కృష్ణాంగారక చతుర్దశి ~ దైవదర్శనం

కృష్ణాంగారక చతుర్దశి



బహుళ చతుర్దశి మంగళవారం కలయిక రోజు యముని, కుజుని పూజించినవారికి కలహ, ఋణ, ఆరోగ్య సమస్యలనుండి విముక్తి కలుగును. ఈ రోజు శివారాధన చేయాలి.


ఈరోజు చాలా విశిష్టమైనటువంటి రోజు, ఒక్క సంవత్సరం మొత్తం సంకష్టహర చతుర్థి పూజ చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఈ ఒక్క రోజు చేసే పూజ వల్ల అంత ఫలితం వస్తుందని చెప్పారు.


పూర్వం అవంతీ నగరం లో ఉండేవాడు భరద్వాజమహర్షి , ఒకప్పుడు ఆ భరద్వాజుడు అప్సరసను చూడడంవల్ల ఆయనకి ఒక విధమైనటువంటి మోహము కలిగి దానివల్ల వీర్య పతనం అయింది. ఆయన అద్భుత వీరుడు కాబట్టి అది భూమి మీద  పడేటప్పటికి అక్కడ ఒక ఎర్రటి కుసుమం కలిగిన కుమారుడు ఒక బాలుడు ఉదయించాడు , భూమిలో పుట్టాడు కాబట్టి భూదేవి అతనికి ఏడు సంవత్సరాల వయసు వచ్చే వరకు పెంచి పెద్ద చేసి ఆ తర్వాత  భరద్వాజునికి అప్పగించింది ఆ మహర్షి ఆ కుమారునికి ఉప నయనం చేసి సకల శాస్త్రములు చెప్పి గణపతి మంత్రాన్ని ఉపదేశించిన ఆయన దీనిని నిష్టగా జపించాల్సిందిగా చెప్పాడు. ఈ అంగారకుడు ఆ మంత్రాన్ని నర్మదా నది తీరాన నిష్ఠగా జపిస్తే విగ్నేశ్వరుడు సాక్షాత్కరించి నీ కోరిక ఏంటో చెప్పమంటే అంగారకుడు నా పేరుతో ఈరోజు మంగళ దాయకంగా కావాలి అని చెప్పి అలాగే ఈ రోజున నీ పూజ చేసినటువంటి వారికి సమస్త కష్టములు తొలగి పోవాలి అని చెప్పి , అలాగే మూడవది దేవతల లాగా నాకు కూడా అమృతం ప్రాప్తి జరగాలని కోరుకున్నాడు , అందువల్లనే వినాయకుడు ఆయన పేరుతో ఈ రోజుని మంగళవారంగా సృష్టించడం జరిగింది. ఈరోజు మంగళవారం కావటానికి కారణం ఈ సంఘటన.


అట్లాగే ఎర్రటి వాడు కాబట్టి అంగారకుడు అని ఈ పేరు వచ్చింది. భూమికి పుట్టాడు కాబట్టి *"కువలయము"* కు అంటే భూమి అని కుజుడు అని కూడా అంటారు. ఈ రోజు మంగళవారం ఈనాడు బహుళ చతుర్దశితో కలిసి వచ్చింది కనుక ఈ వ్రతం చాలా శక్తి కలిగినటువంటిది. 


సర్వే జనాః సజ్జనో భవంతు !

సర్వ సజ్జనా స్వజనో భవంతు !!

సర్వ స్వజనా సుకృతో భవంతు !

సర్వ సుకృత జనః సుఖినో భవంతు !!

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List