మానవమేధస్సుకు అందని మరో శివలీల.. ప్రతీ రోజు మూడు రంగుల్లో శివలింగ దర్శనం ఉదయ, మధ్యాహ్న, సాయంత్ర సమయాలలో శివయ్య సహజంగా తన లింగాకృతి వర్ణం మార్చుకుని దర్శనమిస్తాడు.
ఈ ఆలయం రాజస్థాన్ రాష్ట్రం ధోల్పూర్ లోని మౌంట్ అబూ పర్వతాలకు11 కిలోమీటర్ల ఉత్తరాన ఆచల్ ఘర్ కొండలపై ఉన్న కోట సమీపంలో ఉన్నది. 2500 సంవత్సరాలకు పూర్వపు ఆలయం ఇది ఈ ఆలయం లో శివుని బొటనవేలు ను లింగంగా ఆరాధిస్తారు.
మన దేశం లోని శైవశేత్రాలు లో పరమేశ్వరుడు అత్యధికంగా లింగాకృతిలో కొద్దిచోట్ల సాకర విగ్రహ స్వరూపం లో దర్శనమిస్తారు.కానీ ఇక్కడ బొటనవేలు ఆకారంలోని లింగ స్వరూపం గా దర్శనమివ్వడం విశేషం. ఇక్కడ వలయాకారపు సొరంగ బిలం అందులో నీరు చేతికి అందే ఎత్తులో ఉంటుంది.అదే బిలం లో బొటనవేలు ఆకారం లో శివలింగాన్ని దర్శిస్తారు భక్తులు. అది పరమేశ్వరుని కాలి బొటనవేలు పూజలు కూడా ఆ బొటనవేలు కే జరుగుతాయి.
చెలన లక్షణమున్న పర్వతాలను చలించకుండా చేసేందుకు ఇక్కడ స్వామిని ఆచలేశ్వర్ గా పిలుస్తారు. శివుని బొటనవేలు ఆకారం ఉన్న సొరంగం పాతాళం వరకూ ఉందని నమ్ముతారు.నీటితో ఈ సొరంగం నిండడానికి ఆరు నెలలు కాలం పట్టిందని అంటారు. ఆచలేశ్వర్ ఆలయాన్ని 9 వ శతాబ్దం లో పారమార రాజవంశీయులు నిర్మిచారని చెబుతారు.
ఈ ఆలయంలో ఐదు టన్నుల బరువుండే పంచలోహ నందీశ్వర విగ్రహం ఉంటుంది.ఆ నంది ప్రక్కనే పిల్లవాని విగ్రహం కూడా కనిపిస్తుంది.ఆలయం విచ్చిన్నం చేసే ప్రయత్నం చేసినా దుష్టశక్తులు పై నందీశ్వర విగ్రహం నుండి తేనెటీగలు లేచి దాడిచేసి ఆలయాన్ని రక్షించాయి అన్నది స్థలపురాణం.
వశిష్టముని తపస్సు చేసిన ప్రదేశం.ఒక గోమాత ఈ బిలం లో చిక్కికుంటే ముని ప్రార్ధన మేరకు గోమాతను రక్షించేందుకు సరస్వతీ నది పాయను శివుడు బిలం లోనికి పంపారని స్థలమహత్యం చెబుతోంది. ఈ అలయం సమీపం లో ఉండే తటాకం ఒడ్డున మూడు రాతి గేదెలు ఉంటాయి. ఈ క్షేత్రాన్ని అర్థకాశీ అని పిలుస్తారు. శివయ్య బొటనవేలు క్రింద ఒక సహజ కొలను ఉంది.ఇది ఎప్పటికీ నిండదు. ఈ నీరు ఎక్కడికి వెళుతోంది కూడా అంతుపట్టని రహస్యం
ఈ లింగాకృతి ప్రతీ రోజు మూడు రంగుల్లో భక్తులకు దర్శనమిస్తుండి. ఉదయం ఎరుపు వర్ణం లో మధ్యాహ్నం కాషాయ వర్ణంలో సాయంత్రం నలుపు వర్ణం లో కనిపించడం ఎవ్వరూ తెలుకోలేని శివలీల గా నిలిచిఉన్న సత్యం
ఆలయ ప్రాంగణం లో పురాతన చంపా వృక్షం ఉంది.
పురాతన స్మారక చిహ్నాలు మరియు దేవాలయాలకు రాజస్థాన్ ప్రసిద్ధి చెందింది. ఈ పురాతన రాచరిక రాజ్యం సంవత్సరాలుగా భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన స్మారక చిహ్నాలు, కోటలు మరియు దేవాలయాలకు నిలయంగా మారింది. ఈ ఆలయం ఇప్పుడు దేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటి మరియు దర్శించే వారిపైగొప్ప శివ దర్శనానుభవం చూపుతుంది..
ఓం నమః శివాయ 🙏🙏
(శ్రీఆచలేశ్వర్ మహాదేవ్-ధోల్పూర్-రాజస్థాన్)
No comments:
Post a Comment