చారిత్రాత్మక ఈ గ్రామాన్ని కాకతీయ రాజులు పరిపాలించారు. వారి హయాంలో అనేక దేవాలయాలు అప్పటి శిల్పశైలిని అనుసరించి నిర్మించారు. ఈ దేవాలయాలలో ఉన్న శిలాశాసనాలు అప్పటి చరిత్ర తెలుపుతున్నాయి. శాలివాహన శకం 1130 (క్రీ.శ. 1208)లో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు కన్నడ, తెలుగు భాషలలో వేయించిన శిలాశాసనం ఉన్నది. గణపతి దేవుడు కంటే మునుపు పరిపాలించిన కాకతీయ చక్రవర్తి, రుద్రదేవుడు శాలివాహన శకం 1117 (క్రీ.శ.1195) సంవత్సరములో వేయించిన శిలాశాసనం కూడా ఉన్నది. కాకతీయుల కాలం నాటి నాణెములు కూడా ఈ గ్రామములో లభించాయి. కాకతీయుల తరువాత పిల్లలమర్రి రేచర్ల రెడ్డి రాజులకు రాజధానిగా విలసిల్లినది. ప్రఖ్యాత తెలుగు కవి పిల్లలమర్రి పిన వీరభద్రుడు జన్మస్థలము పిల్లలమర్రి.
https://www.facebook.com/rb.venkatareddy
https://www.facebook.com/rb.venkatareddy
No comments:
Post a Comment