శివుడికి మనం భస్మం ఎందుకు ధారణ చేయాలి..? ~ దైవదర్శనం

శివుడికి మనం భస్మం ఎందుకు ధారణ చేయాలి..?



భస్మం శివారాధన చేసేవాళ్ళో, లేక శైవులో పరమేశ్వరుడికి ఇష్టం కాబట్టి పెట్టుకుంటారంటే చాలా పొరపాటు పడినట్లే.. ఐశ్వర్యం గోషు సంపన్నం (మహాభారతం ) లో చెప్పబడినది.
అంటే ఐశ్వర్యం గోవు తో పోల్చారు గోవు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుంది అని అర్ధం. కొంతమంది అడగవచ్చు. ఏమని?,
గోవు ఉంటే ఐశ్వర్యం ఉండటం ఏమిటి అని,(మహాభారతం గో మాహాత్మ్యం పర్వం ) లో చెప్పబడినది గోమయం లో లక్ష్మీదేవి ఉంటుంది అని. ఆ గోమయాన్ని మనం ముఠాలు అనగా గుండ్రముగా తయారుచేసి దానిని హుతం చేసి అనగా కాల్చి వచ్చినటువంటి బూడిదని (భస్మాన్ని) మనం ధారణ చేస్తున్నాము.
అంటే మనము సాక్షాత్తు లక్ష్మిదేవిని ధారణ చేస్తున్నాము. అందుకనే భస్మాన్ని (విభూతిర్భూతిరైస్వర్యం) అన్నారు భస్మము ధారణ చేయడం వలన ఐశ్వర్యం కలుగుతుంది అని పండితులు, పెద్దలు, చెప్తూ ఉంటారు.
కొన్ని పురాణాలలో (త్రి పుమ్డ్రేన వినదానం త్రి పుమ్డ్రేన వినా జపం త్రి పుమ్డ్రేన వినా శ్రాద్ధం తోయం నిష్ఫలదాయకం )అన్నారు. భస్మం లేకుండా చేసిన దానం ,భస్మం లేకుండా చేసిన జపం, భస్మం లేకుండా చేసిన శ్రాద్ధం ఫలితం ఇవ్వవు అని.
భస్మం ఎవ్వరైనా ధారణ చేయవచ్చు ,భస్మ ధారణ చేసి మహాలక్ష్మి ,పరమేశ్వర అనుగ్రహము పొంది అష్ట ఐశ్వర్యాలు పొందవచ్చు, ఏ మాత్రము సందేహము లేదు..

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List