విశ్వకర్మను ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లే......
.
అనంతమైనది అద్భుతమైనది ఆశ్చర్యకరమైనది ఆనందమయమైనది మన తెలివికి అందనిది అజ్ఞానాన్ని తరిమివేసే తేజస్వంతమైనది విశ్వకర్మ సృష్టి. పంచభూతాలతో అలరారుచు దివ్య శోభాయమానమై ఆ సృష్టి విరాజిల్లుతుంది. ప్రకృతి, పిపీలికాది బ్రహ్మపర్యంతం ఎనభై నాలుగు లక్షల జీవరాసులను పుట్టించువాడు, పోషించువాడు, లయింప చేయువాడు కాలచక్రమును నిరంతరం ఒకే కక్షలో తిప్పువాడు ఈ జగన్నాటకమును నడిపించు సూత్రధారి భువన భాండాలనెల్ల సమర్ధవంతంగా పరిపాలించు నాయకుడు, మనకు కనుపించే సహజ ప్రకృతి అందాలను అనల్పకల్పనా కళాపటిమతో సృజించినశిల్పశేఖరుడు! అతులితమైన వివిధ రంగులతో జగతిని సర్వాంగ సుందరంగా చిత్రించిన చిత్రకారుడు! మానవుని చిరుమెదడులో అనంతభావాలను పొందు పరచి నవరసాలొలికించే విశ్వదార్శనికుడు, సుదీర్ఘమై సాగు కాలగమనానికి, చైతన్య నర్తకుడు విశ్వకర్మ. సూర్యచంద్ర నవగ్రహతారకాది ఖగోళగతులను ఒక క్రమంలో ఉంచి, వెలుగులను నింపిన జ్యోతి స్వరూపుడు. రాగానురాగాలను ప్రతి గుండెలో పలికించు గాన గంధర్వుడు ఓంకారశబ్ద స్వరూపుడై పంచవేదనాదాలను స్వరయుక్తంగా అందించినవాడు విశ్వకర్మ. ఈ చరాచర జగతి కంతకు కర్మయే ప్రధానమైనది. కర్మ లేనిది జగతి లేదు. కర్మతోనే పుట్టి కర్మలోనే పెరిగి కర్మలోనే లయిస్తుంది సృష్టి. సకలకర్మలకు ఆధారపురుషుడు విశ్వకర్మయే, విశ్వకర్మ సమైక్య జీవనానికి ప్రతీక, మనది కర్మభూమి, కర్మసాక్షి సూర్యభగవానుడు.

పుట్టిన ప్రతిప్రాణి శ్రమ చేస్తూనే జీవనాన్ని కొనసాగిస్తుంది. శ్రమకు ప్రతి రూపుడ యిన విశ్వకర్మ శక్తియే గాయత్రీ మాత. సంధ్యావందన సమయంలో సూర్యుణ్ని ఆరాధిస్తు త్రికాలాల్లో గాయత్రిని స్మరిస్తూ ఉంటాం.పంచరుషి సంప్రదాయంతో, పంచ బ్రహ్మలను, పంచశక్తులను వాణీ బ్రహ్మలను, లక్ష్మీనారాయణులను, ఉమామహేశ్వరులను, శచీపుంరందురులను, సంజ్ఞా భాస్కరులను సృజించి వారి విధులను వారికి పంచి సృష్టి కార్యాన్ని సమగ్రంగా సమున్నతంగా కాపాడే బాధ్యత అప్పగించిన దేవదేవుడు బ్రహ్మాండమంతా నిండిన వాడు. బ్రహ్మాండమే తానైనవాడు. సకల ప్రాణికోటికి ప్రాణధారమై వెలుగువాడు, ముప్పది మూడు కోట్ల దేవతల స్వరూపుడయి వెలుగువాడు, నిరంజనుడు నిర్వికారుడు, పరిపూర్ణుడునైన విశ్వకర్మను ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లే.
No comments:
Post a Comment