ప్రసిద్ధ మంత్రాలయ క్షేత్రం లో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి మహా మహిమాన్వితుని గా సుప్రసిద్ధుడు .ఇక్కడ స్వామి ప్రతిష్ట జరగటానికి ఒక ప్రత్యెక కధ ఉంది .మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి కృత యుగం లో భక్త ప్రహ్లాదుని అవతారం .ద్వాపరం లో బాహ్లికునిగా కలియుగం లో వ్యాస రాయలుగా ఆ తర్వాత్ రాఘవేంద్ర స్వామిగా అవతారం ఎత్తారు .ద్వాపర యుగం లో రాజసూయ అశ్వాన్ని సంరక్షిస్తూ వెళ్ళిన అర్జునుని అనుసాల్వుడనే రాజు ఎదిరించాడు అతడు ఇప్పుడు మంత్రాలయం లో బృందావనం ఉన్న చోటులో ఉండి అర్జునితో పోరాడాడు .ఎంతకీ అనుసాల్వుని జయించలేక పోయాడు .ఇక్కడ ఏదో స్థల మహాత్మ్యం ఉందని గ్రహించాడు కిరీటి .ఆ స్థలం నుంచి అనుసాల్వుడిని బయటికి పంపి యుద్ధం చేసి జయించాడు అర్జునుడు .అంత మహిమాన్విత మైన ప్రదేశం బృందావనం .అందుకే శ్రీ రాఘ వేంద్ర స్వామి ఇక్కడ బృందా వనాన్ని నిర్మించాలని కోరుకొన్నారు .బృందావనం అంటే శ్రీ పూజ్య రాఘవేంద్ర స్వామి సమాధి పొందిన దివ్య స్థలం .
తుంగ భద్రా నదీ తీరం లో శ్రీ రాముని పాద ధూళి తో పవిత్ర మైన ఒక నల్ల రాతిని తెచ్చి ఇక్కడ బృందావనాన్ని నిర్మించాలని స్వామి శిష్యులను ఆదేశించారు .ఆ నల్ల రాయి మూల రాముని చిహ్నం గా భావించారాయన .ఇక్కడున్న మంచాలమ్మ దేవత ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించి ఆమె అనుగ్రహాన్ని పొంది బృందావన నిర్మాణానికి పూనుకొన్నారు .1671లో శ్రీ రాఘవేంద్ర స్వామి మంచాల గ్రామంలో బృందవనం లో అనుకొన్న సమయానికి సజీవం గా సమాధి చెందుతారని వేలాది భక్త జనం అక్కడికి చేరారు .స్వామి మూల రాముడిని పూజించి భక్తులకు అనుగ్రహ భాషణం చేసి ,భైరవి రాగం లో వీణ పై కీర్తన ను పరవశం గా పాడుతూ జపమాల త్రిప్పుతూ అక్కడికి చేరుకొన్నారు .అకస్మాత్తుగా వారి జపమాల చేతిలో తిరగటం ఆగిపోయింది . అదే వారి సమాధికి సరి అయిన పుణ్య ప్రదేశం అని నిర్ధారించి ఒక రాగి పెట్టెలో పన్నెండు వందల సామగ్రామాలను ఉంచి ,ఆ గోతిలో స్వామి వారు పద్మాసనస్తులై కూర్చో గానే ప్రక్కన పెట్టి నెత్తిన నల్ల రాయి పెట్టి మూసేసి మట్టితో కప్పేశారు .అలా శ్రీ రాఘవేంద్ర స్వాముల జీవితం సమాప్తి చెందింది . అదే ఇప్పుడు మనం చూస్తున్న బృందా వనం .
శ్రీరాముడు పవిత్రం చేసిన నల్ల రాతి తో బృందావనాన్ని నిర్మించాలని శ్రీ రాఘవెంద్రుల సంకల్పం నేర వేరింది . ఆ రాతి లో ఒక భాగం తో ,పూర్వ జన్మ లో వ్యాస రాయలైన తనకు ఇష్టదైవం అయిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం చేక్కించాలని ఆదేశించారు .అలానే వారి ఆజ్న శిరసా వహించి హనుమ విగ్రహాన్ని అదే పవిత్ర రాతి భాగం తో చెక్కించారు . శ్రీ హనుమదాలయం మూల బృందావనానికి ఎదురు గా ఉంటుంది .ఇక్కడే త్రవ్వకాలలో లభించిన శివలింగాన్ని ప్రతిష్ట చేశారు .స్వామి పూర్వజన్మలో ప్రహ్లాదుడు అని చెప్పుకొన్నాం కదా .ప్రహ్లాదుడు మహాశివ పూజాదురంధరుడు అని ఇలా చేశారిక్కడ .వ్యాస రాయలవారు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు .అందుకే ఇక్కడ ఆ స్వామి దేవాలయం కూడా నిర్మించారు .
మంత్రాలయ శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం అర్ధ శిలతోచెక్కిన ఏడు అడుగుల మూర్తి .స్వామి కుడి చేయి అభయ ముద్రతో ఉంటుంది .. ఎడమ చేయి ఎడమ మోకాలు పై ఆనించి ఉన్నట్లుండి చేతిలో సౌగంధిక పుష్పం తో అలరారు తుంది .స్వామి సిగ వెంట్రుకలు వెనుకకు ముడి వేసి ఉంటాయి .ఆంజనేయ స్వామి తోక వెనకకు శిరస్సు పైన చాలా ఎత్తుగా మూడొంతులు అర్ధ గోళా కారం గా ఉంటుంది చివరి భాగం లోపలికిఉండి చివర చిన్న గంట కట్ట బడి ఉంటుంది .పాదాలకు నూపురాలు, చీల మండలకు తోడాలు ఉంటాయి .మణి కట్టులకు కంకణాలు, భుజాలకు కేయూరాలు ఉంటాయి . ,మేడలో సువర్నాభరణం వక్షస్థలాన సుగంధ మాల ఉంటాయి .చెవులకు కుండలాలు శోభనిస్తు కని పిస్తాయి .స్వామి ప్రకాశ వంత మైన విశాల నేత్రాలు భక్తులపై అపార కరుణా కటాక్షాలను ప్రసరింప జేస్తున్నట్లు గోచరిస్తాయి ..మంత్రాలయ అభయాంజనేయ స్వామి భక్త సులభునిగా విఖ్యాతుడు .
No comments:
Post a Comment