మహిమాన్వితుడు.. శ్రీరామలింగేశ్వరుడు.. ~ దైవదర్శనం

మహిమాన్వితుడు.. శ్రీరామలింగేశ్వరుడు..


* శ్రీరాముడు నడయాడిన ఏకశిలా పర్వతం...
* పాము ఆకారంలో మెలితిరిగి ఆలయం...
.
.
భక్తుల పాలిట ఆరాద్యదైవంగా శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి దేవస్థానం పేరేన్నికగన్నది. పచ్చటి పైర్లమద్య సన్ననిగాలులు వీస్తుండే ఈ ప్రదేశం ఎల్లప్పుడూ ఆహ్లాదంగా ఉండి వచ్చిన వారికి భక్తితో పాటు ప్రశాంత వాతవరణాన్ని కల్పించి వారి కోరికలను తీర్చుతూ శోభాయమానంగా వీరాజిల్లుతున్న ప్రదేశం బండవెల్కిచర్ల గ్రామపంచాయతీ, కుల్కచర్ల మండల పరిదిలోని శ్రీ పాంబండ రామలింగేశ్వర దేవస్థానం.
.
.
సూమారు 700ఏళ్ళ క్రితపు చరిత్ర కలిగిన ఆలయంగా పేరున్న రామలింగేశ్వర ఆలయం స్వయంగా ఆ శ్రీరాముడి చేత్తో స్థాపించబడిన లింగరూపశివుడిదిగా చరిత్రలో నిలిచింది. వేసవికాలంలోను రహాదారికి ఇరుపక్కల గల చెట్లతో చల్లనిగాలులతో హోయలోలకుతున్న మాదిరిగల రహాదారితో మండలకేంద్రం నుండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో బండరాయిపై నిర్మితమై ఉంటుంది.
.
.
దక్షిణాసియాలోనే రెండవ అతిపెద్ద ఏకశీలా పర్వతంగా పాంబండకు పేరు. ఏక శిలాపర్వతం పాము ఆకారం ఉండటం తల భాగంలో గుడి నిర్మితమౌవడంతో పాంబండగా పేరుగాంచింది. సంవత్సరంలో రెండు పర్యాయాలు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. స్వామివారిని దర్శించుకోవడానికి కుల్కచర్ల మండల పరిదిలోని ప్రజలేకాకుండా జిల్లావ్యాప్తంగా భక్తులు రావడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చె సాంప్రదాయ భక్తులు సైతం పెద్ద ఎత్తున వస్తుంటారు.
.
.
పాంబండ దేవాలయానికి ఘనమైన చరిత్ర ఉంది. సూమారు కిలోమీటరు విస్తీర్ణంలో వెలసిన ఏకశిల పాము ఆకారంలో మెలితిరిగి ఉంటుంది. ఈ పాము-బండనే క్రమంగా పాంబండగా పిలువబడుతోంది. ఈ ఆలయానికి సంబంధించి స్థానికంగా ఒక కథ ప్రచారంలో ఉంది. త్రేతాయుగంలో రావణ సంహారం తరువాత బ్రహ్మ హత్యాపాపం నుంచి విముక్తి కోసం కోటి లింగాలను స్థాపించాలని శ్రీరాముడికి మహర్షులు సూచిస్తారు. అందులో భాగంగానే పాంబండపైన శ్రీరాముడు స్వయంగా లింగాన్ని స్థాపించి పూజించాడని అంటారు. అందుకే ఇక్కడ శివుడిని రామలింగేశ్వరుడని పిలుస్తారు. ఆలయం పక్కనే రామలక్ష్మణుల దేవాలయం ఉంది. మొదట్లో పాంబండ ఒక పెద్ద ఏకశిల. కానీ కాలక్రమంలో అది రెండుగా చీలిపోయింది. ఒక పెద్ద పాము బండ మధ్యలో నుంచి వెళ్లడంతో అది చీలిపోయిందని చెప్పుకుంటారు. ఈ బండ వెనుక భాగంలో పుట్టు లింగం ఉంది. ఇది ప్రతీ సంవత్సరం కొద్దికొద్దిగా పెరుగుతుందని భక్తుల నమ్మకం. ఆలయం పక్కనే భ్రమరాంబదేవీ ఆలయం ఉంటుంది. దానికి ముందుభాగంలో ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. ఈ బండకు వెనుక ఉన్న చర్ల అనే ఊరు క్రమంగా బండవెనుక చర్లగా పిలువబడేదని, క్రమంగా అది బండవెల్కిచర్లగా రూపాంతరం చెందిందని తెలుస్తోంది. ఈ ఆలయం సమీపంలో ఇటీవల కొత్తగా కల్యాణ మండపాన్ని నిర్మించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, శకటోత్సవం, రథోత్సవం, అగ్నిగుండాలు, జాతర నిర్వహిస్తారు.
.
.
ఆలయ చరిత్ర:...
త్రెతాయుగంలో రావణసంహారం అనంతరం తిరిగివస్తున్న తరుణంలో బ్రహ్మణ హాత్య పాపంగా బావించి పాపవిముక్తిగాను కోటి లింగాలను ప్రతిష్ఠంపజేయాలని మహార్శులు సూచించడంతో అదేతలంపుతో ముందుకుసాగుతున్న నేపథ్యంలో కుల్కచర్ల మండల పరిదిలోని పాంబండపై స్వయంగా శ్రీరాముడే లింగాన్ని స్థాపించి పూజలు నిర్వహించాడు.
.
.
ఈ ఆలయం ప్రక్కనే రామలక్షణుల ఆయలం, ముందు భాగంలో ఆంజనేయస్వామి విగ్రహాం ఉన్నాయి. పాంబండ దేవాళయం సూమారు 5కిలోమీటర్ల మేర బండరాయితో వ్యాపించే ఉండింది, కాలక్రమేణా రెండుగా చీలి పోయింది ఒక పెద్ద పాము బండ మద్యలో నుంచి వెళ్ళడంతో అది చీలిపోయిందని భక్తులు పేర్కోంటారు అది ఇక్కడ ప్రజల విశ్వాసం కూడ.
.
.
గుండం(కోనేరు) విశిష్టత – ప్రాముఖ్యం:...
పాంబండపై ఉన్న గుండంలో నీటికి చాలా విశిష్ఠత ఉందని భక్తులు విశ్వశిస్తారు. అంతపెద్ద బండ మధ్యలో వెలసిన ఈ కోనేరులో ఎల్లప్పుడూ నీరుంటుంది. శ్రీరాముడు లింగాన్ని స్థాపించిన సమయంలో పూజ చేయడానికి పుణ్య జలాల కోసం శ్రీరాముడు బాణాన్ని సందించి బండ మధ్యలో కోనేరును సృష్టించాడనీ, ఆ నీటితోనే అభిషేకం చేశాడని భక్తులు పేర్కొంటారు. అందుకే ఈ గుండం ఎప్పుడూ ఎండిపోదు. అన్ని కాలాల్లో స్వచ్ఛమైన నీరు ఉంటుంది. ఈ గుండంలో స్నానం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని, పొలాల్లో, పశువులపై, ఇళ్లపై ఈ నీటిని చల్లితే ఎలాంటి అరిష్టాలైనా తొలగిపోతాయని ప్రజల నమ్మకం. ఇక్కడికి వచ్చిన భక్తులు గుండంలో నీటిని తమతో తీసుకుపోయి పొలాల్లో చల్లుతారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉగాదికి రెండు రోజుల ముందు పాంబండపై వీరశైవులు అగ్నిగుండాలు తొక్కే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఎర్రటి నిప్పుపైన నడుస్తూ అగ్నిగుండాలు తొక్కడం ఇక్కడ ప్రత్యేకత.
.
.
ఈ గుండంలో స్నానం చేస్తే దీర్ఘకాలిక వ్యాదులు నయం అవుతాయని పోలాల్లో, పశువులపై, ఇళ్ళపై ఈ నీటిని చల్లడం వల్ల ఎలాంటి అరిష్ఠాలైనా తోలగిపోతాయని ప్రజల నమ్మకం.
.
.
సంవత్సరానికి రెండు పర్యాయాలు జాతర:...
శ్రీపాంబండ రామలింగేశ్వర ఉత్సవాలు సంవత్సరంలో రెండుమార్లు జరుగుతాయి ఒకటి వారం రోజుల పాటు నూతన తెలుగుసంవత్సరాది ఉగాదికి వారం రోజుల ముందునుండి ఉత్సవాలు జరుగుతాయి, ఇందులో భాగంగా రథోత్సవం, బండ్ల ప్రదక్షిణ, అగ్గిగుండం ప్రదానంగా ఉత్సవాలు జరుగుతాయి.
.
.
ప్రతిరోజు అన్నదానం, బజనలు నిర్వహిస్తూ అత్యంత భక్తిశ్రద్దలతో ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది , అదేవిదంగా అత్యంత భక్తి శ్రద్దలతో, నియమాలతో ఉండే శ్రావణమాస చివరి అమావాస్యను పురస్కరించుకుని చిన్న జాతర (ఉత్సవాలు) రెండు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది.
శ్రీపాంబండ రామలింగేశ్వర దేవస్థానికి భక్తులు రావడానికి సైతం వాహాన సౌకర్యాలు గలవు. పరిగి నుండి మహాభూబ్ నగర్ వెల్తుండగా కుల్కచర్ల ప్రదానచౌరస్థాలో నుండి 2కిలో మీటర్ల దూరంలో గల ఆలయానికి వెళ్ళవచ్చు. తాండురు, కోస్గి నుండి వచ్చు భక్తులు దాదాపూర్ మీదుగా రావచ్చును.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List