యమునోత్రి అంటే యమునానది జన్మస్థలము. యమునా నది జన్మించిన ఈ ప్రదేశములో యమునాదేవి ఆలయము ఉంది. ఈ ఆలయం టెహ్రీ గార్వాల్ మహారాజాచే నిర్మించబడినదని కథనం. ప్రస్తుత ఆలయాన్ని జయపూర్ మహారాణి గులారియా 19వశతాబ్ధంలో నిర్మించబడింది. యాత్రికులకు ఆలయ సమీపంలో వసతులు తక్కువ ఉన్నప్పటికి నదీమాతను దర్శించుకుని వెనుదిరుగుతుంటారు. స్నానానికి అనువుగా ఉష్ణగుండం ఉంటుంది. ప్రత్యేంగా స్నానాలకుగదులు కూడా ఉన్నాయి. అయితే అక్కడ ప్రత్యేకతలలో ఒకటిగా యాత్రీకులు ఆలయం పక్కన ఉన్న చిన్న చిన్న ఉష్ణగుండంలో చిన్న బియ్యం మూటలను దారానికి కట్టి లోపల వదలి అన్నం తయారు చేసుకోవడం. పూజలకు సంబంధించి అన్ని వస్తువుల లభిస్తాయి.
https://www.facebook.com/rb.venkatareddy
No comments:
Post a Comment