శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేడుకగా వసంతోత్సవం ~ దైవదర్శనం

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేడుకగా వసంతోత్సవం




తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో గురువారం సాయంత్రం వసంతోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.


బ్రహ్మోత్సవాల్లో ఉదయం, సాయంత్రం వాహనసేవల్లో పాల్గొని అలసిపోయిన అమ్మవారికి ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవం నిర్వహించారు. దీనిని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. వసంతోత్సవంలో భాగంగా చందనంతోపాటు పలురకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం చేశారు.


అనంతరం చల్లదనం కోసం చందనం జలాన్ని మాడ వీధుల్లో భక్తులు ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, అర్చకులు ఉత్సాహంగా భక్తులపై వసంతాలు చల్లారు.


 

Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...