జ్ఞాన వాపి (బావి) మహాత్మ్యం ~ దైవదర్శనం

జ్ఞాన వాపి (బావి) మహాత్మ్యం



అగస్త్యునికి కుమారస్వామి కాశీ లోని జ్ఞాన వాపి మహాత్మ్యాన్ని వివరించాడు. పూర్వం దేవ యుగంలో ఈశానుడు స్వేచ్చగా తాండవ నృత్యం చేస్తున్నప్పుడు దాహం బాగా వేసి నీటి కోసం వెతికాడు. అప్పటి స్తితిలో మేఘాలు వర్షిమ్చటం లేదు. నదుల్లో, బావుల్లో నీరే లేదు. దొరికిన నీరైనా ఉప్పు కషాయం. నరసంచారం తగ్గింది. ఆనంద కాననం అని పిలువా బడే కాశీ క్షేత్రం ఊసర క్షేత్రమయింది. మరణాల సంఖ్య పెరిగి పోతోంది.. ఈశానుడు కాశీ నగరం చేరాడు. అక్కడ జ్యోతిర్లిన్గాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ లింగానికి అభిషేకం చేసి, ఆ తీర్ధాన్ని త్రాగాలను కొన్నాడు. తన చేతిలోని త్రిశూలాన్ని శివాలయం దగ్గర భూమి పై గుచ్చాడు. అక్కడ ఒక కుండం ఏర్పడింది. అది పూర్తిగా నీటి తొ నిండి పోయి, చుట్ట ప్రక్కల ప్రదేశం కూడా నీటితొ నిండింది. ఆ మహోదకంతో ఈశానుడు జ్యోతిర్లిన్గాన్ని అభిషెకించాడు.


ఆ కుండంలోనీ నీరు ఉత్తమ హృదయంలా స్వచ్చంగా, వెన్నెలలా తేటగా, శంఖంలా శివుని నామంలా పవిత్రంగా ఉంది. అమృతంతో సమంగా ఉంది పంచామృతాలతో ఈశానుడు ఆ జలం తొ జ్యోతిర్లిన్గాన్ని తనివి తీర వెయ్యి ఘటాల జలంతొ. అభి షెకించాడు. సంప్రీతి చెందిన రుద్రుడు ప్రత్యక్ష మైనాడు. ’’నీ సహస్ర ఘటాభి షెకానికి సంతోషించాను. నువ్వు కోరిన యే వరమైనా ఇస్తాను కోరుకో ‘’అన్నాడు. అప్పుడు ఈశానుడు ఆ తీర్ధం ఆయన పేరు తొ పిలువ బడాలని కోరాడు విశ్వేశుడు ‘’అన్ని లోకాలలోనూ ఉన్న తీర్దా లన్నిటిలో ఇది ప్రసిద్ధమవుతుంది. దీన్ని శివ తీర్ధం అని పిలుస్తారు. శివం అంటే జ్ఞానం కనుక జ్ఞాన తీర్ధం ఇది. ఈ జ్ఞాన వాపి మహా ప్రసిద్ధి చెందుతుంది. తాకితేనే పాపాలను నశింప జేస్తుంది. అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది. ఈ జలంతొ పిండ ప్రదానం చేస్తే కల్పాంతం వరకు శివలోకం లోనే ఉంటారు. జ్వరం మొదలైన అపస్మారకాలు శివ తీర్ధం చేత పొగొట్ట బడుతాయి. ఇక్కడ శివుడు ద్రవ రూప మైన జ్ఞాన స్వరూపుడుగా ఉండి అలసత్వం మొదలైన వాటిని తొలగిస్తాడు. జ్ఞానాన్ని బోధిస్తాడు.


స్కందుడు అగస్త్యునికి ఒక కధ చెప్పాడు. పూర్వం కాశిలో హరి స్వామి అనే బ్రాహ్మణుడు ఉండే వాడు. ఆయనకు అతిలోక సౌందర్యవతి అయిన సుశీల అనే కూతురుంది. ఆమె సూర్యుడికి భయ పడి చీకటిలో దాగుకోనేది. రోజు జ్ఞాన వాపి దగ్గర స్నానం చేసి శివుడిని ఆరాధించేది. ఒక రోజు ఆమె ఇంటి బయట నిద్రిస్తుంటే ఆమె అందానికి ముగ్దుడైన ఒక విద్యా ధరుడు ఆమెను ఎత్తుకొని పోయాడు అప్పుడు విద్యున్మాలి అనే రాక్షసుడు అతడిని అడ్డ గించాడు త్రిశూలంతొ విద్యాధరుడిని పొడిచాడు. అతను ఒక్క పిడికిలి పోటుతో రాక్షసుడిని చంపేశాడు. సుశీల ఆ విద్యాధరుడే తన పతి అని అతని శవం మీద పడి ఏడిచింది. సుశీలను తాకటం చేత ఆమె పుణ్య వశం తొ విద్యున్మాలి రాక్షసుడు స్వర్గం చేరాడు. విద్యాధరుడు చనిపోయే ముందు సుశీలను స్మరించటం చేత మలయ కేతువు అనే పర్వత రాజుకు కుమారుడుగా పుట్టాడు. సుశీల కర్నాటక దేశంలో పుట్టింది. ఆమె పేరు కళావతి. ఆమెకు పూర్వజన్మ వాసన వల్ల చిన్న తనం నుండే రుద్రార్చన చేసింది ఒక ఉత్తరాది వాడు ఒక రోజు రాజు గారికి ఒక చిత్రాన్ని చూపాడు దాన్ని ఆయన కళావతికి చూపించాడు. అంతే ఆమె లో చాలా మార్పు వచ్చింది.


కాశీ క్షేత్రాన్ని జ్యోతిర్లిన్గాన్ని, జ్ఞాన కూపిని గంగా నదిని స్మరించింది. ఆ ప్రదేశాలలో తిరిగిన అనుభూతి పొందింది ‘’ఇది కాల భైరవుడు క్షేత్ర పాలకుడుగా ఉన్న చోటు. ఇది కాల భైరవుని చేతి నుండి నేల బడిన బ్రహ్మ కపాల క్షేత్రం, ఇది రుణ విమోచన క్షేత్రం, ఇదుగో ఓంకారేశ్వరుడు, ఇది ప్రణవాక్ష్య క్షేత్రం, ఇది మత్సోదరి తీర్ధం ఈయన కామేశ్వరుడు ఇక్కడ ఈశ్వరుడు స్వలని (స్వలీన) పేరుతొ ఉన్నాడు స్కందేశ్వరుడు సర్వ సిద్ధి దాయకుడు. ఈయన వినాయకుడు విఘ్నాలను హరిస్తాడు, ఈ జ్యోతిర్లిన్గాన్ని దర్శిస్తే భ్రున్గీశ్వరుడు జీవన్ముక్తు డయాడు. యజ్ఞేశ్వర, సర్వ తీర్దేశ్వర లింగాలను సేవిస్తే అన్నీ లభిస్తాయి. సారస్వత సర్వ తీర్దేశ్వర లింగాలకు అభిషేకం చేస్తే తీరని కోరిక ఉండదు. మంత్రేశ్వరుడు అన్ని మంత్రాలకు అది పతి. బాణాసురుడు పూజించిన బాణేశ్వర లింగం ఇది. ఇది ప్రహ్లాదుడు స్తాపించిన వైరోచన లింగం దీన్ని బలి కేశవుడని, నారద కేశవుడని అంటారు.


దత్తాత్రేయుని దత్తాత్రేయ లింగం ఇదిగో ఆదికేశావుడు మొదట దీన్ని స్తాపించాడు ఇది గదాధర లింగం దీనికి భ్రుగు కేశవుడని, వామన కేశవుడని పేరు. ఇవి నారాయణ లింగాలు వీటికి యజ్న వరాహ కేశవులని పేరు. వీటినే నరసింహ లింగమని, గోపీ గోవింద లింగాలని పేర్లు. ఈ నరసింహుని అనుగ్రహం తోనే ప్రహ్లాదుడు ఇంద్ర పదవి పొందాడు. ఈ ఖర్ప వినాయకుడిని శేష మాధవుడు అంటారు. ఇదే శంఖ మాధవ లింగం. ఇక్కడే శంకుడు అనే రాక్షసుడు చంప బడ్డాడు. ఇది సరస్వతి నదీ ప్రవాహం. ఇది పర బ్రహ్మ రసాయనం ఇక్కడ సరస్వతి గంగా నది సంగమిస్తాయి. ఈయన బిందు మాధవుడు. సాక్షాత్తు లక్ష్మీ పతి. ఇక్కడ స్నానం చేస్తే పునర్జన్మ ఉండదు. బిందు నాధుడు ప్రణవ స్వరూపుడు ఈమె మంగళ గౌరీ ఇది గభస్తేశ్వర లింగం. దీనికి మయూఖాదిత్యుడని పేరు. మృకండుముని కుమారుడు మార్కండేయుడు స్తాపించిన మార్కండేయ లింగమిది. ఇది కిరణేశ్వర లింగం, ఇది దౌత పాపెశ్వర లింగం, ఈయన మణి ప్రదీప నాగుడు ఇది కపీశ్వరలింగం కోతులకు కూడా మొక్షాన్నిస్తుంది. ఇది ప్రియ వ్రాతెశ్వర లింగం. ఈయన కాల రాజు. కలికాలపు పాపాలన్నీ పోగొట్టు తాడు ఇది దివ్య మందాకినీ నది. ఇది రత్నేశ్వర లింగం. ఇదే కృత్తి వాస లింగం, ఇదే ఓంకారేశ్వర లింగం శివుని కన్ను వంటిది. ఇది గోకర్నేశ్వర లింగం శివుని చెవుల వంటిది, ఈ రెండు లింగాలు విశ్వేసుని చేతులు. ధర్మేశ,మణి కర్నేశులు విశ్వేషుని హస్తాలు. కాళేశ్వర కపర్దేశ్వర లింగాలు ఆయన పదాలు. జ్యేష్టేశ్వరుడు అయన పిరుదు. మధ్యేశ్వరుడు ఆయన నాభి. శ్రుతీశ్వర లింగం శివ జటా జూతం చంద్రేశుడు ఆయన హృదయం. వీరేశ్వరుడు ఆత్మ, ఆయన లింగమే కేదారేశ్వరుడు. ఇక్కడున్న కోటాను కోట్ల లింగాలు ఆయన గోళ్ళు, రోమాలు ఆభరణాలు విశ్వేషుని దక్షిణ హస్తం మోక్ష దాయిని. భగవతి దుర్గా దేవి పితృ లింగం. ఈమె చిత్ర ఘంటేశ్వారి. ఇది ఘంటా కర్ణుని మడుగు. ఈ విశాలాక్షి లలితా గౌరీ స్వరూపు రాలు ఇతడు అవినాశుడు. ఇది ధర్మ కూపం ఈమె విశ్వ భుజా దేవి. లోకాలనేలే చల్లని తల్లి. ఈమె బందీ మహాదేవి త్రైలోక్య వందిత. ఇది దశాశ్వ మేధ తీర్ధం ఇది ప్రయాగ తీర్ధం. తీర్ధరాజం అంటారు ఇదే గంగా కేశవా తీర్ధం మోక్ష ద్వారం స్వర్గ ధామం అంటూ ఆమె ఆ చిత్రం లో కాశీ లో ఉన్న సకల దేవతా గణాన్ని తీర్ధాలను చూస్తూ పులకించి పోయింది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List