శ్రీ పార్వతీ సమేత నిర్మ మహేశ్వర స్వామి ఆలయం ~ దైవదర్శనం

శ్రీ పార్వతీ సమేత నిర్మ మహేశ్వర స్వామి ఆలయం





 "పొదిలి"ని పూర్వము పృదులాపురి అని పిలిచేవారు. పంచ కోవెలల పొదిలి, శివాలయం.. ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధి గాంచిన ఆలయాల్లో ఒకటి . దాదాపు మూడు ఎకరాల విస్తీర్ణంలో అయిదు శివాలయాలు నిర్మితమై వున్నాయి. 🔅పర్వతీదేవి సమేత కైలాసనాధ స్వామి, త్రిపురసుందరీ సమేత భీమేశ్వరస్వామి, శ్యామలాదేవి సమేత నగరేశ్వరస్వామి

 ఆలయాలతోపాటు నిమ్మవ్వగుడి ఈ ప్రాంగణంలో వున్నాయి.


స్థల పురాణం..


నిర్మ మహేశ్వరుని ఆలయం గురించి పలు చారిత్రక కథనాలు ఉన్నాయి. దేవాలయం నిర్మించక ముందు ఆ స్థలంలో గోవిందుడు అతని భార్య తులసమ్మ ఒక  గుడిసె వేసుకొని నివసించేవారు. వారి ఇంటి సమీపంలోని పుట్టలో ఈశ్వరుడు ఉన్నాడని భావించి తులసమ్మ నిత్యం ఆవుపాలను పుట్టలో పోసేది. అలా పోయటం గోవిందుడుకి ఇష్టం ఉండేది కాదు. భార్యను మందలించి ఆవును కట్టివేశాడు. 


ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఆవు తన మెడకు కట్టిన తాడును తెంచుకొని పుట్ట వద్దకు పరుగున వెళ్లి తన పొదుగు నుంచి పుట్టలో పాలు జారవిడుస్తుండగా అది చూసిన గోవిందుడు ఆగ్రహించి కర్రతో ఆవుకు తలపై కొట్టాడు. వెంటనే ఆవు మాయమైంది. అక్కడ శివ లింగం ఉద్భవించించినట్లు ప్రతీతి. ఆ స్థలంలో నిర్మ మహేశ్వరుని ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి ఉత్తరం వైపు పార్వతీదేవి ఆలయం ఉంది. దీనికి పంచాఘ్నల వంశమూల పురుషుడు యజ్ఞేశ్వర తేనులు శ్రీ విద్య చక్రాన్ని నెలకొల్పారు. 


దేవాలయానికి దక్షిణం వైపు శ్రీకృష్ణ దేవరాయలు ప్రతినిధులుగా ఇక్కడ పనిచేసిన యల్లంరాజు, పెద్దకొండమ్మ, నిమ్మవ్వగుడి, మల్లన్న విగ్రహాలను ప్రతిష్ఠిం చారు. నిమ్మవ్వగుడి దక్షిణం వైపున కామాక్షిసమేత కైలాసనాథాలయం ఉంది.  ఆ పక్కనే త్రిపురసుందరీ సమేత భీమేశ్వరాలయం నిర్మించారు.  ఈ ఆలయంలో ముందుభాగంలో పుష్పగిరి పీఠాధిపతిగా ఉన్న ఉద్గండ నర్సింహ భూపతి అప్పటి వెంకటగిరిరాజు అనుమతితో జీవ సమాధి కాగా దానిపై గుడి కట్టి ధూప దీప నైవేధ్యాల కోసం ఇప్పటికీ పుష్పగిరి పీఠం నుంచి పూజారులకు నెలనెలా జీతభత్యాలు పంపిస్తుంటారు. ఆ పక్కనే శ్యామలా సమేత నగరేశ్వర ఆలయం ఉంది. 


ఈ ప్రాంగణంలోనే అన్ని ఆలయాల ముందు ధ్వజ స్తంభాలు ఏర్పాటు చేయడం రాష్ట్రంలోనే ప్రత్యేకం. నిర్మ మహేశ్వరస్వామి ఆలయం ముందు ఉన్న మండపంలో శనగల బసవన్న నంది విగ్రహం ఉంది. ఇక్కడి రాతి మండపాలు భక్తులకు కనువిందు చేస్తాయి. భక్తులు సహకారంతో దేవాలయం నూతన శోభను సంతతరించుకుంది. 

దేవాలయ ప్రాంగణం వెలుపల ఏర్పాటు చేసిన కైలాసనాథ ఉద్యానవనం సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. 


ప్రతి సంవత్సరం మాఘమాసంలో స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు 10 రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. బ్రహ్మోత్య్సవాలు నిర్వహించే పదిరోజులూ స్వామివారు రోజుకొక అలంకరణతో దర్శనమిచ్చెదరు. ఉభయదాతల ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఒక రోజు స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించెదరు. ప్రతి సంవత్సరం శివరాత్రి పండుగ మరుసాటి రోజున స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ.


(ప్రకాశం జిల్లా, పొదిలి, శ్రీ పార్వతీ సమేత నిర్మ మహేశ్వర స్వామి ఆలయం..)


Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List