శవేతార్క గణపతి. ~ దైవదర్శనం

శవేతార్క గణపతి.

శ్వేతార్కంలో 'శ్వేతం' అంటే తెలుపు వర్ణం, 'అర్క' అంటే సూర్యుడు. శ్వేతార్క గణపతి అంటే *తెల్ల జిల్లేడు గణపతి.* శ్వేతార్క మూలంలో వినాయకుడు నివశిస్తాడని ప్రతీతి. దీన్ని మనం పొందగలిగి, గృహంలో ప్రతిష్టించుకోగలిగితే శుభప్రదం. శ్వేతార్క గణపతిని సాక్షాత్తూ గణపతిగా భావించి పూజలు చేస్తారో వారికి జ్ఞాన సంపద సురక్ష సుఖశాంతులు లభిస్తాయి. బాగా పాతబడిన తెల్లజిల్లేడు మొదళ్ళు కొన్ని గణపతి రూపం ధరిస్తాయని, అటువంటివి బహు అరుదు అని చెప్పవచ్చు.

జాతకచక్రంలో సూర్యగ్రహ దోషాలు ఉన్నవారు, జాతకచక్రంలో సూర్యుడు నీచలో ఉన్నవారు ఇంటికి నరదృష్టి ఉన్నవారు, వీధిపోటు ఉన్నవారు, సర్వకార్య సిద్ధి కొరకు శ్వేతార్క గణపతిని గృహంలో ఉంచుకుని పూజిస్తే చాలా మంచిది.కానీ ప్రతిష్టించుకునేందుకు సరైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. పండితుల్ని, పురోహితుల్ని సంప్రదించి, వారి సలహా మేరకు ముహూర్తం పెట్టించుకోవాలి.

తెల్లజిల్లేడు చెట్టు 45 సంవత్సరాలు దాటిన తర్వాత సహజంగానే గణపతి రూపం వస్తుంది. ఆదివారం *అమావాస్య, పుష్యమి నక్షత్రం* రోజున వేరును స్వీకరించాలి.

తెల్ల జిల్లేడును *శ్వేతార్కం* అంటారు. వృక్షజాతిలో ఈ తెల్ల జిల్లేడు విశిష్టమైంది. ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ మొక్కలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళలో పడితే చూపు పోతుందని భయపడతారు. కానీ గమ్మత్తేమిటంటే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారుచేస్తున్నారు. జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి. వంగపూవు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి, తెల్ల పూల జిల్లేడు మరొకటి. ఇది హేరంబ గణపతికి ప్రతీక. ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు, విఘ్నాదిపతుల దయ మనమీద ప్రసరిస్తుందట.శ్వేతార్క మూలాన్ని వెలికి తీసి, మట్టిని కడిగివేసి, నీళ్లలో నానబెట్టి జాగ్రత్తగా పరి శీలించినట్టయితే ఆ వేళ్ల మీద గణపతి ఆకృతి కనిపిస్తుందని చెబుతారు.

తెల్ల జిల్లేడు వేళ్ళ మీద గణపతి నివసిస్తాడు. ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుని పోలి ఉంటాయి. అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి, తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు.

ఇళ్ళలో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే. నిజానికి శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలీదని శాస్త్రం చెబుతోంది.

శ్వేతార్క మూలానికి వశీకరణశక్తి ఉంటుందిట, ఏదైనా శుభముహూర్తాన శుచియైన తర్వాత ఆవునెయ్యి, గోరోజనం సిద్ధంగా ఉంచుకుని, ఈ ఆవు నెయ్యి గోరోజనంలో శ్వేతార్క మూలాన్ని గంథంలాగా అరగదీసి ఇష్టదైవాన్ని మనసులో ప్రార్ధిస్తూ నుదుటి మీద తిలకం వలె ధరిస్తే ఆ తిలకానికి ఉన్న వశీకరణ శక్తి స్వయంగా వస్తుంది.

శ్వేతార్క గణపతి గూర్చి *నారదాది పురాణ గ్రంథాలలో* తెల్లజిల్లేడు వృక్షంలో ప్రేత్యేకించి మూలములో గణపతి ఆకృతి తయారు కాగలదని చెప్పబడి ఉంది.🌹
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List