శ్రీరంగం – ఆలయాల ద్వీపం. ~ దైవదర్శనం

శ్రీరంగం – ఆలయాల ద్వీపం.



దక్షిణ భారతంలోని తమిళనాడు రాస్త్రంలో (త్రిచీ గా పిలువబడే) తిరుచిరాపల్లి లోని అందమైన, ముగ్ధ పరచే ద్వీప నగరం శ్రీరంగం. ప్రాచీనకాలంలో శ్రీరంగాన్ని వేల్లితిరు ముతగ్రామం అని పిలిచే వారు. తమిళ భాష లో ఈ నగరాని తిరువరంగం అనేవారు. కావేరి – కొల్లిదం (కావేరి ఉపనది) నదుల మధ్య శ్రీరంగం వుంది. ప్రసిద్ధ శివ, విష్ణ్వాలయాలు వుండడం వల్ల ఇది హిందువులకు ప్రధాన పర్యాటక స్థానం. నిజానికి శ్రీరంగంలో విష్ణ్వారాధకులైన శ్రీవైష్ణవుల జనాభా ఎక్కువ.
ఇక్కడి ప్రసిద్ధ దేవాలయాల్లో శ్రీ రంగనాధ స్వామి దేవాలయం ఒకటి. ప్రతి ఏటా విష్ణువు అనుగ్రహం కోసం అనేక మంది హిందూ భక్తులు ఇక్కడికి వస్తారు. ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద హిందూ దేవాలయం గా ఇది ప్రసిద్ది పొందింది. దీన్ని 631000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 4 కిలొమీటర్లు లేక 10,710 అడుగుల చుట్టు కొలతతో నిర్మించారు.
దేవతల నివాసం
విష్ణు భగవానుని ఎనిమిది దేవాలయాల్లో మొదటి ఆలయం కలిగి వుండడం శ్రీరంగం ప్రత్యేకత. హిందూ పురాణాల ప్రకారం ఇవన్నీ స్వయంభూ క్షేత్రాలే. విష్ణు భగవానుని 108 దివ్యక్షేత్రాలలో ఇదే మొదటిదిగా భావిస్తారు. ఈ విష్ణ్వాలయం చాలా పెద్దది – 156 ఎకరాల విస్తీర్ణం లో దీన్ని నిర్మించారు. ఈ నిర్మాణం వున్న ప్రదేశం కూడా కావేరి కోలేరూన్ నదుల మధ్య వున్న ద్వీప ప్రాంతంలో వుంది. ఈ గుడికి ఏడు ప్రాంగణాలు వుంటాయి – ప్రాకారాలు గా స్థానికంగా పిలిచే వీటి గుండా భక్తులు నడుచుకుంటూ లోపలి వెళ్తారు. ఈ ప్రాకారాలు కూడా ప్రధాన ఆలయం చుట్టూ వృత్తాకారంలో నిర్మించిన దట్టమైన పెద్ద గోడలు గా వుంటాయి. ఈ ప్రాకారాల్లో 21 పెద్ద శిఖరాలు కూడా వున్నాయి. ఈ ప్రాకారాలతో వున్న ఈ గుడి నిర్మాణ పరంగా ఒక అధ్బుతమే.
నిజమైన దేవాలయాల పట్టణం
విష్ణ్వాలయమే కాకుండా శ్రీరంగం లో మరో మూడు ప్రముఖ దేవాలయాలు వున్నాయి. వీటిని కూడా కావేరి నది ఒడ్డున నిర్మించారు. (శ్రీరంగపట్నం లోని) ఆది రంగ దేవాలయం, (శివనసముద్రం లోని) మధ్య రంగ దేవాలయం, (శ్రీరంగం లోని) అంత్య రంగ దేవాలయం – ఈ మూడు దేవాలయాలు కూడా రంగనాథుని ప్రధాన ఆలయాలుగా పరిగణిస్తారు.
రాక్ ఫోర్ట్ దేవాలయం, తిరువానై కోవిల్, ఉరైయూర్ వెక్కలి అమ్మన్ దేవాలయం, సమయపురం మరియంమన్ దేవాలయం, కుమారా వైయలూర్ దేవాలయం, కాటాళగియా సింగర్ దేవాలయం ఈ చుట్టుపక్కల వున్న ప్రసిద్ధ దేవాలయాల్లో కొన్ని. అప్పల రంగనాథార్ ప్రధాన దైవంగా వుండే శ్రీ వడివలగియ నంబి దేవాలయం ఇక్కడి ప్రధాన విష్ణ్వాలయం – దీన్నే అప్పుకుడత్తన్ దేవాలయ౦ అని కూడా అంటారు. శ్రీరంగం పట్టణానికి దగ్గర లోని కోవిలడి గ్రామంలో ఈ దేవాలయం వుంది. శ్రీరంగానికి దగ్గరలోని మరో ప్రసిద్ధ విష్ణ్వాలయం ట్రిచీ కి సమీపంలో వుంది. శ్రీ రంగనాథ స్వామి దేవాలయం లో భాగమైన అళగియ నంబి దేవాలయం ఇది.
పట్టణం లోను, చుట్టూ పక్కలా ఇన్ని దేవాలయాలు వున్న శ్రీరంగం చాలా మంది యాత్రికులను ఆకర్షించడం లో ఆశ్చర్యం ఏముంది.
శ్రీరంగనాధ స్వామి దేవాలయం, సమయపురం మారియంమన్ దేవాలయం, జంబు లింగేశ్వర దేవాలయం, అఖిలా౦డేశ్వరి దేవాలయం శ్రీరంగంలోని ఇతర ప్రధాన దేవాలయాలు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List