భక్త కన్నప్ప జన్మస్థలం కడప జిల్లా, రాజం పేట మండలంలోని ఊటుకూరు గ్రామం.
శ్రీకాళహస్తిలోని శివలింగానికి కంటనీరు కారితే తన కన్నులర్పించిన మహా భక్తుడు కన్నప్ప. కన్నప్ప పుట్టిన ఊరు పొత్తపినాడులోని ఉడు మూరు అని శివపురాణం తెలుపుతున్నది. ఈ ఉడుమూరు రాజంపేట మండలంలోని కొం డ్లోపల్లెకు అతి సమీపంలో ఉన్నట్టు మెకంజీ కైఫీయత్తులలోని పోలి, ఊటుకూరు చరిత్రల వల్ల తెలుస్తున్నది. దీంతో అధికారికంగా ప్రకటించక పోయి న భక్త కన్నప్ప జన్మస్థలం రాజం పేట మండలంగా స్థానికులు భావిస్తూ ఈ మండలంలోని ఊటుకూరు గ్రామంలో కన్నప్ప నిర్మించినట్టుగా భావిస్తున్న శివా లయంలో కన్నప్ప విగ్రహాన్ని నెలకొల్పారు.
ఆలయ చరిత్ర...
ద్వాపరయుగంలో అర్జునుడు శివుని గూర్చి తపస్సు చేయ గా పాశుపతాస్త్రం ఇచ్చారు గాని మోక్షం ప్రసాదించలే దు. కలియుగంలో బోయ వాడుగా జన్మించి మోక్షం పొందుతావని శివుడు అర్జునుడికి చెప్పినట్టు ఇతిహాసం పేర్కొంటోంది. ఈ ప్రకారం అర్జునుడు కలియుగంలో ఊడుమూరులోని బోయకుటుంబంలో తిన్నడుగా జన్మించి శివుని అనుగ్రహాన్ని అందుకున్నారన్నది ప్రతీతి. ఉడుమూరులో కన్నప్ప ప్రతిష్ఠించిన లింగమే ఉడుమేశ్వరాల యంగా ప్రసిద్ధి చెందిందంటారు. ఆ శిథిలాలు ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయి. ఈ ఉడుమూరు కొండ్లోపల్లె సమీపంలో ఉండేదని, కన్నప్ప ప్రతిష్ఠించిన శివలింగం కాలగమనంలో సమీపంలోని ఊటుకూరుకు చేరిందంటారు. ఇక్కడి శివాలయం అత్యంత పురాతనమైంది. ఊటుకూరు గ్రామం తాళ్ళపాక అన్నమాచార్యు లవారి అవ్వగారి ఊరు. ఈ ఊరికి 700 సంవత్సరాల కాలం నాటి చరిత్ర మనకు అవగతమవుతుంది. ఏది ఏమైనా కన్నప్ప జన్మస్థలం అధికారికంగా ప్రకటించకపోయినా స్థానికులు కన్నప్ప జన్మస్థలాన్ని రాజంపేట మండలంగానే భావిస్తూ కన్నప్ప స్మారకోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

కన్నప్ప ఇతివృత్తం...
భక్త కన్నప్ప గొప్ప శివ భక్తుడు. పూర్వాశ్రమంలో తిన్నడు అనే బోయవాడు. చరిత్ర ప్రకారం శ్రీకాళహస్తి పరిసర ప్రాంత అడవుల్లో సంచరిస్తూ వేటాడి జీవనం సాగించేవాడు. ఒకనాడు అలా వేటాడుతుండగా అతనికి అడవిలో ఒక చోట శివలింగం కనిపించింది. అప్పటినుంచీ తిన్నడు దానిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ తాను వేటాడి తెచ్చిన మాంసాన్నే నైవేద్యంగా పెడుతుండేవాడు. ఒకసారి శివుడు తిన్నడి భక్తిని పరీక్షించ దలచి తిన్నడు పూజ చేయడానికి వచ్చినపుడు శివలింగంలోని ఒక కంటినుంచి నీరు కార్చడం మొదలు పెట్టాడు. విగ్రహం కంటిలోనుంచి నీరు కారడం భరించలేని తిన్నడు బాణపు మొనతో తన కంటిని తీసి నీరు కారుతున్న కంటికి అమర్చాడు. వెంటనే విగ్రహం రెండో కంటినుంచి కూడా నీరు కారడం ఆరంభమైంది. కాలి బొటనవేలును గుర్తుగా ఉంచి తన రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చాడు. తిన్నడి నిష్కల్మష భక్తికి మెచ్చిన శివుడు అతనికి ముక్తిని ప్రసాదించాడు. అందువల్లనే తిన్నడికి కన్నప్ప అనే పేరు వచ్చింది. తన కన్నును ఈశ్వరునికర్పించినందుకు తిన్నడు కన్నప్ప అయ్యాడు. కన్నప్పనాయనారు అయ్యాడు. నేత్రేశనాయనారు అనేది సంస్కృతనామం.
No comments:
Post a Comment