ద్వితీయ భాగం –డుండివినాయక లీల.. ‘’ప్రణవాత్మ రూప సాక్షాత్కారిణీం,పాప హారిణీం—మోక్ష ప్రదాయినీం ,కర్మ నాశనీం ,విశ్వ మోహినీం
వారాణసీం ,కర్మ భూమిం,మనో వాచామ గోచరాం-ప్రణమామి సదా భక్త్యా –కాశీ వాస ఫలాప్తయే’’
‘’ఆది పూజ్య డుంఢిరాజం –అన్న పూర్ణాం చ మాతరం –విశ్వనాధం విశాలాక్షీ –సమేతం ప్రణమామ్యహం
నమామి భైరవం దేవం –దండ పాణిం తు మాధవం –గంగాం మలాప గంగా దివ్యాం,భవానీం మణి కర్ణికాం
త్రయ త్రింశత్కోటి దేవ పూజితం లింగ రూపిణం-విశ్వేశ్వరం శివం వందే ,గ్రంధ లేఖన సిద్ధయే
పద్దెనిమిదిపురాణాలలో పెద్దది స్కాంద పురాణం .యాభై ఖండాల తొ ఒక లక్ష శ్లోకాల తొ ఉన్న గ్రంధం . స్కందుడు చెప్పిన పురాణం కనుక స్కాంద పురాణం అయింది .కాశీ క్షేత్రాన్ని గురించి చెప్పిన భాగ మంతా ‘’కాశీ ఖండం ‘’అనే పేరు తొ ఉంది .కాశి అంటే ప్రకాశ సంబంధ మైన స్వయం ప్రకాశ మాన మైంది .నమ్మి తనను సేవించే వారికి ప్రకాశింప జేసేది అని భావం .దీనికే వారణాసి అని కూడా పేరుంది .గంగా నదికి ఉన్న అనేక ఘాట్ లలో వరుణా ఘాట్ నుండి అసీ ఘాట్ వరకు ఉనన్న అందులో అయిదు క్రోసులు వైశాల్యం ఉన్న ప్రాంతం మాత్రమె చాలా పూర్తీ మహిమ కలిగింది .అందుకే వారణాసి అనే పేరు సార్ధక మయింది .
దివోదాస చక్ర వర్తి ధర్మ పత్ని లీలా వతి తొ అత్యంత ధర్మ శక్తి తొ ,సమస్త దేవతలను పాదా క్రాన్తులను చేసుకొని ప్రపంచమంతా ఏక చ్చత్రాది పత్యం గా పాలిస్తున్నాడు .తనకు అత్యంత భక్తులైన ఆ దంపతులకు సాయుజ్యాన్ని, దేవతా గణానికి స్వేచ్చను ప్రసాదించే ఆలోచన తొ విశ్వనాధుడు డుమ్ది వినాయకుని సృష్టించి కాశి లో ప్రవేశ పెట్టాడు
‘’ఆదాయ శాసనం మూర్ది –గణాధీశోధ ధూర్జటీ –ప్రతస్థే త్వరితః కాశీం –స్తితిజ్ఞ్సః స్తితి హేతవే
మందరాచల శిఖరం పై ధ్యాన మగ్నుడైన సదాశివుణి సమస్త దేవతలు సేవిస్తున్నారు .వారితో పరమ శివుడు ‘’భూలోకం లో కైలాసం లాంటి నా నివాసం ఒకటి ఉంది .ఎవరి చేతా ప్రతిష్టింప బడ కుండా నా అంతట నేనే పరబ్రహ్మ స్వరూపమైన లింగరూపం గా అక్కడ వేలిశాను .ఆ లింగం లో శివ శక్తి జ్యొథిహ్ ప్రకాశరూపం లో ప్రక్షిప్త మై ఉంది .అత్యంత శక్తి వంత మైనజ్యోతిర్లింగం ఇది .దీనికి అయిదు క్రోసుల పరిసర ప్రాంతం అంతా పరమ పవిత్ర మైనది గా నేను వరం ఇస్తున్నాను .పాపపు చీకటిని పోగొట్టి జ్ఞానజ్యోతిని ఇచ్చి మోక్షమిచ్చే లింగం ఇది .సగుణ రూప సాకార పూజ కంటే నిర్గుణ రూప నిరాకార లింగ పూజే శ్రేష్టం .,నాకు ఇష్టం కూడా .సర్వం లింగమయం .అని అర్ధం చేసు కోవాలి .
‘’దివోదాస చక్ర వర్తి భక్తీ పాశం తొ భాగ వంతుడిని కట్టి పడేసి నవగ్రహ ,దిక్పాలశక్తిని ,తపశ్శక్తిని లొంగ దీసుకొని సర్వం తానే అయి వెలిగి పోతున్నాడు .కాశీ లో అందరు విశ్వనాదుడే స్వయం గా కాశీలో ఉండి అన్నీ చక్క బరచ కూడదా అని ఆలోచిస్తున్నారు ‘’అని చెప్పి తన దివ్య శక్తి తొ వినాయక సృష్టి చేసి ఆయన తొ ‘’నా బహిప్రాణం అయిన కాశీ చేరు అక్కడి పరిస్తితులను చక్క బెట్టు .’’అనగానే ఆయన శివాజ్న అంటూ కాశీకి వెళ్లి పోయాడు .
అద్భుత మైన కాంతి పుంజం తొ ఒంటి నిండా విభూతి రేఖలు ,సిందూరం రంగు పట్టు బట్ట ,ఎర్రటి శాలువా ,లావు శరీరం తొ పొట్టి వాడైనా గట్టి వాడే నని పించాడు వినాయకుడు తన వాక్కు నిజం అవుతుందని చెప్పుతూ జనాన్ని ఆకర్షించాడు .రాజ మర్యాదలు చేస్తున్నారు .కోరికలు తీర్చుకొంటున్నారు .జరిగిందీ జరుగుతున్నది జరుగ బోఏదీ అన్నీ ఖచ్చిథం గా చెప్పి అందరి మనసుల్ని ఆకర్షిస్తున్నాడు .మనుషులకు ఎలాంటి కలలోస్తాయో చెప్పటం, వారికొచ్చిన కల విశేషాలనను తెలియ జేయటం తొ అందరి ద్రుష్టి లోను పడ్డాడు రాజాస్తానికి కూడా ఈయమ్న మహిమలు చేరాయి .రాణి కోరిక పై రాజు దివోదాసు ఆయన్ను ఊరేగింపు గా ఆస్థానానికి గౌరవం గా రప్పిస్తాడు .వారి ఆతిధ్యాన్ని పొంది నాలుగు వేదాల, సకల శాస్త్రా పురాణాల విషయాలన్నీ వారికి బోధించి మెప్పు పొందాడు
ఒక ఏకాంత ప్రదేశం లో డుమ్దితొ చక్ర వర్తి ‘’మాకు ఈ ప్రజా పాలన తప్ప ఇంకా ఏమీ పని లేదా .ఏదైనా ఉంటె ఆజ్ఞా పిస్తే చేస్తాను ‘’అన్నాడు డుమ్ది ‘’మీరు సమయానికి తగ్గ మాటే అన్నారు .మీ లాగా ఇంతకు ముందేవరు ధర్మ బద్ధం గా న్యాయ బద్ధం గా ,ప్రజాహితం గా పరిపాలన చేయలేదు .భవిష్యత్తు లో కూడా చేయ బోరు అన్ని శక్తులను లోబరచుకొని అన్నీ మీరే అయి పాలించారు .వచ్చే రోజులు మంచివి కావు .మీరు కొత్త దృష్టి తొ జీవించాలి .నేటికి పద్దెనిమిదో రోజు నమీ జీవితానికి ఒక సుముహూర్తం వస్తోంది .ఒక తేజో రాశి బ్రాహ్మణోత్తముడు మీ దర్శనం కోరుతాడు .ఆయన చెప్పి నట్లు నడుచు కొండి .మీ జన్మ చరితార్ధ మయ్యే రోజు ఆ రోజే .అని చెప్పి డుమ్ది తన ఆశ్రమానికి వెళ్లి పోయాడు.
No comments:
Post a Comment