భక్తులకి ఆధ్యాత్మిక స్వర్గం తిరువంబడి కృష్ణ టెంపుల్. ~ దైవదర్శనం

భక్తులకి ఆధ్యాత్మిక స్వర్గం తిరువంబడి కృష్ణ టెంపుల్.


కేరళలో కెల్లా అత్యంత ప్రాచీనమైన ఆలయం త్రిస్సూర్‌లోని వడకంనాథ స్వామి దేవాలయం. కేరళ నిర్మాణ శైలి కలిగి ఉన్న ఈ గుడి ఆలయం కుడ్యాలపై రంగురంగుల చిత్రాలు, పై కప్పుకి అలంకరించిన వర్ణచిత్రాలు ఎంతో అందంగా ఉంటాయి. వడకంనాథ స్వామి గుడికి సుమారుగా ఓ కిలోమీటరు దూరంలో ఉంది. ఇక్కడ బాలకృష్ణుడి విగ్రహం రమణీయంగా ఉంది. ఇక్కడ కూడా స్వామి గోచీలోనే దర్శనమిస్తారు. ఇదే గుడిలో కాళికా దేవి విగ్రహం కూడా ఉంది. ఈ గుడిలో వినాయకుడు అయ్యప్ప కూడా పూజలందుకుంటారు. కృష్ణుడు, దేవి ఈ గుడికి రావడానికి ఓ కథ ఉంది. నిజానికి ఇప్పుడు ఇక్కడ పూజలందుకుంటున్న కృష్ణుడి విగ్రహం మొదట్లో పార్థసారథి రూపంలో త్రిస్సూర్‌కి పదిహేను కి.మీ. దూరంలో ఉన్న ఎడక్కలతూర్ అనే ఓ కుగ్రామంలోని గుడిలో ఉండేదట. ఒకసారి ఆ గ్రామంలో మత ఘర్ఘణలు చెలరేగగా, కొంతమంది భక్తులు ఈ విగ్రహాన్ని తీసుకుని త్రిస్సూర్ చేరి ప్రస్తుత ఆలయానికి సుమారుగా 200 మీటర్ల దూరంలో ‘కంచనప్పిలి ఇళ్ళం’లో నివాసముంటున్న ఓ సదాచార నంబూద్రి కుటుంబానికి అప్పగించారట.
నిస్సంతులైన ఆ దంపతులు దీన్ని భగవంతుడి వరంగా భావించి, ఆ విగ్రహాన్ని తమకు పుట్టబోయే బిడ్డగా అనుకుని పూజించారట. దయాళువైన స్వామి తన భక్తుల ఆరాటం తీర్చడానికి పార్ధసారథి పట్టునుంచి బయట పడి ఓ చేత్తో వేణువు, మరో చేత్తో తన పెంపుడు తల్లిదండ్రులందించే వెన్నముద్దలను స్వీకరిస్తున్నట్లుగా ఆకారం దాల్చాడట. తరువాతే గుడి నిర్మాణం జరిగింది.
ఇక ఈ గుడిలోకి అమ్మవారు రావడానికి మరో కథ ఉంది. ఈ దంపతులలోని భర్తకి కొడన్‌గల్లూర్‌లోని అమ్మవారి పట్ల భక్తి. వీలైనప్పుడల్లా అక్కడి వెళ్ళి అమ్మవారిని దర్శించి తిరిగి వస్తుండేవాడట. వయసు పైబడి అక్కడి వెళ్ళలేకపోతే, ఆర్తితో అమ్మవారిని ప్రార్థించాడట. అమ్మవారి అంశ ఒకటి ఇక్కడి వచ్చి ఈ గుడిలోనే స్థిరపడిందట. కృష్ణుడితో పాటు, దేవిది కూడ బాల రూపమే. బలభద్రకాళి అనే పేరుతో పిలుస్తారు.
శ్రీ కృష్ణుడి భక్తులకి ఆధ్యాత్మిక స్వర్గం ఈ తిరువంబడి కృష్ణ టెంపుల్. శతాబ్దాల క్రితం, ఎన్నో పురాణాలు, కథలలో ఈ గుడి అత్యంత ప్రాచుర్యం పొందింది. ఉదయం 5 నుండి 11 గంటల వరకు మళ్లీ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 నిమిషాల వరకు ఈ గుడి తెరిచి ఉంచే వేళలు. స్వరాజ్ రౌండ్ కి దగ్గరగా ఈ గుడి ఉంది.
త్రిశూర్ పూరం పండుగలో రెండు విభాగాలైన త్రిశూర్ కి ప్రతినిధిగా కేరళలో జరిగే ఈ వేడుకలలో ప్రధానంగా పాల్గొనే రెండు గుడులలో తిరువంబడి కృష్ణ టెంపుల్ ఒకటి. ఈ నగరాన్ని 200 ఏళ్ళ క్రితం స్థాపించిన పితామహుడి వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. బంగారంతో అలంకరించబడిన ఏనుగులు, కళ్ళు మిరుమిట్లు గొలిపే బాణసంచా ప్రదర్శనల వల్ల ఈ పండుగకి UNESCO వారి ద్వారా భూమిపై జరిగే అత్యంత ఆకర్షనీయమైన పండుగగా గుర్తింపు పొందింది. ఏప్రిల్ నుండి మే మధ్య కాలం లో ఎప్పుడైనా ఈ పండుగ జరగవచ్చు. వేడి మరియు తేమ గా ఉండే వాతావరణాన్ని తట్టుకోగలిగిన వారు ఈ పండుగని చూసి ఆనందించవలసిందే.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List