ప్రొద్దుటూరు అమ్మవారిశాలను దర్శించిన మహాత్మా గాంధీ......
.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాకు చెందిన పర్లపాడు వాస్తవ్యుడు, పడిగసాల గోత్రజుడు ఐన కామిశెట్టి చిన్నకొండయ్య కు కలలో కన్యకా పరమేశ్వరి కనిపించి తనకు ఆలయము నిర్మించమని కోరుటతో మనమీ రోజు ఈ అమ్మవారిశాలను చూడగలుగుచున్నాము. ఆయన మద్రాసుకో పోయి వ్యాపారము అపారముగా చేసి ఆర్జించిన ధనముతో ఆ పని చేయగలిగినాడు. ఆతల్లి ఈ ఆర్యవైశ్యులకు అండయై ,కైదండయై, వసివాడని పూదండయై నేటికినీ ఈ పట్టణమున విలసిల్లుతూవుంది.ఈ పట్టణములోని వైశ్యులు ఎంత బ్రాహ్మణ విశ్వాసపరులో అంతటి మానవతా వాదులు. ఎందరో వేద శాస్త్రపండితులకే కాక సంస్కృతాంధ్ర భాషా పడితులనాదరించి వారికి నిలువనీడ ఏర్పరచి తమ ఔన్నత్యము చాటుకొన్నారు. మహనీయులు లబ్ధ ప్రతిష్ఠులు అయిన పుట్టపర్తి నారాయణాచార్యులవారు ఎల్లమరాజు శ్రీనివాసరావు గారు వీరి సత్కారములు ఆదరణ పొందినవారే. వీరు ఎన్నో దశాబ్దములు కుల విచక్షణ లేకుండా విద్యార్థులకు భోజన వసతి సౌఖర్యములు ఏర్పరచిన వదాన్యులు. మే 19,1929 మహాత్మా గాంధి ప్రొద్దుటూరుకు వచ్చి అమ్మవారిశాలవెంచేసి వైశ్య వర్గముచేత సన్మానించబడి, గౌరవముతో వారిచ్చిన 116 బంగారు కాసులను (ఇప్పటి తూకములో 230 గ్రాములు ) గ్రహించి ప్రొద్దుటూరుకు 'బంగారు ప్రొద్దుటూరు' అన్న గౌరవ నామము నోసంగినారు. ఇక్కడ అమ్మవారు కళామయి మరియు వాత్సల్యమయి. ఆ తల్లి కి ఆభరణాలు తోడుగులే కాక బంగారు రథము కూడా వున్నది.
https://www.facebook.com/rb.venkatareddy
No comments:
Post a Comment