తిరుచెందూర్ లో నివసించే ఒక సాధువు వద్ద సుబ్రహ్మణ్యేశ్వరుని ప్రతిమ ఒకటి వున్నది. ఆ సాధువు నిత్యమూ సముద్ర స్నానం చేసి అడవిలో పూచే రక రకాల పుష్పాలు కోసుకుని వచ్చి పూజలు చేస్తూండేవాడు.
ఆ సాధువు దీర్ఘదర్శి.తనకు అంత్యకాలం ముందే తెలుసు. అందువలన తాను మరణించడానికి ముందే తన దగ్గరున్న మురుగన్ ప్రతిమను వేరెవరైనా భక్తుడి ఇవ్వాలని కుమారస్వామి అనుగ్రహించాలని మనసారా ప్రార్ధించాడు.
ఆనాటి రాత్రి కుమారస్వామి ఆ సాధువు కలలో ఒక వృధ్ధునిగా అగుపించి ఆ సాధువుని కొండల్లో గుట్టల్లో ,అడవుల్లో త్రిప్పాడు . ఒక ఉద్యనవనంలో ధ్యానంలోవున్న ఒక వ్యక్తిని చూపి, అతనికి ఆ దేవుని విగ్రహాన్ని అప్పగించమని చెప్పి అదృశ్యమైపోయాడు.
స్వప్నం లో మురుగన్ తీసుకువెళ్ళిన దిశలో పయనించిన సాధువు కలలో కనిపించిన వ్యక్తిని కలుసుకున్నాడు. తను పూజిస్తున్న పంచలోహ విగ్రహాన్ని అతనికి యిచ్చి భక్తితో పూజించమని చెప్పాడు.
ఆ వ్యక్థి ఓ పూతోటలో కుమారస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించసాగాడు. ఆరంభంలో ఆ తోటలోని చిన్న కుటీరంలో ప్రారంభమైన ఆ ఆలయం కాలక్రమేణా అభివృద్ధి చెంది పెద్ద ఆలయంగా రూపొందింది.
ఈ విధంగా మురుగనే భక్తులకు స్వయంగా స్వప్నంలో ఆనతి యిచ్చి నిర్మించబడిన ఆలయమే తంజావూరు
పూక్కారతెరు అనే వీధిలో నిర్మించబడిన సుప్రసిధ్ధ మురుగన్ ఆలయం.
ఈ ఆలయంలోని మురుగన్ కి విశాఖ నక్షత్రం రోజున అభిషేకం చేసి పూజించిన కార్యసిద్ధి లభిస్తుంది. కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు ధృఢంగా నమ్ముతారు.
No comments:
Post a Comment