కార్తీక మాసంలో శివునికి అభిషేకం .. ఫలితాలు. ~ దైవదర్శనం

కార్తీక మాసంలో శివునికి అభిషేకం .. ఫలితాలు.

కార్తీకమాసంలో మీరు చెయ్యవలసిన, చెయ్యకూడని పనులు..
కార్తీకమాసం ఎంత పవిత్రమైనదో అందరికి తెలుసు. కార్తీక మాసం మొదలవ్వగానే అందరూ తెల్లవారుజామునే లేవడం, పుజలు చేయడం, తులసి మొక్కను పూజించడం విదిగా చేస్తారు. కార్తిక మాసం ఆధ్యాత్మికంగా దివ్యమైనది. ఈ మాసం స్నానానికి విశిష్టమైనది. ఇది దామోదర మాసం. కనుక ‘కార్తిక దామోదర’ అనే నామంతో స్మరణ చేయాలి. సూర్యోదయానికి ముందుగా ‘ఆకాశదీపం’ పెట్టే సంప్రదాయం ఉంది. హృదయాకాశంలో వెలిగే జ్యోతికి ప్రతీకగా ఈ ఆకాశదీపం ద్యోతకమవుతుంది. దీనిని దేవాలయంలోనే కాక ఇంటిలోనూ వెలిగించవచ్చు. ఈ మాసం దీపారాధనకి విశిష్టమైనది.
పరమ శివుడు అభిషేక ప్రియుడు. కార్తీక మాసం లో ఒక్కసారైనా పరమశివునికి నమక చమక సహిత ఏకాదశ రుద్రాభిషేకం శివాలయంలో చేయించాలని పెద్దల ఉవాచ.
శివాభిషేక ఫలములు :....
గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును.
చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ధి కలుగును.
మెత్తని చక్కెరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగును.
పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.

అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది(మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన.

ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
నవరత్నోదకముచే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.
ఈమాసంలో కొన్ని పనులు చేయకూడదని పెద్దలు, పండితులు చెబుతున్నారు. అవి ఏమిటో తెలుసుకుందాం…
తామసం కలిగించే ఉల్లి తినకూడదు.
వెల్లుల్లి తినకూడదు.
మద్యం, మాంసం జోలికి పోకూడదు.
ఎవ్వరికి ద్రోహం చెయ్యరాదు.
పాపపు ఆలోచనలు చేయకూడదు.
దైవ దూషణ చేయకూడదు.
దీపారాదనకు తప్ప నువ్వులనూనె ఇంక దేనికి ఉపయోగించకూడదు.
మినుములు తినకూడదు.
నలుగు పెట్టుకుని స్నానం చేయకూడదు.
కార్తీక వ్రతం పాటించేవారు, ఆ వ్రతం చేయనివారి చేతి వంట తినకూడదు.
కార్తీక మాసంలో చెయ్యవలసిన పనులు:...
ఏక భక్తం (ఒంటిపూట భోజనం) ఈ మాసంలో చేయాలి.
ప్రతిరోజూ ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్లి శివదర్శనం చేయడం శ్రేష్ఠం.
శివాలయంలో, విష్ణ్వాలయంలో దీపాన్ని వెలిగించడం మంచిది. ఇంట్లో కూకా ప్రతిరోజూ సంధ్యాదీపం వెలిగించాలి.
కార్తికమాసమంతా కార్తిక పురాణం రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభకరం.
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive