గృహ‌ప్ర‌వేశం ఎలా..? ఏదీ మంచి ముహూర్తం..? ~ దైవదర్శనం

గృహ‌ప్ర‌వేశం ఎలా..? ఏదీ మంచి ముహూర్తం..?

గృహ‌ము నిర్మాణం అయిన త‌ర్వాత అందులోకి ప్రవేశించే ముందు జరుపుకొనే పండుగ గృహ ప్రవేశం. హోమం, నవగ్రహాలకు శాంతి, సత్యనారాయణ స్వామి వ్రతం, గోవుతో ముందుగా ఇల్లు తొక్కించడం, బంధువులకు, స్నేహితులకు విందు మొదలైనవి ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్యమైనవి.

అయితే గృహప్రవేశానికి ఏ రోజు మంచిది అనే విష‌యం చాలా ముఖ్యం. సూర్యుడు కుంభరాశిలో సంచరించే కాలం మినహా మిగిలిన మాసాలన్నీ శుభప్రదమైనవిగా చెప్ప‌వ‌చ్చు. నూతన గృహ ప్రవేశానికి ఉత్తరాయణం మంచి కాలంగా చెప్పబడుతోంది.

రిక్త తిథులు విడిచిపెట్టి మిగిలిన తిథులలో చంద్రుని పూర్ణ, సప్తమి, అష్టమి, దశమి తిథులు శుక్ల పక్షము నందు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశీలతో పాటు శుక్లపక్ష విదియ, తదియ శుభమ‌ని శాస్త్రం చెబుతోంది. ఉత్తరాయణంలో మాఘమాసం, ఫాల్గుణం, వైశాఖ మాసాలు శుభ‌క‌ర‌మైన‌వి. ఇక మిగతా మాసాలందు నూతన గృహ ప్రవేశం పనికి రాదు.

దక్షిణ సింహద్వారం ఉన్న ఇంటికి.. గృహ ప్రవేశం చేయాలంటే పాడ్యమి, షష్టి, ఏకాదశీ తిథులు మంచివి. తూర్పు సింహద్వారం కలిగిన ఇంటి గృహ ప్రవేశానికి పూర్ణ తిధులైన పంచమి, దశమి, పూర్ణిమా తిథులు, పశ్చిమ సింహద్వార గృహానికి విదియ, సప్తమి, ద్వాదశీ తిథులు మంచివని వాస్తు శాస్త్రం చెబుతోంది. గృహ‌ప్ర‌వేశానికి సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభప్రదం. ఇక‌ ఆదివారం, మంగళవారంలో గృహ ప్రవేశం అశుభప్రదమ‌ని చెప్ప‌వ‌చ్చు.

చవితి, నవమి, చతుర్దశి తిథులను విడిచిపెట్టి, పౌర్ణమి, సప్తమి, అష్టమి, దశమి తిథుల్లో గృహప్రవేశం చేయడం ద్వారా ఆ గృహంలో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. ఇంకా.. శుక్ల పక్షము నందు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశీలతో పాటు శుక్లపక్ష విదియ, తదియలు కూడా గృహ ప్రవేశం చేయడానికి మంచి ముహూర్తాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.

గృహ‌ప్ర‌వేశం ఎలా..?
నూత‌న గృహ‌ప్ర‌వేశం ఎలా అనే విష‌యం కూడా ముఖ్య‌మే. ధర్మ సింధు శాస్త్రం ప్రకారం ఆచరించవలసిన పద్ధతి గ‌మ‌నిస్తే... గృహ యజమాని ధర్మపత్నితో సహా మంగళ స్నానాలు చేయాలి. బంధు మిత్రులతో కూడుకొని నూతన గృహమునకు, ముహూర్త సమయాని కంటే కాస్త ముందుగానే చేరుకోవాలి. గృహ ద్వారం వద్ద దూడతో ఉన్న ఆవును పూజించి దానికి ఇష్టమైన ఆహారంను పెట్టాలి.

అష్ట దిక్కుల, భూదేవికి ఊర్ధ్వ పురుషునికి వాస్తు వరుణ దేవతలకు వసంతంతో నింపిన గుమ్మడికాయ బలిహరణం ( పసుపు, సున్నము కలిపి వసంతము పోసిన గుమ్మడికాయ ) ఇవ్వాలి. కలశమున గంగాది తీర్థములను ఆవాహన చేసి పూజించాలి. దీనినే గంగపూజ అంటారు. శుభ ముహూర్తాన దూడతో ఆవును ముందుంచుకొని, గృహదేవతా విగ్రహములను కాని, పటములను కాని చేత పట్టుకొని మంగళ వాద్య ఘోషముల మధ్య యజమాని కుడి కాలు, ధర్మపత్ని ఎడమ కాలు గృహమందు ప్ర‌ధాన గ‌డ‌ప దాటవ‌లెను.

అనంత‌రం పాలు పొంగించి, క్షీరాన్నంను వండి దానితో వాస్తు పురుషుని పూజించి నివేదన చేయవలెను. పాలు పొంగించుటకు చేసిన అగ్ని హోత్రంనకు నెయ్యి, చక్కెర వేసి నమస్కరించవలెను. వాస్తు పూజకు ముందు వినాయ‌క పూజ చేయవలెను. నవగ్రహ పూజ, అష్ట దిక్పాలక పూజ చేయించవలెను. బలిహరణం పెట్టు వరకు నూతన గృహంలో ఏమియు వండ కూడ‌దు.


#గోవుతో_గృహప్రవేశం_ఎందుకు_చేయిస్తారో_తెలుసా?

‘గృహప్రవేశం’  సమయంలో కొత్త ఇంటిలోకి ముందుగా గోమాతను తీసుకువెళ్లి మొత్తం ఇల్లంతా తిప్పుతారు. ఆ తర్వాతే ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు ఇంటిలోకి వెళతారు. ఈ ఆచారం అనాదిగా వస్తుంది.

గోవు సకలదేవతా స్వరూపంగా చెప్పబడింది. గోవుతో పాటే సమస్త దేవతలు వస్తారని శాస్త్రం చెబుతోంది. అందువలన నూతన గృహాల్లోకి గోవును తిప్పటం అనేది శుభసూచకంగా విశ్వసిస్తుంటారు. నూతన గృహంలో గోవు మూత్రం … పేడ వేసినట్లయితే మరింత శుభకరంగా భావిస్తుంటారు. అదే బహుళ అంతస్తుల్లో గృహప్రవేశం చేసినప్పుడు గోవును బహుళ అంతస్తుల్లో తిప్పటం కుదరదు. కాబట్టి ఆ ప్రాంగణంలో ఆవు దూడలను అలంకరించి పూజ చేయాలి. అలాగే గోవు పేడను … మూత్రాన్ని ఇల్లంతా చిలకరించాలి...
Share:

4 comments:

  1. సూర్యుడు కుంభ రాశి లో అన్నారు అంటే మాఘ మాసం కదా మరి మాఘ మాసం మంచిది అన్నారు గృహప్రవశానికి

    ReplyDelete
  2. కార్తీక మాసం మంచిది కదా గృహప్రవేశ కి

    ReplyDelete
  3. Vijaya dasami roju manchi muhortham leda

    ReplyDelete
  4. 15 Nov 2021 gruhapravesha muhurtham bagunda on the names Mallesh & sandhya road face uttharam

    ReplyDelete

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List