కార్తీక అమావాస్య పాటించాల్సిన పద్ధతులేంటో తెలుసుకోండి ~ దైవదర్శనం

కార్తీక అమావాస్య పాటించాల్సిన పద్ధతులేంటో తెలుసుకోండి

తెలుగు పంచాంగం ప్రకారం, కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలలో వివరించబడింది. కార్తీక అమావాస్య రోజున సూర్యోదయం కంటే ముందే, నిద్ర లేచి స్నానం చేసిన అనంతరం తులసి కోట వద్ద పారాధాన చేయాలి. పంచాంగం ప్రకారం, కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలలో వివరించబడింది.


కార్తీక అమావాస్య రోజున సూర్యోదయం కంటే ముందే, నిద్ర లేచి స్నానం చేసిన అనంతరం తులసి కోట వద్ద దీపారాధాన చేయాలి. ఆ తర్వాత పరమేశ్వరుని దేవాలయానికి లేదా విష్ణుమూర్తిని గుడికి వెళ్లి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి స్వామి వారి దర్శనం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా ఈ ఏడాది కార్తీక అమావాస్య ఎప్పుడొచ్చింది.. శుభ సమయ వివరాలు..


కార్తీక అమావాస్య ప్రాముఖ్యతల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


శుభ ముహుర్తం.


తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక మాసంలోని క్రిష్ణ పక్షంలో నవంబర్ 23వ తేదీన బుధవారం 6:53 గంటలకు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది ఆ తర్వాత రోజు అంటే నవంబర్ 24వ తేదీన గురువారం..


కార్తీక అమావాస్య ప్రాముఖ్యత..


స్కంద పురాణం ప్రకారం, కార్తీక అమావాస్య రోజున ప్రవహించే నదిలో స్నానమాచరించాలి. ఈ పవిత్రమైన రోజున మీ సామర్థ్యం మేరకు దీపాలు, ఆహారం, దుస్తులను దానధర్మాలు చేయాలి. అమావాస్య రోజున సంధ్యా వేళలో సూర్యాస్తమయం ముగిశాక చీకటి పడిన తర్వాత నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది. అదే విధంగా శ్రీ విష్ణుమూర్తికి తులసిని నైవేద్యంగా సమర్పించి.. భగవద్గీతను పఠించాలి. దీంతో విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి. కార్తీక అమావాస్య రోజున చీమలకు పిండిని తినిపించడం వల్ల దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.


చేయాల్సిన పనులు..


కార్తీక అమావాస్య రోజున సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. అదే విధంగా ప్రవహించే నీటిలో నువ్వులను వదలాలి. ఉదయాన్నే నవగ్రహ స్తోత్రాన్ని పఠించి భగవంతుని ఆశీస్సులు పొందాలి. అదే విధంగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే గ్రహాల వల్ల కలిగే దుష్ఫలితాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతారు. కార్తీక అమావాస్య రోజున శని బాధల నుంచి విముక్తి కోసం శివాలయంలో మట్టి దీపం వెలిగించాలి. పరమేశ్వరుని అనుగ్రహం కోసం శివలింగంపై తేనేతో అభిషేకం చేయాలి.


దేవతామూర్తులకు నైవేద్యాలు..


కార్తీక అమావాస్య రోజున ఎవ్వరు కూడా తమ ఇళ్ల ముంగిట రంగోలి ముగ్గులను వేయకూడదని శాస్త్రాలలో పేర్కొనబడింది. ఎందుకంటే అమావాస్యకు ముందు రోజు పూర్వీకులు తమ ఇంటికి వస్తారని, వారికి ఆర్ఘ్యమివ్వడానికి కార్యాలను చేయడం ద్వారా వంశంలో పురోగతి, అష్టఐశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.

అయితే ఇంటిముందు చెత్తచెదారాన్ని తొలగించి, కల్లాపి నీళ్లను చల్లొచ్చు. కాబట్టి కార్తీక అమావాస్య రోజున పూర్వీకులను మనసులో స్మరించుకుని దేవతా మూర్తులకు ఇచ్చే నైవేద్యాలు, కర్పూర హారతి ఇవ్వాలని పండితులు చెబుతున్నారు..

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List