శ్రీ త్రిపురాంతకేశ్వర - బాలాత్రిపుర సుందరీ ఆలయం ~ దైవదర్శనం

శ్రీ త్రిపురాంతకేశ్వర - బాలాత్రిపుర సుందరీ ఆలయం





శ్రీశైల పుణ్యక్షేత్రం కంటే అతి పురాతనమైందిగా ప్రసిద్ధి చెందిన మహా శైవధామమే త్రిపురాంతకం. శైవ శాక్తేయ క్షేత్రాలలో అత్యంత ప్రాదాన్యం పొందిన మహామహిమాన్విత దివ్య క్షేత్రం త్రిపురాంతకం. స్కాంద పురాణంలో శ్రీశైల ఖండంలో ‘’త్రైలోక్య పావనం తీర్ధం త్రిపురాంతక ముత్తమం‘’ అని చెప్పబడిన అతి ప్రాచీన క్షేత్రం. త్రిపురాంతకం సిద్ధ క్షేత్రం. అనేక యోగులు ,సిద్ధులు తాన్త్రికులకు ఆవాస భూమి .అనేక దివ్యమైన ఔషధాలు నిలయం. ఇక్కడి స్వామి ధ్వజస్తంభాన్ని చూసినా పాపాలు పటాపంచలౌతాయి అంటారు . ఈ దైవ దర్శనం చేస్తే నంది జన్మ లభిస్తుందని విశ్వాసం. ఇక్కడి లింగాన్ని ‘’తత్పురుష లింగం‘ ’అంటారు.


స్థల పురాణం..


తారకాసురుడు మెడలోని ప్రాణ లింగాన్ని చేదించి వాడిని సంహరించి యుద్ధంలో అలసిన శరవణ భవుడు ‘’ఆదిశైలం’’ అనే పేరున్న ఈ పర్వతం పై విహరించటం వలన ఈ కొండకి’’ కుమార గిరి ‘’ అనే పేరొచ్చింది. తారకాసురుని ముగ్గురు కొడుకులు తారాక్షుడు ,విద్యున్మాలి ,కమలాక్షుడు. వీరినే త్రిపురాసురులు అంటారు.


తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవటానికి ఈ ముగ్గురు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశారు ..బ్రహ్మ ప్రత్యశమై వరం కోరుకోమన్నాదు .ఎవరి చేతిలోనూ చావు కలగ కూడదని వరం కోరుకొన్నారు. పుట్టిన వాడు చావాల్సిందే కనుక ఎలా చావాలనుకోన్నారో చెప్పండి అని అడిగాడు. తాము ఆకాశంలోమూడు పురాలను కట్టుకొని వెయ్యేళ్ళు జీవించిన తర్వాత ఆ మూడు పురాలు వరుసగా ఒకే చోట చేరినప్పుడు ఒకే బాణంతో ఆ త్రిపురాలను చేదించిన వాని చేతిలోనే తమకు మృత్యువు రావాలని కోరుకొన్నారు .సరేనన్నాడు బ్రహ్మ.  తరాక్షుడు బంగారం ,విద్యున్మాలి వెండితో ,కమలాక్షుడు ఇనుముతో చేయబడిన పురాలను కట్టుకొని ఉంటూ దేవతలను మునులను బాధిస్తున్నారు .

వారు పరమేశ్వరుని ప్రార్ధించారు. పరమేశ్వరుడు అంతర్ముఖుడైనాడు. పర దేవతను ఆత్మలో ధ్యానించాడు.

బాలా త్రిపురసుందరిగా ఆమె ఆవిర్భవించి శివుని ధనుసులో ప్రవేశించింది.


త్రిపురాలన్నీ ఒకే సరళ రేఖలో చేరాయి. రుద్ర బాణం తో అవి ఒకే సారి ద్వంసమై ,వారు మరణించారు.

త్రిపురాసుర సంహారం చేసిన రుద్రుడు ఎక్కడ ఉంటె తానూ ఆక్కడే ఉండి ఆయన్ను సేవిస్తాను అని ఆయన అనుగ్రహాన్ని కోరింది. రుద్రుడు వెంటనే సమాధి స్థితిలోకి వెళ్ళాడు.ఆయన పాదాల దగ్గర పెద్ద గుట ఏర్పడి ,ఆ గుంటలోనే ఆయన ‘’వైడూర్య లింగం ‘’గా ఆవిర్భవించాడు.

 

త్రిపురాంతకేశ్వరుడు ఆవిర్భవించిన ఈ దివ్య ప్రదేశమే కుమారగిరి. తారకాసుర సంహారం చేసిన తర్వాత కుమార స్వామి ఇక్కడ రహస్య ప్రదేశంలో తపస్సు చేస్తున్నాడు అంటారు. ప్రతి పౌర్ణమి నాడు పార్వతీ దేవి ,ప్రతి అమావాస్య రోజున పరమేశ్వరుడు వచ్చి తమ కుమారుడైన కుమారస్వామిని చూసి పోతూ ఉంటారని శివ పురాణం తెలియ జేస్తోంది.


శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయం..


కుమార గిరికి దగ్గరలో ఒకప్పటి చెరువు లో కదంబ వృక్షాల మధ్య శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయం ఉంది.

ఇప్పుడున్న గర్భ గృహం త్రిపురసున్దరీదేవి ఆవిర్భవించిన చిదగ్ని కుండం. దీన్ని స్థానికులు ‘’నడబావి ‘’అంటారు.

అమ్మవారు ఉత్తరాభి ముఖంగా దర్శన మిస్తుంది .చిదగ్నిగుండం లోకి దిగాలంటే తొమ్మిది మెట్లు దిగి వెళ్ళాలి .

తొమ్మిది మెట్లూ దిగిన తర్వాత చిదగ్ని గుండం లో నిర్గుణ శిలకార రూపంలో అమ్మవారు కనిపిస్తుంది. చిదగ్ని కుండం నుంచి బయటికి వచ్చేటప్పుడు మెట్లకు రెండు వైపులా రెండు మండపాలున్నాయి. వాటినే ‘’సిద్ధి మండపాలు ‘’అంటారు .ఈ మండపాలలో కూర్చుని తదేక దృష్టితో మంత్రం జపిస్తే వెంటనే సిద్ధి కలుగుతుందని తత్వజ్ఞులు చెప్పారు. 


రక్త పాత్రలు..


గర్భాలయం లో రాతి ‘’రక్త పాత్ర ‘’ఉంది దీనికి ‘’ఉగ్రపాత్ర ‘’అనే పేరు కూడా ఉంది .ఉగ్రపాత్ర అర అడుగు ఎత్తు ,రెండడుగుల వ్యాసం కలిగి ఉంటుంది .ఎన్ని దున్నల్ని బలిచ్చినా ,ఒక్కో పొతూరక్తానికి కడివెడు నీళ్ళు పోసినా ఆ రక్త పాత్ర నిండదు .ఈ విషయం ఈ నాటికీ ప్రత్యక్ష నిదర్శనమే .


ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు, వేడుకలు జరుగుతాయి. వరుసగా పది రోజులపాటు అన్నదానం చేస్తారు. కార్తీక పౌర్ణమికి కొండపై శివాలయంలో జ్యోతులు వెలిగించి ఆరాధిస్తారు. శివరాత్రి సందర్భంగా మొదటిరోజు తిరునాళ్ళ, రెండవరోజు ఆట విడుపు మూడవ రోజు రధోత్సవం జరుగుతుంది. 

రధోత్సవం సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. కల్‌కతా, కాశీలలో తప్ప మరెక్కడా ఈ కదంబ వృక్షాలు కనిపించవని చెబుతారు. అమ్మవారు కదంబ వనవాసిని కావడంవల్లనే ఇక్కడిలా కదంబ వనం ఉందని భక్తులు చెబుతారు.


ఇంతటి మహా మహిమాన్విత దివ్య క్షేత్రమైన త్రిపురాంతకం వెళ్లి శ్రీ బాలా త్రిపుర సుందరిఅమ్మవారిని, శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివారిని దర్శించి జీవితాలను చరితార్ధం చేసుకోవాలి.. ఇక దేవాలయం గోడల పై పండవులు గీచినట్లు చెప్పబడే అనేక చిత్రాలను చూడవచ్చు.


ప్రమద గణాల విగ్రహాలను మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఆలయానికి కుడివైపున పార్వతీ దేవి ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి వెనుకవైపున ఐదు ఆలయాలు ఉంటాయి. వీటిని పంచకేదార ఆలయాల నమూనాలు అని పిలుస్తారు. విటిని పంచ కేదారాల నమూనా ఆలయాలు అంటారు. ఇక తుంగనాథ ఆలయాన్ని అర్జునుడు స్వయంగా నిర్మించాడని ప్రతీతి. ఇక్కడ శీతాకాలంలో ఆలయాన్ని మూసివేస్తారు.


గర్భగుడితో పాటు ఆలయ శిఖరం మంచుతో కప్పబడి ఉండటమే ఇందుకు కారణం. ఉత్సవ విగ్రహాలను సమీపంలోని ముకునాథ్ మఠానికి తరలించి పూజిస్తారు. అందుకే ఈ దేవాలయాన్ని ప్రతి ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో మాత్రమే సందర్శించడానికి వీలవుతుంది. ఈ సమయంలోనే భక్తులు ఈ తీర్థయాత్ర చేస్తారు.


ఈ తుంగనాథ దేవాలయానికి దగ్గరగా మందాకినీ నది, అలకనంది నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అంతేకాకుండా చంద్రశిల పర్వతం కూడా ఉంది. వేసవి కాలంలో ఈ తుంగనాథ్ పరిసర ప్రాంతాలు ప్రకృతి అందాలతో మెరిసిపోతూ ఉంటాయి.


ఈ పవిత్ర క్షేత్రానికి దగ్గర్లో ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్ దగ్గరగా ఉన్న జాలీ గ్రాండ్ విమానాశ్రయం ఉంది. ఢిల్లీ నుంచి ఇక్కడికి విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక తుంగనాథ్ కు దగ్గరగా హరిద్వార్ రైల్వేస్టేషన్ ఉంది. వీటి మధ్య దూరం 225 కిలోమీటర్లు..

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List