కాశీనాయన. ~ దైవదర్శనం

కాశీనాయన.





కడప జిల్లా జ్యోతి క్షేత్రంలోని శ్రీ అవధూత కాశీనాయన మందిరం (కాశీనాయన సమాధి)
కాశీరెడ్డినాయన నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా సీతారామాపురం మండలంలోని బెడుసుపల్లె గ్రామం ఈయనిది. ఈయన పూర్తి పేరు మునె్నల్లి కాశీరెడ్డినాయన. మునె్నల్లి సుబ్బారెడ్డి, కాశమ్మ దంపతులకు రెండవ సంతానం ఈయన. 1995 డిసెంబర్ 5వ తేదీ రాత్రి ( 1995 డిసెంబర్ 6న ) మరణించిన ఈయన జ్ఞాపకార్ధం కడప జిల్లాలోని నరసాపురం కేంద్రంగా కాశినాయన పేరిట రాష్ట్ర ప్రభుత్వం మండలాన్ని ఏర్పాటు చేసింది. డిసెంబర్ 6న జ్యోతి క్షేత్రానికి వచ్చిన వేలాదిమందికి అన్నదానం చేయించే ప్రక్రియను కూడా నాయనగారు ముందుగానే చేయించారు. పాడుబడిన ఆలయాలకు జీర్ణోద్ధరణ చేసి అక్కడ ప్రతిరోజు అన్నదానం జరిగేలా ఏర్పాటు చేసారు. ఇప్పుడు కాశినాయన ఆశ్రమాలు వెలసిన ప్రతి చోట విరివిగా గోసంపద పోషింపబడుతు నిత్యాన్నదానాలు నిర్వహిస్తున్నారు. కాశినాయన సమాధి ప్రదేశం ఏడవ జ్యోతి క్షేత్రంగా విరాజిల్లుతోంది. కాశీనాయన పేరు మీద ఇక్కడ ఒకపెద్ద దేవాలయం నిర్మిస్తున్నారు. వీటి నిర్వహణకు సహకరిస్తున్న భక్తుల సహకారం చాలా ముఖ్యమైనది.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List