శ్రీ నారాయణస్వామి ఆలయం ~ దైవదర్శనం

శ్రీ నారాయణస్వామి ఆలయం


సార్వసంగ పరిత్యాగిగా... యోగిగా కోరిన వరాలను ఇచ్చే వేల్పుగా భక్తజనులు మిట్టపాలెం శ్రీ నారాయణస్వామిని కొలుస్తుంటారు. పురుషోత్తముడిగా, కుల మతాలకు అతీతుడిగా, సంఘసంస్కర్తగా, మహిమాన్వితుడిగా వెనుతికెక్కిన నారాయణస్వామి దేవాలయం ప్రకాశం జిల్లా జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అనంతకోటి అవతారాలలో నారాయణస్వామి అవతారం ఒకటని భక్తులు ప్రగాఢ విశ్వాసం.


స్థలపురాణం..


మిట్టపాలెంలోని కొమ్మినేని వంశానికి చెందిన నారాయణస్వామి అసలు పేరు కొండయ్య. ఈయన మిట్టపాలెంలో నివసించుచున్న కొమ్మినేని మహాలక్షమ్మ, వెంకట్రామయ్య దంపతులకు జన్మించాడు. ఎల్లప్పుడూ పరధ్యానంగా ఉంటూ పిచ్చి కొండయ్యగా పేరు పొందిన ఈయన బాల్యములోనే సన్యాసులతో కలసి గ్రామం విడిచివెళ్లి కొన్నేళ్ల తర్వాత తిరిగివచ్చి నారకొండ గుహల్లో నివాసం ఏర్పరచుకొన్నాడు. మన్నేట స్నానం చేస్తూ, నారకొండలో దొరికే ముష్టిపండ్లను బొమ్మ జెముడు పాలను త్రాగుచూ జీవం సాగించుచుండెను. ఒకనాడు ఒక మహనీయుడు ఆయనను దగ్గరకు చేరదీసి మంత్రోదేశము గావించి ఇక ముందు "నారాయణ స్వామి"గా విలసిల్లి గలవని దీవించి అంతర్ధానమయ్యెను. అప్పటి నుండి ఆయన నారాయణ స్వామిగా ప్రసిద్ధిగాంచాడు. 


రైతులకు ఆర్థిక సహాయం చేయని రాజులకు పన్ను వసూలు చేసే హక్కు లేదని, ప్రభువులకు కప్పం చెల్లించవద్దని ఆయన ప్రచారం చేశాడు. ప్రభువులను ఎదిరించగా ఆయనను నిర్భంధించారు. అయితే ఆయన నిర్భంధం నుంచి తప్పుకొని ప్రభువు వద్దకు వెళ్ళాడు. మానవాతీత శక్తులున్నందువల్లనే నారాయణ స్వామి నిర్భంధం నుంచి బయటపడ్డాడని భావించిన రాజు ఆయనను గౌరవించాడు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని పాలించాలని రాజుకు హితబోధ చేశాడు.సమాధిరూపంలో నుండి భక్తులను అనుగ్రహించాలని మహా శివరాత్రి ఆదివారం సజీవ సమాధి అయ్యారు. అప్పటినుండి భక్తులను సమాధిలోనుంచే అనుగ్రహిస్తున్నారు. సమతా, మమతా పెంపొందించుకొని సామరస్యంగా జీవించాలని ప్రచారం చేసిన మానవతావాది ఆయన. 


ఆదివారం నారాయణ స్వామికి ప్రీతిపాత్రం. ఆరోజు ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య ఎక్కువ.

ఆదివారం రాత్రి ఆలయంలో నిలిచే భక్తుల సంఖ్య కూడా ఎక్కువే. ఆ రోజు భక్తులు ఆలయాన్ని సందర్శించి, ఇక్కడి తీర్థంలో స్నానమాచరించి, వీభూతి, పూలకాపు తీర్థం స్వీకరించి రాత్రి నిలిస్తే వారి చర్మవ్యాధులు, జబ్బులు, తదితర రుగ్మతలకు వెంటనే పరిహారం లభిస్తుంది శారీరక, మానసిక సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మకం. ఇక్కడ మహాశివరాత్రి మహోత్సవాలు భారీస్థాయిలో జరుగుతాయి. వారం రోజులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు నారాయణ స్వామిని దర్శించుకుంటారు.


శ్రీ నారాయణస్వామివారికి ప్రతి సంవత్సరం సప్తాహ్నిక దీక్షతో మహాశివరాత్రి మహోత్సవములు జరుగుతాయి. 

వారం రోజుల పాటు శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో స్వామివారి ఆరాధనోత్సవాలు ప్రతి సంవత్సరం, ఆషాఢ మాసంలో బహుళ సప్తమినాడు వైభవంగా నిర్వహిస్తారు.

 ఈ ఉత్సవాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేస్తారు. ఈ సందర్భంగా మూలవిరాట్టు విశేషాలంకారణతో దర్శనమిస్తారు. ఆరోజు ఆలయంలో పంచామృతాభిషేకం, శాంతిహోమం నిర్వహించడం జరుగుతుంది.


ఆలయంలో శ్రీ స్వామివారికి పంచామృత అభిషేకం మధ్యాహ్నం మహానివేదన, సాయంత్రం శ్రీ నారాయణస్వామివారికి పల్లకీసేవ రథోత్సవం, పంచ,రథ, కుంభహారతులు భక్తిప్రపత్తులతో నిర్వహిస్తారు. మహిళలు పెద్ద ఎత్తున పొంగళ్ళు సమర్పిస్తారు. ఆలయాన్ని సందర్శించే భక్తులకు మిట్టపాలెంలో నిర్మాణమయిన స్వాగత ద్వారం ఆహ్వానం పలుకుతుంది. ఇక ఆలయంలో అడుగిడగానే ప్రధాన మందిరం, గోపురాలపై దశావతారం మూర్తుల విగ్రహాలు కనిపిస్తాయి. 


ఆలయంలోని ముడుపుల చెట్టు వద్ద భక్తులు హెచ్చు సంఖ్యలో కనిపిస్తారు. కోరికలకు ముందు, కోరికలు తీరిన తర్వాత ముడుపులు చెల్లించడానికి భక్తులు చెట్టువద్దకు చేరుకొంటారు. ఆలయంలో స్వర్ణమూర్తికి పూజలు జరుగుతాయి. ప్రధాన దైవానికి రాత్రి వేళలలో నక్షత్ర హారతి, కుంభ హారతి పంచహారతులు జరుగుతాయి. ఉదయం 7.30 గంటలకు జరిగే హారతికి సాయింతం 7 గంటలకు జరిగే రథోత్సవానికి విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు.


శ్రీ నారాయణ స్వామి ఆలయం ఒక గుడి మాత్రమే కాకుండా ఒక చికిత్సాలయం కూడా. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజ జరిపి శారీరక మరియు మానసినమైన జబ్బులను నయంచేసుకొంటారు. స్వామి జీవ సమాధి నుండి భక్తులకు ఆశీస్సులు లభిస్తున్నాయని స్థానికుల నమ్మకం..


Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List