కూష్మాండ (గుమ్మడికాయ) దీపం ~ దైవదర్శనం

కూష్మాండ (గుమ్మడికాయ) దీపం




గుమ్మడి కాయతో ఎన్నో పరిహారాలు  సూచించింది శాస్త్రం. అందులో కూష్మాండ దీపం ఒకటి. నరదృష్టి, నర ఘోష, ఆర్ధిక సమస్యలు, అప్పుల బాధలు, ఇంట్లో నెగిటి్ ఎనర్జీ ఎక్కువ అవ్వడం, కుటుంబ కలహాలు, భూతపిశాచ బాధలు మొదలైన సమస్యలు ఉన్న వారికి కాల భైరవ తత్వం ప్రకారం..  మంచి పరిహారం ఈ కూష్మాండ దీపం.

ఇది ఇంట్లోనే అందరు చేసుకోవచ్చు, కేవలం భక్తి శ్రద్ధ కావాలి అంతే.


కూష్మాండ దీపారాధన-విదానం..


ఈ దీపారాధన బహుళ అష్టమి రోజున కానీ అమావాస్య రోజున కానీ చెయ్యాలి.. ధన యోగం కోసం అష్టమి రోజు చెయ్యాలి. జన ఆకర్షణ కోసం అమావాస్య రోజు చెయ్యాలి. ఇలా 19 అమావాస్యలు లేక 19 అష్టములు చేయాలి. ఇది కేవలం ఇంట్లో చేసుకునే దీపారాధన మాత్రమే గుడిలో చేసే విధానం వేరుగా ఉంటుంది.


ఒక చిన్న బూడిద గుమ్మడికాయ తీసుకుని దాన్ని అడ్డగ కోసి గింజలు పిక్కలు తీసి దొల్లగ చేసి దానిలో పసుపు రాసి కుంకుమ బొట్టు పేట్టి  అందులో నల్ల నువ్వుల నూనె పోసి పెద్ద వత్తులు రెండు వేసి దీపం వెలిగించాలి. ఆ దీపానికి  పూజ చేసి దీపం దగ్గర కాల భైరవ అష్టకం 2 సార్లు చదవాలి. ప్రసాదంగా ఖర్జూరం పెట్టండి. ఉదయం బ్రాహ్మి ముహూర్తంలో చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఆ రోజు ఉపవాసము ఉండాలి ఘన పదార్థం తినకుండా ద్రవ పదార్థం మాత్రమే తీసుకోవాలి.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List