మహాస్వామి - మహాలక్ష్మమ్మ గారు. ~ దైవదర్శనం

మహాస్వామి - మహాలక్ష్మమ్మ గారు.

అది 1930లో పసుమలైకుప్పంలో (మద్రాసు ఉత్తరాన) పరమాచార్య స్వామి వారు మకాం చేస్తున్న కాలం. మహాస్వామి వారు అప్పుడు వ్యాసపూజ చేస్తున్న కాలం. పసుమలైకుప్పం దగ్గరలో ఒక జలపాతం ఉంది. స్వామివారూ రోజూ అక్కడకు స్నానం చెయ్యడానికి వెళ్ళేవారు. కొంతమంది పండితులతో ఒక చిన్న సదస్సు పెట్టారు. చాలా తీవ్రంగా చర్చలు వాద ప్రతివాదాలు జరుగుతున్నాయి. హఠాత్తుగా పరమాచార్య స్వామివారు అక్కడున్నవారిని ఉద్దేశించి ఒక అసాధారణ ప్రశ్న అడిగారు.

“సన్యాసి యొక్క బంధువులు మరణిస్తే ఆ సన్యాసి స్నానం చెయ్యాలా?”

“లేదు. లేదు. శాస్త్రప్రకారం సన్యాసి యొక్క బంధువులు మరణిస్తే ఆ సన్యాసి
స్నానం చెయ్యవలసిన అవసరం లేదు” అని అక్కడున్న విధ్వాంసులు అన్నారు.

పరమాచార్య స్వామి వారు ఇంకా ఇలా అడిగారు. ”నా అంచనా ప్రకారం తల్లి చనిపోతే మాత్రమే అది ఆవశ్యము కదా?”

“అవును అవును కేవలం తల్లి చనిపోతే మాత్రమే సన్యాసి స్నానం చెయ్యవలసిన అవసరం ఉంది” అని పండితులు చెప్పారు.

ఎందుకు మహాస్వామి వారు హఠాత్తుగా ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నారు అని కలవరపడ్డారు. అయితే కొద్దిసేపట్లోనే ఒక టెలిగ్రామ్ వచ్చింది. పరమాచార్య స్వామి వారి పూర్వాశ్రమ తల్లిగారైన మహాలక్ష్మమ్మ గారు పరమపదించారు అని. ఆ విషయం విని అందరూ నిర్ఘాంతపోయారు. కాని వారు తరువాత జరిగిన విషయం చూసి ఇంకా విస్మయం చెందారు.

పరమాచార్య స్వామి వారు మైల స్నానానికి లేస్తూ మోముపై చిరునవ్వు చదరకుండా అక్కడున్నవారితో “రండి రండి నాకు తెలుసు! పరవాలేదు. జరిగేది జరిగింది” అని అన్నారు.

మహాస్వామి వారు జలపాతం వద్ద స్నానం చేద్దామని అందరినీ పిలిచారు. అక్కడున్న విద్వాంసులు ఎంతటి జ్ఞానులైనా వారి కంట నీరు ఆగలేదు ఈ విషయం విని. కాని సర్వసంగ పరిత్యాగులైన మహాస్వామివారు మహాజ్ఞానులు. బ్రహ్మమును తెలుసుకున్నవారు. కష్టసుఖాలకు అతీతులు. మూడు అవస్థలు దాటి తురీయము నందున్నవారు.

ఎంతటి సన్యాసులు!
ఎంతటి వైరాగ్యం!

ఇటువంటి మాహాత్ముణ్ణి కన్న ఆ మాతృదేవతా స్వరూపురాలు మహాలక్ష్మమ్మ గారు ఎంతటి పుణ్యవంతురాలు.

తల్లి వద్ద ఆడుకోవాల్సిన పదమూడేళ్ళ చిరుప్రాయంలో సన్యాసం స్వీకరించి, ఇంతటి పీఠాన్ని అధిరోహించి, ప్రత్యక్ష గురువు లేకుండా పీఠ భాద్యతలను నిర్వహిస్తూ, సన్యాసాశ్రమ ధర్మాలను తుచ తప్పకుండా పాటిస్తూ, ఎందరి బాధలో తీర్చి, “మైత్రీం భజతా” అని ప్రపంచ శాంతిని కాంక్షించి, “ఈ శతాబ్ధపు నిజమైన సన్యాసి” అని, “నడిచే దైవం” అని కీర్తింపబడిన శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ప్రాతః స్మరణీయులు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List