శైవుల ప్రప్రధమ శివాలయం ఉత్తర కోసం మంగై మంగళ నాథ స్వామి ~ దైవదర్శనం

శైవుల ప్రప్రధమ శివాలయం ఉత్తర కోసం మంగై మంగళ నాథ స్వామి





ఈ లోకంలో ప్రప్రధమ శివాలయం ఉత్తరకోస మంగై మంగళనాధ స్వామి శివాలయం అని శైవులు ధృఢంగా చెప్తారు. దేవతలంతా ఉత్తరకోసమంగైలోనే మొదటిసారిగా ఆరుద్రా దర్శనం చేసుకున్నారని ప్రతీతి. ఇక్కడ వెలసిన పరమేశ్వరుడు స్వయంభూ ఈశ్వరుడని, కళ్యాణ సుందరేశ్వరుడని, ప్రళయకేశ్వరుడు, కైతై వనేశ్వరుడని, దురితపావకుడని, ఇలవంతికేశ్వరుడని పలు పేర్లతో పిలువబడుతూ బదరీవృక్షం క్రింద ప్రతిష్టించబడ్డాడు.


మూల విరాట్ మంగళనాధుడు స్వయంభూరూపంగా చతురస్ర పానువట్టంలో దర్శనమిస్తున్నాడు.

అమ్మవారు మంగళాంబికాదేవి తన హస్తమునందు జపమాలతో దర్శనమిస్తున్నది. బలమైన వాద్య శబ్దాలకి మరకతం వంటి సున్నితమైన శిల బీటలు దీస్తుంది . అటువంటి సున్నితమైన మరకత శిలతో నటరాజ స్వామి విగ్రహం చేయబడినది. విగ్రహం 5 అడుగుల ఎత్తు వుంటుంది. ప్రపంచంలోనే అపురూప శిల్పంగా ఈ నటరాజ శిల్పం కీర్తించబడుతున్నది.


ఇక్కడ నిత్యమూ మధ్యాహ్నం మరకత లింగానికి, స్ఫటిక లింగానికి జరిపే అభిషేకాలు విశేషమైనవి. ఈ ఆలయ స్ధలవృక్షమైన బదరీ వృక్షం 3000వేల సంవత్సరాల పురాతనమైనదని చెప్తారు. ఈ ఉత్తరకోసమంగై ఆలయంలో ప్రాతఃకాల పూజలో అమ్మవారు ఈశ్వరుని పూజించడం ఐహీకం. ఆ విధంగానే నాయన్మరులలో ఒకరైన మాణిక్యవాచకర్ అనే పరమ శివభక్తుడు అమరజీవిగా వరం పొంది పరమేశ్వరునికి ఆహారం కైంకర్యం చేస్తాడని భక్తులు విశ్వసిస్తారు. 


తిరుప్పెరుంతురైలో మాణిక్యవాచకర్ కి పరమశివుడు స్వయంగా దర్శనమిచ్చిన తరువాత తిరిగి  దర్శనమిచ్చిన ఆలయం ఉత్తరకోసమంగై. మాణిక్యవాచకర్ తమ తిరువాచక గ్రంధంలో 38 చోట్ల యీ ఆలయాన్ని గురింఛి కీర్తించారు. మంగళనాధుని ఆలయానికి ఉపాలయంగా స్వయంభూ వారాహి అమ్మవారి ఆలయం సమీపముననే వున్నది. ఈ అమ్మవారు ప్రాచీనకాలంలో "మంగై బిడారి" అని పిలువబడినది.


రామేశ్వరం వలెనే యీ ఆలయ ప్రాకారం అంతా విశాలమైన మండపములతో బ్రహ్మాండంగా నిర్మించబడినది.

ఒకే రోజు మూడువేళలా మంగళనాధుని దర్శనం చేసుకుంటే పునర్జన్మ లేని మోక్షం పొందుతారని భక్తులు ధృఢంగా నమ్ముతారు.  పితృశాపంతొలగడానికి, వివాహ అడ్డంకులు తీరడానికి, సంతాన భాగ్యం కలగడానికి, విదేశయానాలలో ఏ అడ్డంకులు కలుగకుండా వుండడానికి భక్తులు యీ ఆలయానికి వచ్చి ఈశ్వరుని పూజించి శుభాలు పొందుతారు .


రాత్రి 7..30 కి జరిగే పవళింపు సేవలో పాల్గొని పూజించిన వివాహయోగం మాంగల్యబలం కలుగుతాయి.


మదురై.. రామనాధపురం మార్గంలో రామనాధపురానికి 10 కి.మీ దూరంలోకుడి ప్రక్కగా విడిపోయి తూత్తుకుడి .. తిరుచ్చెందూరు వెళ్ళే మార్గంలో 15 కి.మీ దూరంలో  ఉత్తరకోస మంగై ఆలయం వున్నది.

 

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List