నల్లమల అడవులలో ఉన్న కాళికాలయం కోట. ~ దైవదర్శనం

నల్లమల అడవులలో ఉన్న కాళికాలయం కోట.

.
కర్నూలు జిల్లాల సరిహద్దులో విస్తరించి ఉన్న నల్లమల అడవులలో ఉంది. ఈ అటవి ప్రాంతంలో ప్రవహించే కృష్ణానది మధ్యలో ద్వీపకల్పంలా విస్తరించి ఉన్న భూభాగంలో 600 అడుగుల ఎత్తులో కొండ మీద 20 ఎకరాల స్థలంలో ఈ కోటను నిర్మించారు.
కొల్లాపూర్ కు 16 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఒడ్డున అంకాళమ్మ కోట ఉంది. ఈ భూభాగం కర్నూలు జిల్లా లోని ఆత్మకూర్ అటవీ డివిజన్ పరిధిలోని పెద్ద చెరువు ప్రాంతంలో ఉంది.
ఈ కోటను 16 వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ కోటలో కాళికాలయం, ఆంజనేయ స్వామి విగ్రహం, శివలింగం, పురాతన బావి ఉన్నాయి. ఇక్కడి కాళికాదేవికి అంకాళమ్మ అని పేరు. ఆమె పేరు మీదుగానే ఈ కోటకు అంకాళమ్మ కోట అని పేరు వచ్చింది. పేరు భయం కొల్పే విధంగా ఉండినా, అమ్మ వారు మాత్రం ప్రశాంత వదనంతో ఉంటుందంటారు. కోట జన బాహుళ్యంలోకి రాని నాడు, గుప్త నిధుల కొరకు కొందరు దుండగులు విగ్రహాలను ధ్వంసం చేస్తే, జాలరులు, అక్కడి చెంచులు, మరికొందరు భక్తులు విగ్రహాలను పునఃప్రతిష్టించారు. ఇక్కడ అమ్మవారి పూజారులు కూడా చెంచులే.
అంకాళమ్మ కోటకు చేరుకోవటానికి రెండు మార్గాలు కొల్లాపూర్‌కు 8 కిలోమీటర్ల దూరంలో నల్లమల కొండల మధ్యన ఉన్న అమరగిరి గ్రామానికి చేరుకొని, అక్కడి నుండి కృష్ణానదిలో 8 కిలోమీటర్లు పుట్టీలలో, మోటార్ బోటులలో ప్రయాణించి అంకాళమ్మ కోటకు చేరుకుంటారు. కర్నూలు జిల్లా వాసులు ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని పెద్ద చెరువు ప్రాంతం వరకు లారీలు, ట్రాక్టర్లలో వచ్చి, అక్కడి నుండి కాలినడకన కోటకు చేరుకుంటారు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List