శ్రీ పార్వతి సమేత నాగనాథేశ్వర స్వామి కోనలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. ~ దైవదర్శనం

శ్రీ పార్వతి సమేత నాగనాథేశ్వర స్వామి కోనలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.



* శివనామస్మరణతో కిటకిటలాడింన నాగేసు కొండ....
* అత్యంత మహిమాన్వితమైన ఈ ఆలయంలోని శ్రీచక్రం.....
* కొండపైన పేటు (రాతి పలక) క్రింద సొరంగమార్గంలోని ఓ గుహలో
స్వయంభూగా వేలసిన నాగనాదేశ్వర స్వావిు...
.
.
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగేసుకోండలోని స్వయంభూ శైవ క్షేత్రం హర హర నామ స్మరణతో మారుమోగింది. పరమ శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం నాడు కార్తీక పౌర్ణమి కలిసి రావటంతో భక్తులతో శివాలయం కిటకిటలాడింది. శంభో శంకర.. హర హర మహాదేవా.. అంటూ శివ నాస్మరణ చేశారు. తెల్లవారు జాము నుండి భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి రోజంతా ఉపవాసాలతో మహా శివుడిని స్మరించుకున్నారు. నమక చమక పారాయణలతో మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు.
.
.
ఆంద్ర ప్రదేశ్, కడప జిల్లా, ఖాజీపేట మండలానికి 3 కి.మీ. దూరంలో నల్లమల అడవి కోనలో స్వయంభూగా పరమ శివుడు వెలసి వున్నాడు. "నాగనాదేశ్వర కోన" గా ఉన్న ఈ ప్రదేశం పేరు ఆధునిక కాలం లో "నాగేశ్వర కోన" లేదా "నాగేసు కొండ" అని పిలవబడుచున్నది. ప్రతి సంవత్సరం శివరాత్రి, కార్తీకమాసంలో వచ్చే అన్ని సోమవారాల్లోను జిల్లా ప్రజలే కాక చుట్టు ప్రక్కల జిల్లాలలోని నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ మొక్కుబళ్లను తీర్చకుంటారు.
కొండ కోనలు, ఆకట్టుకునే అటవీ అందాల మధ్యన కొలువైన భక్తుల కొంగుబంగారంగా అడిగిన వెంటనే వరాలిచ్చే భగవంతునిగా పిలిచే శ్రీ పార్వతి సమేత నాగేశ్వరస్వామికి భక్తజనం నీరాజనం పట్టారు. పవిత్ర పర్వదినం కార్తీక పౌర్ణమి సందర్భంగా ముక్కంటిని భక్తితో కొలిచారు. అనుక్షణం శివనామస్మరణతో కొనలో సోమవారం పులకరించింది. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం నాగనాదేశ్వర క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. సోమవారం తెల్లవారుఝాము నుంచే వేలాదిమంది భక్తులు నాగేశ్వరస్వామి దర్శనం కోసం నాగేశ్వరకొండకు బారులు తీరారు. స్వామి వారి పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ పార్వతి సమేత నాగేశ్వరస్వామి వారిని దర్శంచుకున్నారు.
.
.
కడప జిల్లా, ఖాజీపేట మండలం నల్లమల అడవి ప్రాతంలో గల నాగేశ్వరుని కోండలో ఉన్న శ్రీ పార్వతి సమేత నాగేశ్వరస్వామి వారి దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనం గా జరిగాయి. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని నాగ నాథేశ్వరస్వామి వారి దర్శంన కోసం భక్తులు తెల్లవారుజూము నుండే క్యూలైన్‌లో వేచి వున్నారు. శ్రీశైలం తరువాత అంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ దేవాలయంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా కార్తీకమాసం 3రోజు స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన స్వయంభూ లింగాకారుడైన శివుని దర్శనం కోసం ఈ దేవాలయానికి భక్తులు తండోపతండాలుగా చేరుకున్నారు.
.
.
హర హర శంభోశంకర అంటూ మెట్ల మార్గాన స్వయంభు శివలింగాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కొందరు మహిళలకు మెట్లకు గంధం, కుంకుమ పోస్తూ మొక్కుబడి తీర్చుకున్నారు. అలాగే కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి బిల్వార్చనతోపాటు మృతాభిషేకాలు, ఫలరసాలు, నారికేళ జలం, పుష్పోదకం, భస్మోదకం, గంధోధకం, అక్షతోదకం వంటి విశేష పుజలను నిర్వహించారు. వీటితోపాటు నమక చమక పారాయణతో అభిషేకాలు అందుకున్న శివుడు భక్తులకు తన దివ్యస్వరూపా దర్శన భాగ్యాన్ని కల్పించాడు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా అలయ ఉత్సవ కమిటీ సభ్యులు, దేవాదయశాఖ సిబ్బంది ప్రత్యేక ఎర్పాట్లు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్‌లను ఎర్పాటు చేసారు. అలాగే భక్తులకు అవసరమైన త్రాగునీరును అందించడంతోపాటు దర్శించుకున్న భక్తులందరికి ప్రసాదాలను ఉచితం అందించారు. గంటల తరబడి స్వామివారి దర్శనం కోసం వేచిన భక్తులు ఎటువంటి ఆటంకాలు ఎదుర్కుకోకుండా స్వామివారిని దర్శంచుకున్నారు.
.
.
ఆలయ విశిష్టత :...
దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ దేవాలయాల్లో కడప జిల్లా, ఖాజీపేట మండలంలోని శ్రీ నాగనాథేశ్వర స్వామి శివలాయం చెప్పుకోదగ్గది. ఈ ఆలయ విశిష్టమైన చరిత్ర, ప్రచారంలో ఉన్న కొన్ని మహిమలను గుర్తుకు తెచ్చు కుంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఆంద్ర ప్రదేశ్, కడప జిల్లా, ఖాజీపేట మండలానికి 3 కి.మీ. దూరంలో నల్లమల అడవి కోనలో స్వయంభూగా పరమ శివుడు శ్రీ నాగ నాథేశ్వర స్వామిగా వెలసినాడు. కొండపైన పేటు (రాతి పలక) క్రింద సొరంగమార్గంలోని ఓ గుహలో ఊద్భవలింగంగా స్వయంభూగా వేలసినాడు. క్రీ.శ. 2వ శతాబ్దం నుంచి శ్రీ నాగనాథేశ్వర స్వామి ఆలయం ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. మహ్మదీయుల దాడిలో నాగేసుకోండలోని నాగ నాదేశ్వర ఆలయం ధ్వంసమైందని తిరిగి ఈ ఆలయం పునరుద్ధరింప బడినట్లు క్షేత్ర చరిత్ర తెలుపుతోంది.
చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు, విజయనగర రాజుల, వెంకటగిరి రాజులు, రేచర్ల రాజులు, వెంకటభూపతిరాజు, మట్టిరాజులు శ్రీ నాగనాథేశ్వర స్వామివారిని దర్శించుకున్నారని చరిత్ర ద్వార తెలుస్తుంది.
.
.
శ్రీ కృష్ణ దేవరాయలు పరిపాలకుల ఉదయగిరి అధీనంలో గండికోట మంత్రిగా వున్న జోపల్లె రామనాయుడు కుమారుడు పెద్ద సంగమనాయుడు శిధిలమైన నాగ నాథేశ్వర కోన ను అభివృద్ధి చేసి శివయ్య దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యం కోసం రాతి పలకలతో సుమారు 1000 మెట్లను నిర్మంచినాడు. స్వామివారికి భూవిుని మాన్యంగా ఇచ్చినట్లు చరిత్ర చేప్పుతున్నది. సంవత్సరం క్రిందట భక్తుల సౌకర్యం కోసం ఒక శివ భక్తుడు కోండలో రోడ్డు మార్గన్ని నిర్మించినాడు.
.
.
పరీక్షిత్తు వంశాన్ని సర్వనాశనం చెయడానికి జనమేజయుడు చేసిన సర్పయాగం లో చాల నాగసర్పలు హోమ గుండంలో పడి చనిపోతాయి. ఆసర్పముల పాపాలు పోవడానికి శుక మహర్షి జనమేజయుడుకి నీవు సర్పయాగ పాప పరిహారార్థం నల్లమల అడవిలోని స్వయంభూగా వేలసిన నాగనాథేశ్వర స్వామికి పూజలు నిర్వహించు అని శుక మహర్షి ఆదేశించి నట్ల పురాణల ద్వారా తెలుస్తుంది. జనమేజయ చక్ర వర్తి ఈ ఆలయాన్ని పరమ శివునికి పూజలు చేసినాడని పురాణ కధనం. మరో గాధ..పురాణ కథల ప్రకారం లంకాధిపతియైన రావణుడు సాక్షాత్తూ బ్రహ్మ మనుమడు. అందు చేత బ్రాహ్మణుడు. శ్రీ రాముడు రావణుడిని సంహరించిన తర్వాత ఒక బ్రాహ్మణుడిని చంపినందుకు బ్రహ్మ హత్యా పాతకం నుండి రాముడిని విముక్తుడు కావడానికి శ్రీ రాముడు నాగేసుకోండలోని నాగనాథేశ్వర స్వామి స్వయంభూ శివలింగాన్ని పూజించుకున్నాడని పురాణలు చుప్పుతున్నాయి...
.
.
నాగేశ్వర స్వామి వారి ఆలయంలోని లింగమూర్తిని స్వయంగా అగస్త్య మహాముని ప్రతి రోజు పూజలు చేసేవారని స్థలపురాణం బట్టి తెలుస్తోంది. పూర్వం ఈ ప్రాంతంలో సప్తఋషులు ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేసుకునేవారని అలా తపస్సు చేసుకుంటూ ఉన్న సమయంలో అగస్త్యమహాముని శివలింగాన్ని ప్రతిరోజూ అభిషేకించి అర్చనలు నిర్వహించే వారని స్థలపురాణం చెబుతోంది.
.
.
ఇక్కడ అగస్త్యముని గుహ కలదు కోనలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహ ఉన్నాది. ఈ గ్రుహలో అగస్త్యముని కొంత కాలం నివసించారని, శిష్యులకు జ్జ్ఞానోపదేశం చేసాడని భక్తులు నమ్ముతారు. నల్లమల అడవిలోని ఈ నాగేసుకోండ లోని గుహ శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలోనికి సొరంగమార్గం గుండ పోయి అగస్త్యముని కొంత మంది శిష్యులతో కలసి శ్రీశైలం మల్లికార్జునస్వామికి పూజలు చేసి తిరిగి ఈ సొరంగమార్గం గుండ నాగేసుకొండ కు చేరుకోనేవారని పురాణలు చేప్పుతున్నాయి. దీనిని శంకరగుహ, మబ్బు దేవళం, రోకళ్ళగుహ అనికూడా అంటారు. ఇక్కడ స్వామి బావి కలదు ఈ బావిలో ఏ కాలంలో నైనా బావి లోని నీటి మట్టం ఒకేలా వుండడం విశేషం. ఇందులోని నీటికి ఔషద గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని, సర్వ పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం.
.
.
మొదట్లో నాగ నాథేశ్వర ఆలయానికి తలుపులు ఉండేవి కావు. ఆ తర్వాత తలుపులు ఏర్పాటు చేసినా అవి ఉండేవి కావు. ఆలయానికి తలుపులు ఎందుకు వుండడం లేదని రుషులు ఆలయానికి దూరం నుండి గమనించడం మొదలు పేట్టినారు రుషులు. ప్రాత:కాలన్నే శివుడు గుడిలో ఓకార శబ్దం చేస్తు, శంఖాన్ని ఉదుతూ శివతాండవం చేస్తు, విబుది వాసనతో, నాగసర్పం బుసలతో శివుడు కోపంతో తాండవం చేస్తు తలుపులను బద్దలు కొట్టుకోని బయటి వచ్చిన శివుడు కనిపించకుండా పోయినాడు తరువాత నాగసర్పం శివలింగాన్ని చుట్టుకొని వుండడం గమనించిన రుషులు ఇది శివుని మహత్యమని ఆ తర్వాత తలుపులు ఏర్పాటు చేయడము మానేశారు. ఇప్పటికి నాగసర్పం ఆలయ ప్రాంగణంలోనే తిరుగుతుంటుందని ఆలయం తెరవడాని వేళ్ళటప్పుడు చేతిలో గంటనాధం చేస్తూ హర హర మహాదేవ శంభోశంకర అంటూ శంఖం ఊదుతూ వెళ్ళినప్పుడు ఆనాగసర్పం ప్రక్కకు పొతుందని ఇక్కడి పూజారులు వివరించారు. శివుడు బద్దలు కొట్టున తలుపులు కొండ క్రింద రెండు కిలోమీటర్ల దూరంలో గల పుల్లూరు చెరువులో కనిపించడం జరిగింది ఇప్పటికి ఆ తలుపుల అనవాళ్ళ కనిపిస్తాయి. దేవాలయం లో శ్రీచక్రం, పద్మావతి అమ్మవారు, నంది విగ్రహాలు ఉంటాయి నిజమైన మూర్తులుగా కనిపిస్తాయి.
.
.
మీ..
ఆర్.బి. వెంకటరెడ్డి
(భారతీయ సనాతన హిందూ ధర్మ సంరక్షణ సమితి)
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List