ భక్తిని చాటుకుంటారు.
.
.
ఇక్కడికి దగ్గరలోనే పరశురామ క్షేత్రం ఉంది. పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తన తల్లి రేణుక శిరస్సుని ఖండించి ఆ వ్యథతో తనకు చిత్తశాంతి కలగటానికి ఎన్నో పుణ్యక్షేత్రాలని దర్శించాడట,కాని ఎక్కడా లభించని మనశ్శాంతి ఇక్కడికి వచ్చేసరికి లభించటం తో ఇక్కడే ఉండిపోయి తపస్సు చేసుకున్నాడట. శ్రీ కంఠ ఈశ్వరుడిని దర్శించుకునే వారు ముందుగా ఈ పరశురామ క్షేత్రాన్ని దర్శించాలిట.
ఈ ప్రాంతంలోని మరో విశేషం కపిల నదిపై కట్టిన వంతెన. ఇది దేశంలోనే అతి పురాతన బ్రిడ్జ్ గా పేరుపొందిదట. 1735 లో కట్టిన ఈ వంతెన ఇప్పటికి చెక్కు చెదరలేదు. అలాగే ఇక్కడి అరటిపండుకి కూడా ఒక ప్రత్యేకత ఉంది తెలుసా. నంజన్ గుడ్ రసభాలే అనే జాతిక్ చెందిన ఈ అరటి ఎంతో రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందిట.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List