తిరుపతి శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం.. పూర్వము తుండీర మండలం నారాయణవనాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ఆకాశ మహారాజు పుత్ర సంతానార్థియై పుత్రకామేష్టి యాగం చేయసంకల్పించి యాగశాల నిర్మంచడానికై భూమిని దున్నుతుండగ పద్యంలో పవళించియున్న శిశువు గోచరించింది, ఆ శిశువునకు పద్మావతి అని నామకరణము చేసి పెంచుకొనగా ఒక సమయము తిరుమలలో విడిది చేసియున్న శ్రీనివాసుడు ఒక అడవి ఏనుగును వేటాడుతూ నారాయణవనం వచ్చి ఇక్కడ ఉద్యానవనంలో పద్మావతిని చూసి మోహించి రాజదంపతులతో క్రమంగా వివాహ ప్రస్థావనలు చేయించి విళంబి నామ సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం దశమి తిథి శుక్రవారం బ్రహ్మరుద్ర దేవ యక్ష, కింపురుషులు, బ్రహ్మరులు, దేవర్షుల సమక్షమున శ్రీ పద్మావతి, శ్రీనివాసుల సాలంకృత కన్యాదాన, పాణిగ్రహ వివాహముమహోత్సవము వైభవముగా జరిగినది, శ్రీ ఆకాశరాజుచే నిర్మించి ప్రతిష్ఠించబడి శ్రీ వైఖానసాగమోక్తంగ పూర్వము నుండి నిత్య నైమిక్తిక విశేషకైంకర్యములు జరుప బడుతున్నది
శ్రీవారు తన కుడిచేతిలో కళ్యాణకంకణమును ధరించి, దశావతార వాడ్యాణము, ఎడమ చేతి యందు వేటకు వచ్చునపుడు తెచ్చిన ఖడ్గమును నేత్రదర్శనముతో భక్తాదులను అనుగ్రహించి పాలించుచున్నారు, వివాహం కాని వధూవరులు శ్రీవారిని, అమ్మవారిని దర్శించగా కళ్యాణప్రాప్తి పొందుతారు, పూర్వము కార్వేటినగరం సంస్థానాధీశుల పాలనలో, తిరుత్తణి ఆలయ పాలనలోను తర్వాత దేవాదాయశాఖ ధర్మకర్త మండలి పాలనలో ఉంటూ ఏప్రిల్ 29-1967 సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానములొ నిర్వహణకు అప్పగించబడినది తిరుమల తిరుపతి దేవస్థానం వారి అద్వర్యంలో ఆనేక జీర్ణోద్ధారణ, అభివృద్ధికైంకర్యములతో భక్తులకు అధ్యాత్మిక వాతావరణం కల్పించబడినది, భక్తుకోటి ఐహిక, ఆముష్మిక ఫలాలు పొందుతున్నారు
No comments:
Post a Comment