సంజీవ కొండ, ఉదయగిరి. ~ దైవదర్శనం

సంజీవ కొండ, ఉదయగిరి.


మానవునికి సంపూర్ణ ఆయుషును అందించే ఔషధముల తయారీకి ఉపయోగపడే ఔషధ మొక్కలు ప్రకృతి సిద్ధంగా లభించే నెల్లూరు జిల్లా ఉదయగిరి కొండను సంజీవ కొండ అంటారు.
సూర్యోదయ మొట్టమొదటి కిరణాలు 3079 అడుగుల ఎత్తు ఉన్న ఈ సంజీవ కొండపై పడుట వలన దీనికి ఉదయగిరి అని పేరు. ఈ కారణంగానే సంజీవ కొండకు తూర్పు వైపున వున్న గ్రామానికి ఉదయగిరి అనే పేరు వచ్చింది.
ఈ సంజీవ కొండ నెల్లూరు నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో పడమర వైపు ఉన్నది.
ప్రకృతి సిద్ధమైన కొండ, లోయలలోని పచ్చని చెట్లు రమణీయతను గొలుపుతూ చూడ ముచ్చటగా ఉంటాయి.
కొండపై నుంచి జారే జలపాతం, కొండపై నుంచి ప్రవహించే కాలువలలోని నీరు దాహార్తిని తీర్చడమే కాకుండా మనస్సును ఆహ్లాదపరుస్తాయి.
ఈ సంజీవ కొండపై నుంచి కాలువ ద్వారా ప్రవహించిన నీరు ఉదయగిరి గ్రామ వాసుల దాహార్తిని కూడా తీరుస్తుంది.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List